Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికలు

జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి సనాయీ తకాయిచి నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 465 సీట్లున్న దిగువ సభకు 2026, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగ్గా.. అధికార కూటమి మూడింట రెండొంతులకుపైగా స్థానాలను దక్కించుకుంది. తకాయిచికి చెందిన లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) 316 సీట్లలో విజయం సాధించింది. దీంతో దిగువ సభలో సొంతంగా పూర్తి మెజార్టీని అది దక్కించుకున్నట్లయింది.

Current Affairs

ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో మోదీ భేటీ

మలేసియా పర్యటనలో భాగంగా 2026, ఫిబ్రవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ పుత్రజయ నగరం వేదికగా ఈ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీ కండక్టర్లు సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి 11 ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్, మలేసియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. రెండు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

Current Affairs

డాక్టర్‌ రాకేశ్‌ కలపాల

డాక్టర్‌ రాకేశ్‌ కలపాల.. ‘ఫెలోషిప్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ(ఎఫ్‌ఈఎస్‌జీఈ)’ గౌరవాన్ని పొందారు. యూరోపియన్‌ సొసైటీ అందించే ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికైన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో సెంటర్‌ ఫర్‌ ఒబిసిటీ, మెటబాలిక్‌ థెరపీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ డైరెక్టర్‌గా ఉన్నారు.

Current Affairs

ఆర్థిక సంఘం నివేదిక

గత 11 ఏళ్లలో రెండు ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులు తారుమారైనట్లు ఆర్థిక సంఘం నివేదికలోని అంశాల విశ్లేషణ ఆధారంగా వెల్లడైంది. పన్నులు, గ్రాంట్ల రూపంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల కంటే వాస్తవంగా రాష్ట్రాల ఖజానాలకు చేరిన మొత్తం దాదాపు 20% తగ్గగా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రాష్ట్రాలకు వచ్చిన వాస్తవ మొత్తం 23% పెరిగింది. గత రెండు ఆర్థిక సంఘాల కాలంలో అవి సిఫార్సు చేసిన పన్నులు, గ్రాంట్ల మొత్తంకన్నా రాష్ట్రాలకు 0.42% మొత్తం అధికంగా వచ్చింది. గత 11 ఏళ్లలో పన్నుల రూపంలో రూ.90,28,122 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.17,71,438 కోట్లు కలిపి రూ.1,07,99,562 కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేయాలని అవి సిఫార్సు చేశాయి. వాస్తవంగా పన్నుల రూపంలో రూ.93,82,951 కోట్లు (+3.93%), గ్రాంట్ల రూపంలో రూ.14,62,475 కోట్లు (-17,44%) వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కాలంలో పన్నుల్లో వాటాలో 21.05%, గ్రాంట్లలో 8.85% మేర కోతపడింది. 15వ ఆర్థిక సంఘం ఒక్క 2020-21 సంవత్సర కాలానికి విడిగా చేసిన సిఫార్సుల్లో పన్నుల్లో 30.39%, గ్రాంట్లలో 8.43% మేర ఆదాయం తగ్గింది. అదే ఆర్థిక సంఘం 2021-26 మధ్యకాలానికి చేసిన సిఫార్సుల్లో పన్నుల వాటా 34.23% పెరగ్గా, గ్రాంట్లు 23.66% తగ్గాయి.

Current Affairs

2-నానోమీటర్‌ సెమీకండక్టర్‌

కొత్తతరం అవసరాలకు అనుగుణంగా నానో మీటర్‌ సెమీకండక్టర్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 7న బెంగళూరులో ఆవిష్కరించారు. క్వాల్‌కమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన 2నానోమీటర్‌ (ఎన్‌ఎం) సెమీకండక్టర్‌ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా ఆవిష్కృతమైందన్నారు. అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్స్‌లతో తయారైన ఈ చిప్‌లో 20-30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. జీపీయూ, సీపీయూల సామర్థ్యం ఒకే చిప్‌లో ఉన్న ఈ సెమీకండక్టర్‌ కొత్తతరం కృత్రిమ మేధను ఆటోమొబైల్స్, విమానాలు, హైస్పీడ్‌ రైళ్ల సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Current Affairs

వింటర్‌ ఒలింపిక్స్‌

వింటర్‌ ఒలింపిక్స్‌ ఇటలీలోని మిలన్‌లో 2026, ఫిబ్రవరి 7న ఘనంగా మొదలయ్యాయి. ఇటలీలోనే అతి పెద్ద స్టేడియమైన సా సిరోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పరేడ్‌లో అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ భారత మువ్వన్నెల పతాకాన్ని చేబూని మన బృందానికి నాయకత్వం వహించాడు. అతడు కాకుండా భారత్‌ నుంచి స్టాంజిన్‌ లండప్‌ మాత్రమే ఈ క్రీడల్లో పోటీపడుతున్నాడు. అల్పైన్‌ స్కీయింగ్‌లో అరిఫ్, క్రాస్‌ కంటీ స్కీయింగ్‌ స్టాంజిన్‌ అర్హత సాధించారు. మిలన్‌తో పాటు కోర్టినా డంపెజో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. 

Current Affairs

మోదీ మలేసియా పర్యటన

మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉమ్మడిగా రూపాంతరీకరణను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్‌-మలేసియా భాగస్వామ్యం’ (ఇంపాక్ట్‌) అనేదే రెండు దేశాలకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, ఇద్దరు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, ఒడిస్సీ తదితర శాస్త్రీయ నృత్యాలతో 800 మంది కళాకారులు మోదీని స్వాగతించడం ‘మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది.

Walkins

ఈఎస్‌ఐసీ జైపుర్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

జైపుర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ - 43 విభాగాలు: ఐసీయూ, అనస్థీషియాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ,   గైనకాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ తదితర విభాగాలు...   అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/పీజీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసి ఉండాలి. జీతం: నెలకు రూ.67,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 25. వేదిక: ఈఎస్ఐసీ  మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లక్ష్మీ నగర్, అజ్మీర్ రోడ్, జైపుర్, రాజస్థాన్ - 302006. Website:https://esic.gov.in/recruitments

Internship

స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ కంపెనీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ పోస్టు పేరు: హ్యూమన్‌ రిసోర్సెస్‌  నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌లొ నైపుణ్యం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.2,000 - రూ. 2,500.  వ్యవధి: 2 నెలలు దరఖాస్తు గడువు: 27-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-human-resources-hr-internship-at-stalwart-people-company-spc1769578807

Government Jobs

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో రెగ్యులర్‌ ప్రాతిపదికన మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, టాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 46 వివరాలు: 1. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ -28 2. టాక్స్ అసిస్టెంట్ - 18 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు టాక్స్ అసిస్టెంట్ పోస్టుకు  కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు టాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కు రూ.18,000 – రూ.56,900. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21. Website:https://incometaxgujarat.gov.in/