Posts

Current Affairs

షిన్‌కున్‌ లా సొరంగం

ప్రధాని నరేంద్రమోదీ 2024, జులై 26న షిన్‌కున్‌ లా సొరంగ పనుల ప్రాజక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. టన్నెల్‌ నిర్మాణప్రాంతం వద్ద తొలి బ్లాస్ట్‌ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. ఈ నిర్మాణం హిమాచల్‌ ప్రదేశ్, లద్దాఖ్‌లను అనుసంధానిస్తుంది. 

Current Affairs

అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా

అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను 2024, జులై 26న యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Current Affairs

కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను ఏటా జులై 26న నిర్వహిస్తారు. పాక్‌పై భారత్‌ విజయం సాధించడాన్ని గుర్తుగా దీన్ని జరుపుతారు. 2024 ఏడాదికి కార్గిల్‌ విజయ్‌ దివస్‌ ప్రారంభమై 25 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభుత్వం ‘రజత్‌ జయంతి వర్ష్‌’ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించారు. 

Current Affairs

పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగగా భావించే ఒలింపిక్స్‌ 2024, జులై 26న పారిస్‌లో ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెన్‌ నదిపై నిర్వహించారు. ఇవి ఆధునిక ఒలింపిక్‌ చరిత్రలో 33వ క్రీడలు. 2024, ఆగస్టు 11న ఇవి ముగుస్తాయి. పతకాంశాలు 329 కాగా, క్రీడాంశాలు 32. మొత్తం 35 వేదికల్లో వీటిని నిర్వహిస్తారు. అన్ని దేశాల నుంచి 10500 మంది అథ్లెట్లు పాల్గొంటారు. 

Walkins

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన  ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.   మొత్తం పోస్టులు: 22 వివ‌రాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 16 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II పోస్టుకు 28,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: 05-08-2024, 06-08-2024. వేదిక: సీఎస్‌ఐఆర్‌- సీఈసీఆర్‌ఐ, కరైకుడి. Website:https://www.cecri.res.in/Default.aspx

Government Jobs

స్టేట్ బ్యాంకులో ఆఫీసర్‌/ క్లరికల్‌ ఖాళీలు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పోర్ట్స్‌ కోటాలో ఆఫీసర్, క్లరికల్‌ స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 68 వివరాలు: 1. ఆఫీసర్‌: 17 2. క్లరికల్‌ స్టాఫ్: 51 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో సాధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. జీతం: నెలకు ఆఫీసర్‌ పోస్టుకు రూ.85,920, క్లరికల్‌ స్టాఫ్‌ పోస్టుకు రూ.64,840. గరిష్ఠ వయోపరిమితి: ఆఫీసర్‌ పోస్టుకు 30 ఏళ్లు, క్లరికల్‌ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌,  ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్ టెస్ట్‌ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-08-2024. Website:https://sbi.co.in/ Apply online:https://recruitment.bank.sbi/crpd-sports-2024-25-7/apply

Government Jobs

ఆర్‌బీఐలో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 94.  వివ‌రాలు:  1. ఆఫీసర్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- జనరల్- 66 2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఈపీఆర్‌- 21 3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- 07 అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ పే స్కేల్: నెలకు రూ.55,200 నుంచి రూ.99750. ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రి తేదీ: 16-08-2024 Website:https://rbi.org.in/home.aspx Apply online:https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4470

Government Jobs

ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 12 వివరాలు: అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. పే స్కేల్: నెలకు రూ.35,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.  దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024. Website:https://hc.ap.nic.in/

Freshers

కిండ్రిల్‌లో కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టులు

కిండ్రిల్‌ కంపెనీ కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ కంపెనీ: కిండ్రిల్‌  అర్హత: ఏదైనా డిగ్రీ. నైపుణ్యాలు: 0-1 సంవత్సరం కస్టమర్ సర్వీస్/ టెక్నికల్ సపోర్ట్ అనుభవం, విండో 10 ట్రబుల్‌షూటింగ్, కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 23.8.2024 Website:https://kyndryl.wd5.myworkdayjobs.com/KyndrylProfessionalCareers/job/Hyderabad-Telangana-India/Customer-Service-Representative_R-21374

Freshers

కార్నర్‌స్టోన్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టులు

కార్నర్‌స్టోన్ కంపెనీ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- ఆర్‌ఓఆర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  పోస్టు: అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-ఆర్‌ఓఆర్‌ కంపెనీ: కార్నర్‌స్టోన్  అర్హత: ఏదైనా డిగ్రీ. నైపుణ్యాలు: రూబీ ఆన్ రైల్స్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్, డేటాబేస్ కాన్సెప్ట్‌లపై అవగాహన, ట్రబుల్‌షూటింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 20.8.2024 Website:https://cornerstone.csod.com/ux/ats/careersite/2/home/requisition/9719?c=cornerstone