Posts

Government Jobs

Various Posts In CIPET, Chennai

Central Institute of Petrochemicals Engineering and Technology (CIPET), Chennai invites online applications for the following posts on contract basis. No. of Posts: 07 Details: 1. Consultant (Skill Development)- 02 2. Analyst (Skill Development) 03 3. Qualified/ Semi-Qualified CA/CMA- 02 Eligibility: CA/CMA, Degree, PG in the relevant discipline as per the post and work experience. Salary: Per month Rs.70,000 for Consultant; Rs.50,000 for Analyst; Rs.35,000-Rs.70,000 for Qualified/Semi-Qualified CA/CMA. Last Date of Online Application: 21.04.2025. Website:https://www.cipet.gov.in/

Government Jobs

Tutor Posts In AIIMS Guwahati

All India Institute of Medical Sciences (AIIMS) Guwahati is inviting applications for the recruitment of Tutor vacancies on direct recruitment basis in the College of Nursing. Details: Tutor/ Clinical Instructor- 05 Eligibility: B.Sc Nursing/ Post B.Sc Nursing degree in the relevant discipline as per the post and work experience. Age limit: Not more than 35 years. Salary: Rs.56,100- Rs.1,77,500 per month. Application fee: Rs.1500 for General/OBC/EWS candidates, no fee for SC/ST, Divyang. Selection process: Based on shortlisting, interview etc. Last date for online applications: 05-05-2025. Website:https://aiimsguwahati.ac.in/page/recruitapplication

Admissions

Ph.D Admissions In NIEPA, Delhi

National Institute of Educational Planning and Administration (NIEPA), Delhi invites online applications for Ph.D admissions for the academic year 2025-26. Details: Ph.D (Full Time/ Part Time) Eligibility: Masters Degree, Post Graduate Degree in the relative disciplines. Selection Process: Based on Written Test and Interview. Application Fee: Rs.800. Rs.400 for SC/ST/PwD candidates. Online Applications Last Date: 30-04-2025. Written Exam date: May 31. Interview date: June 05, 06. Website:https://www.niepa.ac.in/

Admissions

MBA Admissions In IIIT Allahabad

International Institute of Information Technology (IIIT), Allahabad, Uttar Pradesh invites applications for admissions to its two-year MBA programme for the academic year 2025-26. Details: Master of Business Administration (MBA) Programme Total number of seats: 95. Eligibility: Degree pass with at least 60% marks and CAT/ XAT/ CMAT/ MAT/ GMAT score. Selection Process: Based on IMAT (IIIT Management Administration Test), Group Discussion, Interview Application Fee: Rs.1200 for General/OBC Candidates; Rs.600 for SC/ST/Divyang. Online Application Last date: 18-05-2025. Date of Written Examination (IMAT): 02.06.2025. Interview Date: 02, 03-06-2025. Website:https://mba.iiita.ac.in/admission.html Apply online:https://apply.iiita.ac.in/application/authenticate/mba/

Current Affairs

ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ

కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, వ్యయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)లను 28కి తగ్గించనున్నారు. ఇందుకోసం ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏకీకరణ అంశానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయని, నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. విలీనం కాబోతున్న ఆర్‌ఆర్‌బీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో చెరి 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్‌ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో 2 చొప్పున ఉన్నాయి. 

Current Affairs

శాండ్‌ మాస్టర్‌ పురస్కారం

ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్ఠాత్మక ‘ది ఫ్రెడ్‌ డారింగ్టన్‌ బ్రిటిష్‌ శాండ్‌ ఆర్ట్‌ మాస్టర్‌ అవార్డ్‌ -2025’ దక్కింది. తద్వారా ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్‌లోని వేమత్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్న సుదర్శన్‌.. ప్రపంచశాంతి సందేశంతో 10 అడుగుల ఎత్తయిన వినాయకుని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 

Current Affairs

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా హితేశ్‌ గులియా చరిత్ర సృష్టించాడు. గాయం కారణంగా ప్రత్యర్థి ఒదెల్‌ కమరా (ఇంగ్లాండ్‌) 70కేజీ ఫైనల్లో వాకోవర్‌ ఇవ్వడంతో హితేశ్‌ విజేతగా నిలిచాడు.  మరో భారత బాక్సర్‌ అభినాష్‌ జమ్వాల్‌ (65కేజీ) రజతం నెగ్గాడు. ఫైనల్లో అతడు బ్రెజిల్‌కు చెందిన యురి రీస్‌ చేతిలో ఓడిపోయాడు. భారత్‌ మొత్తం ఆరు పతకాలతో ప్రపంచ బాక్సింగ్‌ కప్‌ను ముగించింది. 

Current Affairs

పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెన

రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఏప్రిల్‌ 6న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వంతెనతో పాటు పట్టాలకు రూ.700 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం-తాంబరం ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 

Current Affairs

కేంద్ర గణాంకాల శాఖ నివేదిక

కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’ నివేదిక ప్రకారం, జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు కొన్నేళ్లుగా తగ్గుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 1971లో గరిష్ఠంగా 2.2%గా నమోదైన జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు, 2036 నాటికల్లా 0.58%కు పడిపోనుందని పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధుల (60 ఏళ్లు పైబడినవారు) జనాభా బాగా పెరగనుంది. ఫలితంగా- ‘ఆధారపడేవారి నిష్పత్తి’ మారనుంది. ఇప్పటివరకూ పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా, ఇకమీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్‌ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు/యువత జనాభా ఎక్కువుండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్‌ అడుగు భాగం కుంచించుకుపోనుంది. వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌ జనాభా పెరగనుంది.

Current Affairs

ఎంవోఎస్‌పీఐ నివేదిక

2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వృద్ధి రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ) ఇటీవల నివేదిక విడుదల చేసింది. 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ, పీసీఐ సమాచారం ఇందులో ఉంది. ఆ వివరాల మేరకు, ఏపీ 8.21 శాతం వృద్ధి రేటును సాధించి.. దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి ర్యాంకులో ఉంది.   స్థిరమైన ధరల వద్ద (2011-12 ధరల ఆధారంగా) ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.8,65,013 కోట్లకు చేరింది. 2023-24లో జీఎస్‌డీపీ రూ.7,99,400 కోట్లుగా (రాష్ట్ర వృద్ధి రేటు 6.19 శాతం) ఉంది.  ఏపీ ప్రస్తుత ధరల వద్ద గత ఏడాది కంటే 12.02 శాతం వృద్ధి రేటుతో 5వ స్థానంలో ఏపీ నిలిచింది. తమిళనాడు 14.02, ఉత్తరాఖండ్‌ 13.59 , కర్ణాటక 12.77 , అస్సాం 12.74 శాతాలతో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత రాజస్థాన్‌ 12.02, హరియాణా 11.83 , మహారాష్ట్ర 11.73, మేఘాలయ 11.63, జమ్మూ కశ్మీర్‌ 11.19 శాతాల వృద్ధి రేటుతో మొదటి పది స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ (10.12 శాతం) 14వ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఏపీ జీఎస్‌డీపీ రూ.15,93,062 కోట్లకు చేరింది.