సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్ ఒకటి. తాజాగా నెస్ట్-2025 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు.
వివరాలు:
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025
సీట్ల రిజర్వేషన్:
నైసర్(200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్- 0, ఓబీసీ ఎన్సీఎల్- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.
సీఈబీఎస్(57 సీట్లు): జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్- 6, ఓబీసీ ఎన్సీఎల్- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.
అర్హత: సైన్స్ గ్రూప్లతో 2023, 2024లో ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.
వయసు: వయోపరిమితి లేదు.
ప్రశ్నపత్రం: పరీక్ష రెండు సెషన్లలో.. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి మూడున్నర గంటలు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్లో 20 ప్రశ్నలు అడుగుతారు.
ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆన్లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 17 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం: జూన్ 02.
పరీక్ష తేదీ: జూన్ 22.
Website:https://www.nestexam.in/