Posts

Current Affairs

The Indian Navy received Anjadip

♦ The Indian Navy received Anjadip, the third of eight Anti-Submarine Warfare Shallow Water Crafts (ASW SWC) on 22 December 2025, marking another milestone in the country’s indigenous naval shipbuilding programme. ♦ The vessel, designed and built in India by Garden Reach Shipbuilders and Engineers (GRSE), Kolkata, was delivered at Chennai. The project has been executed under a public-private partnership between GRSE and L&T Shipyard, Kattupalli, in accordance with the classification rules of the Indian Register of Shipping. ♦ Approximately 77 metres in length, the ASW SWC is the largest Indian naval warship to be propelled by waterjets. The craft is equipped with advanced lightweight torpedoes, indigenously developed anti-submarine rockets and shallow water sonar systems, enabling effective detection and engagement of underwater threats.  ♦ The ship is named after Anjadip Island, located off the coast of Karwar in Karnataka, and carries forward the legacy of the erstwhile INS Anjadip, a Petya-class corvette that was decommissioned in 2003.

Current Affairs

నౌకా దళంలోకి ‘అంజదీప్‌’

తక్కువ లోతు జలాల్లో సంచరించే జలాంతర్గాముల విధ్వంసక నౌక ‘అంజదీప్‌’ 2025, డిసెంబరు 22న నౌకాదళంలో చేరింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ తయారు చేసిన ఈ నౌకను లాంఛనంగా చెన్నైలో నౌకాదళానికి అందజేశారు. నౌకాదళంలో చేరిన ఈ కోవకు చెందిన నౌకల శ్రేణిలో ఇది మూడోది. వాటర్‌ జెట్స్‌ సాయంతో ముందుకు నడిచే ఈ నౌకలో అధునాతన తేలికపాటి టార్పిడోలు, దేశీయంగా రూపొందించిన సబ్‌మెరీన్‌ రాకెట్లు, షాలో వాటర్‌ సోనార్లు అమర్చి ఉన్నాయి. 

Current Affairs

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత, న్యూజిలాండ్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సంబంధించిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ 2025, డిసెంబరు 22న ప్రకటించారు. 2026 ప్రథమార్ధంలో సంతకాలు జరగనున్న ఈ ఎఫ్‌టీఏ కింద వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బి. డాలర్ల (సుమారు రూ.1.8 లక్షల కోట్ల) పెట్టుబడులను న్యూజిలాండ్‌ పెట్టనుంది.  రెండు దేశాల మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో 2.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,600 కోట్ల) మేర జరిగింది. ఇందులో వస్తువుల వాటా 1.3 బి.డా. (సుమారు రూ.11,700 కోట్లు). ఎఫ్‌టీఏ కుదిరాక, అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.45,000 కోట్ల)కు చేరే అవకాశం ఉంది.

Current Affairs

కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు గీతం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న కామన్‌వెల్త్‌ క్రీడల కోసం ప్రత్యేక హిందీ గీతం కేరళలో రూపొందింది. 2030లో జరిగే ఈ క్రీడల్లో ఈ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కోజికోడ్‌లోని మలబార్‌ క్రిస్టియన్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌ వశిష్ఠ్‌ దీనికి రూపకల్పన చేశారు. ఆయన మాజీ విద్యార్థి సాయి గిరిధర్‌ ఆలపించారు. కామన్‌వెల్త్‌ క్రీడలు ప్రపంచానికి భారత్‌ అందించే బహుమతి అంటూ గీతం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల యువత భాగస్వామ్యాన్ని వర్ణిస్తుంది. 

Current Affairs

ఇంటర్నేషనలైజేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా

విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల గురించి నీతి ఆయోగ్‌ 2025, డిసెంబరు 22న ‘ఇంటర్నేషనలైజేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ (దేశంలో ఉన్నతవిద్య అంతర్జాతీయీకరణ) పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. 2024 లెక్కల ప్రకారం మొత్తంగా 13.35 లక్షలమంది విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో 8.5 లక్షలమంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే ఉన్నారు. 2016-24 మధ్య 8.84% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు రూ.6.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారని, ఇది మన జీడీపీలో 2%కి సమానమని వివరించింది.  విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉన్నట్లు వెల్లడించింది.

Internship

8వ్యూస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని 8వ్యూస్‌ కాపీరైటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: 8వ్యూస్‌ పోస్టు పేరు: కాపీరైటింగ్‌  నైపుణ్యాలు: కంటెంట్‌ ఎడిటింగ్, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, కంటెంట్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, కాపీ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఆర్‌ఐఎస్‌), హ్యూమన్‌ రిసోర్సెస్, పర్ఫామెన్స్‌ మేనేజ్‌మెంట్, ట్యాలెంట్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.10,000 - రూ.15,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 07-01-2026. Website:https://internshala.com/internship/detail/copywriting-internship-in-hyderabad-at-8views1765197199

Government Jobs

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) రెగ్యులర్ ప్రాతిపదికన  వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 22 వివరాలు: 1.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 02 2. సీనియర్ మేనేజర్ - 06 3. మేనేజర్ - 08 4. డిప్యూటీ మేనేజర్ - 06 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు నుంచి 44 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ.2,60,000. సీనియర్ మేనేజర్‌ కు రూ.90,000 –రూ.2,40,000. మేనేజర్ కు రూ.80,000 – రూ.2,20,000. డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000 – రూ.2,00,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 02.01.2026.  Website:https://recruitment.eil.co.in/

Government Jobs

సీఎంఈఆర్‌ఐలో టెక్నీషియన్‌ పోస్టులు

పశ్చిమబెంగాల్‌, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: టెక్నీషియన్‌-I (గ్రూప్‌-2): 20  ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌/మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డిజిటల్‌ ఫోటోగ్రఫీ. అర్హత: టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్‌ ఉండాలి. జీతం: నెలకు రూ.37,000  వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 21.01.2026. Website:https://www.cmeri.res.in/

Government Jobs

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జీడీ) ఉద్యోగాలు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) 2025 ఏడాదికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్-మినిస్టీరియల్‌ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  వివరాలు:  స్పోర్ట్స్‌ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): మొత్తం ఖాళీలు 549  (పురుషులు: 277, మహిళలు: 272 ) క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితరాలు. అర్హతలు: అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (టెన్త్‌) లేదా తత్సమాన విద్యార్హతతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులు అయి ఉండాలి. గత రెండు సంవత్సరాల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు లేదా పాల్గొన్న వారు అర్హులు. వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది. వేతనం: నెలకు రూ.21,700- రూ.69,100.  ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), మెరిట్ లిస్ట్‌ (స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా), ధ్రువపత్రాల పరిశీల, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ఓబీసీ/ఓబీసీ (పురుషులు): రూ.159. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభం: 27.12.2025. దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026.  Website:https://rectt.bsf.gov.in/

Government Jobs

ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)  -128 విభాగాలు: అనాటమీ, అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,  కార్డియాలజీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, సైకియాట్రీ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వమోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.67,700. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.15,00.ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026.  Website:https://aiimsbhopal.edu.in/index_controller/career