Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

మహిళా డైరెక్టర్‌ లేని కంపెనీలు

ప్రభుత్వ రంగ కంపెనీలు సహా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 179 సంస్థల్లో ఒక్క మహిళా డైరెక్టర్‌ కూడా లేరు. కంపెనీల చట్టం - 2013 ప్రకారం, నిర్దిష్ట కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ అయినా ఉండాలి. ప్రతి నమోదిత కంపెనీకీ ఈ నిబంధన వర్తిస్తుంది. రూ.100 కోట్లు - అంతకంటే ఎక్కువ పెయిడప్‌ క్యాపిటల్‌ ఉండి, టర్నోవరు రూ.300 కోట్ల కంటే అధికంగా ఉన్న పబ్లిక్‌ కంపెనీలన్నీ బోర్డులో కనీసం ఒక మహిళను నియమించుకోవాలి. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ఉండాల్సిన 708 ప్రభుత్వ యాజమాన్య సంస్థల్లో (ప్రభుత్వ రంగ కంపెనీలు సహా) 529 కంపెనీలే ఈ నిబంధన పాటించాయి. 179 కంపెనీలు ఒక మహిళనూ తమ బోర్డులో చేర్చుకోలేదు. వివిధ పాలనపరమైన కారణాల వల్ల ఆయా కంపెనీల బోర్డుల్లో మహిళల నియామకం జరగలేదని లోకసభకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా తెలిపారు. 

Current Affairs

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంపు

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 2026, మార్చి 23న ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది.  నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్‌ చట్టం, డీలిమిటేషన్‌ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకువస్తుంది. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి వెంటనే సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి.

Walkins

సీఈసీఆర్‌ఐలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈసీఆర్‌ఐ).. సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌-గేట్‌ స్కీం ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): 05 ఖాళీలు అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ ఉండాలి. వేతనం: నెలకు మొదటి రెండు సంవత్సరాలు రూ.37,000; మూడో ఏడాది రూ.42,000. వయోపరిమితి: 10.04.2026 నాటికి 28 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు చివరి తేదీ: 07.04.2026. ఇంటర్వ్యూ తేదీ: 10.04.2026. వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ, కరైకుడి. Website:https://www.cecri.res.in/cecri/Default.aspx

Government Jobs

ఐసీఎస్‌ఐలో పోస్టులు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు:  1. అసిస్టెంట్‌ డైరెక్టర్‌- 03 2. జాయింట్‌ డైరెక్టర్‌- 02 3. డిప్యూటీ డైరెక్టర్‌- 05 4. ఎగ్జిక్యూటివ్‌- 04 5. అసిస్టెంట్‌ ఇంజినీర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ ఉత్తీర్ణత ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు జాయింట్‌ డైరెక్టర్‌కు రూ.78,800- రూ.2,09,200; డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.67,700- రూ.2,08,700; అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు రూ.56,100- రూ.1,77,500; ఇతర పోస్టులకు రూ.47,600- రూ.1,51,100. వయెపరిమితి: 01.03.2026 నాటికి జాయింట్‌ డైరెక్టర్‌కు రూ.50ఏళ్లు; ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌కు 35ఏళ్లు; డిప్యూటీ డైరెక్టర్‌కు 40 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు చివరి తేదీ: 12.04.2026. Website:https://www.icsi.edu/careers/

Government Jobs

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోర్ట్‌మాస్టర్‌, పర్సనల్‌ సెక్రటరీ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి  డైరెక్ట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ (గౌరవ న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లకు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  వివరాలు: కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ: మొత్తం పోస్టులు 32. (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: 20 పోస్టులు, బదిలీ ద్వారా 12 పోస్టులు) అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా డిగ్రీ (3 ఏళ్లు లేదా 5 ఏళ్లు) పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 180 పదాల వేగంతో ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ (లేదా 150 డబ్ల్యూపీఎం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు), నిమిషానికి 45 పదాల వేగంతో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్లు,  దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.57,100 నుంచి రూ. 1,47,760. ఎంపిక విధానం: అభ్యర్థులకు 100 మార్కులకు రాత పరీక్ష (Shorthand Dictation & Transcription) నిర్వహిస్తారు. ఇందులో 180 w.p.m (3 నిమిషాల వ్యవధి), 150 w.p.m (4 నిమిషాల వ్యవధి) వేగంతో డిక్టేషన్ ఇచ్చి, వాటిని కంప్యూటర్లలో ట్రాన్స్‌క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఓసీ/ఈడబ్ల్యూఎస్‌/బీసీలకు రూ.600; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2026. ముఖ్యాంశాలు: దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా ఉండాలి రిజర్వేషన్ చేసుకునే వారు సంబంధిత తాజా కుల/ఆదాయ ధ్రువపత్రాలను సమర్పించాలి. Website:http://https//aphc.gov.in/

Government Jobs

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (ఏపీ హెచ్‌సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 300  వివరాలు: 1. సెక్షన్ ఆఫీసర్స్: 05 2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01 3. కంప్యూటర్ ఆపరేటర్: 31  4. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01  5. లైబ్రేరియన్ గ్రేడ్-II: 01  6. యూడీ స్టెనోగ్రాఫర్: 07  7. అసిస్టెంట్: 78  8. ఎగ్జామినర్: 27  9. టైపిస్ట్: 44  10. కాపీయిస్ట్: 34  11. డేటా ఎంట్రీ ఆపరేటర్: 50 12. స్టెనోగ్రాఫర్: 01  13. ఆఫీస్ సబార్డినేట్: 20  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/డిగ్రీ/బీటెక్‌/లా డిగ్రీ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. గరిష్ఠ వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  దరఖాస్తు ప్రారంభం: 30.03.2026. దరఖాస్తు చివరి తేదీ: 19-04-2026. Website:https://aphc.gov.in/recruitments.php?year=2026

Government Jobs

ఎయిమ్స్ మదురైలో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) మదురై ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ - 07 విభాగాలు: అనాటమీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, జనరల్ సర్జరీ తదితర విభాగాలు......  అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 5. Website:https://www.aiimsmadurai.edu.in/

Freshers

సదర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ పోస్టులు

సదర్లాండ్ కంపెనీ.. సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: పోస్టు: సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌  కంపెనీ: సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అర్హత: బీఈ/బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణత. నైపుణ్యాలు/ అనుభవం: డాట్‌ నెట్‌ టెక్నాలజీస్‌, ఎంవీసీ, సీ#, ఎస్‌క్యూఎల్‌ సర్వీస్‌, వెబ్‌సర్వీస్‌, రెస్ట్‌ ఏపీఐ, జావా స్క్రప్ట్‌, జేక్వెరీ, అనలాగ్‌ జేఎస్‌ తదితరాల అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 6.4.2026 Website:https://www.jobs.sutherlandglobal.com/job-details/senior-associate-software-development-in-healthcarest-jobs-1467646

Apprenticeship

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌), బిలాస్‌పుర్, వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఒక ఏడాది అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 100 వివరాలు: 1. ఆఫీస్ అసిస్టెంట్: 25 2. జనరల్ డ్యూటీ అసిస్టెంట్: 20 3. అసిస్టెంట్ మైన్ సర్వేయర్: 25 4.సెక్యూరిటీ గార్డ్: 30 విభాగాలు: ఆఫీస్ ఆపరేషన్స్, మైనింగ్ సర్వే, జనరల్ డ్యూటీ, సెక్యూరిటీ సర్వీసెస్.  అర్హత: సంబంధిత ట్రేడ్‌ల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. వేతనం: నెలకు రూ.8,200. ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ (మార్కుల శాతం) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  చివరి తేదీ: 31-03-2026. Website:https://www.apprenticeshipindia.gov.in/

Admissions

ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంటెక్‌, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) అండ్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు 2026 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు:  మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్ బై రిసెర్చ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (ఎంఎస్ (ఆర్‌))  డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్ సైన్స్‌ (పీహెచ్‌డీ) మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌) మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ (ఎంపీపీ) అర్హత: పోగ్రామ్‌లను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ ఎంఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ (ఎంఎస్‌ ఆర్‌, పీహెచ్‌డీ): 02.04.2026. దరఖాస్తు చివరి తేదీ (ఎంటెక్‌, ఎంపీపీ): 20.04.2026. Website:https://www.iittp.ac.in/