జిప్‌మర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) పుదుచ్చెరి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్: 10 విభాగాలు: క్లినికల్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ(సర్జికల్), మెడిసిన్(హెమటాలజీ), నియోనెటాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, డెర్మటాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎం, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 21వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.1,42,506. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21. Website:https://jipmer.edu.in/announcement