Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Dr. Jitendra Singh

♦ Union Minister of State (Independent Charge) for Science and Technology Dr. Jitendra Singh on 4 February 2026 launched the first open call of the Technology Development Board (TDB) under the Research, Development and Innovation (RDI) Fund, marking a major step towards strengthening India’s innovation ecosystem through structured, long-term financing for indigenous technologies. The initiative, unveiled under the Anusandhan National Research Foundation (ANRF), aims to support the commercialisation of high-risk, high-impact technologies and represents a significant shift from conventional government funding models.  ♦ The RDI Fund has a total corpus of Rs.1 lakh crore and offers concessional financing at interest rates of around 2 - 4 percent, with repayment tenures of up to 15 years, including moratorium provisions. ♦ The RDI Fund was approved by the Union Cabinet in July 2025 and formally launched by Prime Minister Narendra Modi in November 2025 as part of the government’s long-term strategy to build indigenous technological capabilities and strengthen India’s innovation-driven economy.

Current Affairs

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. దీని వల్ల ఏటా లక్షలాది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇందులో శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి, ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ట్రిలియన్ల కణాలతో కూడిన మానవ దేహంలో ఎక్కడైనా క్యాన్సర్‌ రావొచ్చు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థ చికిత్స పొందడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా  ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం’గా (World Cancer Day) నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేలా చేయడంతో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంపై ప్రపంచ దేశాలను ఏకం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం క్యాన్సర్‌ను నిర్మూలించే లక్ష్యంతో 2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో ‘వరల్డ్‌ క్యాన్సర్‌ సమ్మిట్‌ ఫర్‌ ది న్యూ మిలీనియం’ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాటి యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ కిచిరో మట్సురా, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు జాక్వెస్‌ చిరాక్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పారిస్‌ చార్టర్‌పై సంతకాలు చేశారు. ఈ సదస్సు జరిగిన తేదీకి గుర్తుగా ఏటా ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని యూఐసీసీ తీర్మానించింది. 

Current Affairs

సిగ్మా, ఇంద్రజాల్‌ మధ్య ఒప్పందం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ నిరోధక వ్యవస్థల తయారీకి సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (మెగాసాఫ్ట్‌)తో ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు లభించొచ్చని ఈ సంస్థలు వెల్లడించాయి.  ఈ ఒప్పందం ప్రకారం, ఇంద్రజాల్‌ రూపొందించే కౌంటర్‌-డ్రోన్‌-వ్యవస్థలకు కీలకమైన రాడార్, సెన్సార్‌ స్కానింగ్, జామింగ్, స్పూఫింగ్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను సిగ్మా ప్రత్యేకంగా రూపొందించి, సరఫరా చేయనుంది. 

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ స్వర్ణం నెగ్గింది. 2026, ఫిబ్రవరి 4న దిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి పతకం గెలిచిన ఇషా.. టీమ్‌ విభాగంలోనూ స్వర్ణాన్ని దక్కించుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇషా (239.8) అగ్రస్థానంలో నిలిచింది. చైనీస్‌ తైపీ అమ్మాయిలు చెంగ్‌ యెన్‌ చెంగ్‌ (235.4), యీ అయ్‌ వెన్‌ (217.7) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు.  మహిళల టీమ్‌ విభాగంలో సురుచి (576), ఇషా (575), మను (575)లతో కూడిన భారత జట్టు (1726) పసిడి కైవసం చేసుకుంది. వియత్నాం (1713) రజతం, చైనీస్‌ తైపీ (1711) కాంస్యం గెలిచాయి. 

Current Affairs

మణిపుర్‌ సీఎంగా ఖేమ్‌చంద్‌ ప్రమాణం

మణిపుర్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ (62) 2026, ఫిబ్రవరి 4న ప్రమాణం చేశారు. గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన నెమ్చా కిప్‌గెన్‌ (భాజపా), నాగా సామాజిక వర్గానికి చెందిన నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) శాసనసభ్యుడు ఎల్‌ డిఖో ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. జాతుల మధ్య ఘర్షణలతో 2023 మే 3 నుంచి మణిపుర్‌ అతలాకుతలమైంది. ఈ ఘర్షణల్లో దాదాపు 260మంది మృత్యువాతపడ్డారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో 2025, ఫిబ్రవరి 9న అప్పటి సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13 నుంచి మణిపుర్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది. 

Walkins

ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ గోరఖ్‌పుర్ (ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు - 08 వివరాలు: 1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II (నాన్-మెడికల్) - 04  2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III    - 02 3. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్    - 01 4. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీ (బయోస్టాటిస్టిక్స్, పాపులేషన్ జియోగ్రఫీ / డెమోగ్రఫీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.29,200. - రూ.80,400. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 21-02-2026 ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 23, వేదిక: కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం అకడమిక్ బ్లాక్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్.  Website:https://aiimsgorakhpur.edu.in/current-notices/

Internship

డ్యూటీపర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డ్యూటీపర్‌ కంపెనీ డిజిటల్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: డ్యూటీపర్‌ పోస్టు పేరు: డిజిటల్‌ మార్కెటింగ్‌  నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.2,000 - రూ. 5,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 20-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-dutypar-ai-technologies-private-limited1768973474

Government Jobs

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టు (టీజీహెచ్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 43  వివరాలు: 1. ఆఫీస్‌ సబార్డినేట్‌: 34 2. డ్రైవర్‌: 09 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, టెన్త్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 - రూ.58,850, డ్రైవర్‌ పోస్టులకు రూ.22,900 - రూ.69,150. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: డ్రైవర్‌ పోస్టులకు రూ.500, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 7. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28. Website:https://tshc.gov.in/showChildDocTypes?id=95

Government Jobs

జిప్‌మర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) పుదుచ్చెరి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 10 విభాగాలు: క్లినికల్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ(సర్జికల్), మెడిసిన్‌(హెమటాలజీ), నియోనెటాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, డెర్మటాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డీఎం, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 21వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.1,42,506. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21. Website:https://jipmer.edu.in/announcement

Government Jobs

ఐఏఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దిల్లీలోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 16 వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 03 2. యంగ్‌ ప్రొఫెషనల్-2: 10 3. ల్యాబ్‌ అసిస్టెంట్‌: 03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.61,000 - రూ.67,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2కు రూ.42,000, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.30,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 14. Website:https://www.iari.res.in/bms/announcements/jobs.php