Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

భారత్‌ ట్యాక్సీ

దేశంలోనే తొలిసారిగా, సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘భారత్‌ ట్యాక్సీ’ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా 2026, ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు దిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లలో అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లలో దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలన్నది లక్ష్యం. ఈ యాప్‌తో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అమిత్‌ షా వెల్లడించారు. 

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురుచి సింగ్‌-సామ్రాట్‌ రాణా జోడీ రజతం నెగ్గింది. 2026, ఫిబ్రవరి 5న దిల్లీలో జరిగిన ఫైనల్లో ఈ ద్వయం 479.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నిగ్‌లినా-కమలోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) జంట 481.3 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణాన్ని నెగ్గింది. చెంగ్‌-చెన్‌ (చైనీస్‌ తైపీ, 412.2) కాంస్యం సొంతం చేసుకుంది. 

Current Affairs

డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీ

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 2026, ఫిబ్రవరి 5న వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది.  దిల్లీ క్యాపిటల్స్‌ మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్‌ చేసింది. డబ్ల్యూపీఎల్‌లో 204 పరుగులు అతిపెద్ద ఛేదన. గత రికార్డు కూడా ఆర్సీబీ (గుజరాత్‌పై 202)దే. 2024లోనూ  ఆర్సీబీ డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా నాలుగుసార్లు (2023, 2024, 2025, 2026) ఫైనల్‌లో ఓడింది.

Current Affairs

‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’

భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్‌ నాగికి ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2025 దక్కింది. 2026, ఫిబ్రవరి 5న దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం కింద రూబుల్‌ నాగీకి వర్కీ ఫౌండేషన్‌ 10 లక్షల డాలర్ల (సుమారు రూ.9కోట్లు) నగదు బహుమతిని అందించింది. రూబుల్‌ నాగి ఆర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆమె  దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదుల్లా మార్చేశారు. ఈ కారణంగానే ఆమెకు ఈ ప్రైజ్‌ దక్కినట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

Internship

ఇండికా ఏఐ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

ఇండికా ఏఐ కంపెనీ ఆడియో ట్రాన్‌స్క్రిప్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఇండికా ఏఐ పోస్టు పేరు: ఆడియో ట్రాన్‌స్క్రిప్షన్‌  నైపుణ్యాలు: మలయాళం, తెలుగు మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.3,000 - రూ.15,000. వ్యవధి: 1 నెల దరఖాస్తు గడువు: 28-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-audio-transcription-validation-telugu-malayalam-internship-at-indika-ai-private-limited1769663578

Government Jobs

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో ఉద్యోగాలు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3 (మెడికల్): 01 2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1: 01 3. ప్రాజెక్ట్ మేనేజర్: 01 4. టెక్నికల్‌ ఆఫీసర్‌-1: 02 5. ల్యాబ్‌ అటెండెంట్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఎండీ, ఎండీఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3 కి 45 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-1కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ మేనేజర్‌కు 40 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, ల్యాబ్‌ అటెండెంట్‌కు 35 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3 కి రూ.93,000, టెక్నికల్ సపోర్ట్-1కు రూ.18,000, ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.1,00,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.60,000, ల్యాబ్‌ అటెండెంట్‌కు రూ.30,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.236 నుంచి 590. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 24.  Website:https://thsti.res.in/en/Jobs

Government Jobs

ఎన్‌ఐటీ జలంధర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), జలంధర్ రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 101 వివరాలు: 1. ప్రొఫెసర్‌ - 15 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 30 3.అసిస్టెంట్ ప్రొఫెసర్ - 56 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ,ఎస్టీ, ఈడౠ్ల్యఎస్, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.1000. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 27. Website:https://www.nitj.ac.in/research/jobs.html

Government Jobs

మోర్ముగావ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 08 వివరాలు: 1. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01  2. ట్రైనీ పైలట్: 05  3. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్: 01  4. సీనియర్ డిప్యూటీ సెక్రటరీ: 01  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీటెక్/పీజీలో ఉత్తీర్ణుతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు రూ.50,000 - రూ.1,60,000. ట్రైనీ పైలట్ కు రూ.70,000 - 2,00,000.డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ & సీనియర్ డిప్యూటీ సెక్రటరీకు రూ.80,000 -రూ.2,20,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ద్వారా, చిరునామా: సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, మోర్ముగావ్ పోర్ట్ అథారిటీ గోవా - 403 804. దరఖాస్తు చివరి తేదీ: 17-02-2026. Website:https://mptgoa.gov.in/master-controller/careers 

Government Jobs

ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు

దిల్లీలోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్‌-2, యంగ్‌ ప్రొఫెషనల్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్‌-2: 02 2. యంగ్‌ ప్రొఫెషనల్-2: 02 3. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌-2కు రూ.35,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000, యంగ్ ప్రొఫెషనల్‌-2 కు రూ.42,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.  Website:https://www.iari.res.in/bms/announcements/jobs.php

Government Jobs

సీసీఆర్‌ఎస్ చెన్నైలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ చెన్నై (సీసీఆర్‌ఎస్‌), తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 14 వివరాలు: 1. రిసెర్చ్‌ ఆఫీసర్ (సిద్ధ) - 02 2. రిసెర్చ్‌ అసిస్టెంట్ (కెమిస్టీ) -02 3. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 09 4. లాబొరేటరీ అంటెండర్ - 01  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ, చెన్నై. దరఖాస్తు చివరి తేదీ: 30-03-2026. Website:https://siddhacouncil.com/ccrs/?page_id=187