Posts

Current Affairs

ఇలవేనిల్‌ వలరివాన్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన ఇలవేనిల్‌ వలరివాన్‌ కాంస్యం నెగ్గింది. 2025, జూన్‌ 10న మ్యూనిచ్‌ (జర్మనీ)లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ఆమె 231.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. వాంగ్‌ జిఫీయ్‌ (252.7) స్వర్ణం, వాన్‌ యుంజి (కొరియా, 252.6) రజతం సొంతం చేసుకున్నారు. ఇదే విభాగంలో రమ్య జిందాల్‌ (632.6), అనన్య నాయుడు (632.4).. వరుసగా 13, 15వ స్థానాల్లో నిలిచారు.

Government Jobs

ఎస్‌ఈఆర్‌సీలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) ఆధీనంలోని జాతీయ ప్రయోగశాల అయిన సీఎస్‌ఐఆర్‌-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ (ఎస్‌ఈఆర్‌సీ) చెన్నై వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10  వివరాలు: 1. జూనియర్ స్టెనోగ్రాఫర్ (జేఎస్‌టీ) - 2 (యూఆర్‌) 2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - జనరల్ - 6 పోస్టులు (యూఆర్‌-4 ఓబీసీ-1, ఎస్సీ-1) 3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - ఫైనాన్స్ & అకౌంట్స్ - 1 (ఓబీసీ) 4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - స్టోర్స్ & పర్చేజ్ - 1(ఎస్సీ) అర్హత: 10+2/XII లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. జేఎస్‌టీ: డీఓపీటీ నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ట వయోపరిమితి: జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు.  జీతం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200. దరఖాస్తు రుసుము: జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు లేదు.  ఎంపిక: స్టెనోగ్రఫీలో ప్రావీణ్య పరీక్ష, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2025. Website:https://serc.res.in/csir-recruitment

Government Jobs

ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) 2025 సంవత్సరానికి గాను కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీ చేయనుంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 14,582  వివరాలు: 1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్  2. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3. ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ 4. ఇన్‌స్పెక్టర్, (సెంట్రల్ ఎక్సైజ్) 5. ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) 6. ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్) 7. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ 8. సబ్ ఇన్‌స్పెక్టర్ 9. ఇన్‌స్పెక్టర్ పోస్టులు 10. ఇన్‌స్పెక్టర్ 11. సెక్షన్ హెడ్ 12. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 14. రీసెర్చ్ అసిస్టెంట్ 15. డివిజనల్ అకౌంటెంట్ 16. సబ్ ఇన్‌స్పెక్టర్ 17. సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 18. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 19. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II 20. ఆఫీస్ సూపరింటెండెంట్ 21. ఆడిటర్ 22. అకౌంటెంట్ 23. అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్ 24. పోస్టల్ అసిస్టెంట్/సోర్టింగ్ అసిస్టెంట్ 25. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్‌లు 26. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 27. ట్యాక్స్ అసిస్టెంట్ 28. సబ్-ఇన్‌స్పెక్టర్ అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ పోస్ట్లుకు టెన్‌+2 స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు  01.08.2025 నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేయవచ్చు. వయోపరిమితి: 01.08.2025  తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. జీతం:  పే లెవల్-7 నెలకు (రూ.44,900 – రూ.1,42,400) పే లెవల్-6 నెలకు (రూ.35,400 – రూ.1,12,400) పే లెవల్-5 నెలకు  (రూ.29,200 – రూ.92,300) పే లెవల్-4 నెలకు (రూ.25,500 – రూ.81,100) దరఖాస్తు ఫీజు: జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: టైర్-I (CBT) – ఆబ్జెక్టివ్ పరీక్ష. టైర్‌-II (CBT) – ఆబ్జెక్టివ్ పరీక్ష + స్కిల్ టెస్ట్‌లు. డాక్యుమెంట్ వెరిఫికేషన్. టైర్‌-I పరీక్ష: 13 – 30 ఆగస్టు 2025. టైర్‌-II పరీక్ష: డిసెంబర్ 2025. పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా అన్ని జోన్‌లలో ఉన్నాయి – నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. మూడు పరీక్ష కేంద్రాల ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 04 జూలై 2025. ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05 జూలై 2025. Website:https://ssc.gov.in/ Apply online:https://ssc.gov.in/login  

Freshers

అమెజాన్‌లో సపోర్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

అమెజాన్ కంపెనీ సపోర్ట్‌ ఇంజినీర్‌-II, సెల్లింగ్‌ పార్ట్‌నర్‌ ఎక్స్‌పీరియన్స్‌, సెల్లింగ్‌ పార్ట్‌నర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  సపోర్ట్‌ ఇంజినీర్‌-II,  అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, సాఫ్టవేర్‌ డెవెలప్‌మెంట్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ట్రబుల్‌షూటింగ్‌ అండ్‌ డీబగ్గింగ్‌ టెక్నికల్‌ సిస్టమ్‌, ఏడబ్ల్యూఎస్‌, నెట్‌వర్క్స్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అనుభవం ఉండాలి. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 6-7-2025 Website:https://www.amazon.jobs/en/jobs/2910415/support-engineer-ii-selling-partner-experience-selling-partner-experience  

Freshers

హ్యూలెట్‌లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టులు

హ్యూలెట్ కంపెనీ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్ట్: జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కంపెనీ: హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్. అర్హత: సీఎస్‌ఈ/ ఐటీ లేదా ఎంసీఏలో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. నైపుణ్యాలు: జావా, స్ప్రింగ్, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్ పని అనుభవం, ఎస్‌క్యూఎల్‌, నైపుణ్యాలు, క్లౌడ్-అవేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, రియాక్ట్ జేఎస్‌, టైప్‌స్క్రిప్ట్ తదితర యూఐ టెక్నాలజీల పరిజ్ఞానం కలిగి ఉండాలి. జాబ్‌ లొకేషన్‌: కొండాపూర్, హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 10.7.2025 Website:https://careers.hpe.com/us/en/job/1176670/Java-Full-Stack-developer

Government Jobs

Administrative Posts in SERC

The CSIR-Structural Engineering Research Centre (CSIR-SERC), Chennai, a national laboratory under the Ministry of Science and Technology, Government of India, is inviting applications for filling up the vacant administrative posts in various departments. Number of Posts: 10 Details: 1. Junior Stenographer (JST) - 2 (UR) 2. Junior Secretariat Assistant (JSA) - General - 6 Posts (UR-4 OBC-1, SC-1) 3. Junior Secretariat Assistant (JSA) - Finance & Accounts - 1 (OBC) 4. Junior Secretariat Assistant (JSA) - Stores & Purchase - 1 (SC) Qualification: 10+2/XII or equivalent qualification. JST: Proficiency in Stenography along with work experience as per DoPT norms. Maximum Age Limit: 27 years for Junior Stenographer, 28 years for Junior Secretariat Assistant. Salary: Rs. 25,500 – Rs. 81,100 per month for Junior Stenographer, Rs. 19,900 – Rs. 63,200 for Junior Secretariat Assistant. Application Fee: Rs. 500 for General & OBC Candidates. No fee for SC/ST/PwBD/Women/Ex-Servicemen Candidates. Selection: Candidates will be selected on the basis of Proficiency Test in Stenography and Written Test. Last Date for Receipt of Online Application: 30 June 2025. Website:https://serc.res.in/csir-recruitment

Government Jobs

SSC CGL 2025

The Staff Selection Commission (SSC) has released the official notification for the Combined Graduate Level (CGL) Examination 2025, aimed at recruiting for approximately 14,582 Group B and Group C posts across various Ministries, Departments, and Constitutional/Statutory Bodies of the Government of India. No.  of Posts: Approx. 14,582 Details: Here's a brief overview of the posts categorized by pay level: Pay Level 7 (Rs.44,900 - Rs.1,42,400)-Group B 1. Assistant Section Officer (Various Ministries) 2. Inspector of Income Tax 3. Inspector (Central Excise, Preventive Officer, Examiner) 4. Assistant Enforcement Officer 5. Sub-Inspector (CBI) 6. Inspector (Posts, Narcotics, etc.) Pay Level 6 (Rs.35,400 - Rs.1,12,400) - Group B:  1. Assistant/ASO in other Ministries 2. Executive Assistant (CBIC) 3. Research Assistant (NHRC) 4. Divisional Accountant (C&AG) 5. Sub-Inspector (NIA/NCB) 6. Statistical Investigator Grade-II 7. Junior Statistical Officer Pay Level 5 (Rs.29,200 - Rs.92,300)- Group C: 1. Auditor (C&AG, CGDA, Other Departments) 2. Accountant/Junior Accountant 3. Pay Level 4 (Rs.25,500 - Rs.81,100) – Group C 4. Postal/Sorting Assistant 5. Upper Division Clerk (UDC) 6. Senior Administrative Assistant 7. Tax Assistant (CBDT/CBIC) 8. Sub-Inspector (CBN) Eligibility:  Candidates must possess a Bachelor's Degree in any discipline from a recognized university. For certain posts such as Junior Statistical Officer, specific qualifications like 60% marks in Mathematics at 10+2 level or Statistics as a subject in graduation are required. Final year students can apply provided they acquire the qualification by 01-08-2025. Age: Most posts: 18 to 30 years; Some posts: 18-27, 20-30, or 18-32 years Relaxations: SC/ST (5 years), OBC (3 years), PwBD (10-15 years), etc. How to Apply:  Applications are accepted only through online mode via the new SSC portal: https://ssc.gov.in or the mySSC mobile app. One-Time Registration (OTR) on the new site is mandatory. Aadhaar-based authentication is recommended for smoother processing. Examination Centres:  SSC will conduct exams in all major cities and capitals across nine SSC regions, including:  Delhi, Mumbai, Chennai, Hyderabad, Bengaluru, Kolkata, Guwahati, Chandigarh, Raipur, etc. Candidates can choose three centres in order of preference. Application fee: Rs.100 (Women/SC/ST/PwBD/ESM exempted) Online Application End Date: 04-07-2025 (11:00 PM). Fee Payment Last Date: 05-07-2025. Correction Window: 09 to 11 July 2025. Tier-I Exam: 13 to 30 August 2025 (Tentative). Tier-II Exam: December 2025 (Tentative). Website:https://ssc.gov.in/ Apply online:https://ssc.gov.in/login

Freshers

Support Engineer Posts In Amazon

Amazon Company is inviting applications for the posts of Support Engineer-II, Selling Partner Experience, Selling Partner Experience. Details: Support Engineer-II, Eligibility: Degree, Software Development, Technical Support Experience, Troubleshooting and Debugging Technical System, And AWS, networks, operating systems Experience. Job Location: Hyderabad. Application Mode: Online. Last date: 6.7.2025 Website:https://www.amazon.jobs/en/jobs/2910415/support-engineer-ii-selling-partner-experience-selling-partner-experience

Freshers

Java Full Stack Developer Posts In Hewlett

Hewlett Company Invites Applications for Java Full Stack Developer Posts. Details:  Post: Java Full Stack Developer  Company: Hewlett Packard Enterprise Qualification: B.E/ B.Tech/M.Tech in CSE/IT or MCA. Skills: experience with Java, Spring, Spring Boot, Hibernate and building real-world backend systems, Strong skills in SQL, and cloud-aware application development, Good to have knowledge on UI technologies like React Js, Typescript ect. Job location: Kondapur, Hyderabad. Application Mode: Through Online. Last date: 10.7.2025 Website:https://careers.hpe.com/us/en/job/1176670/Java-Full-Stack-developer

Current Affairs

వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే

వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో అక్రిడిటేషన్‌ పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్‌ 9న ‘వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే’గా నిర్వహిస్తారు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, ధృవీకరణ సంస్థలు మొదలైన వాటి సామర్థ్యం, విశ్వసనీయతను నిర్ధారించడాన్ని అక్రిడిటేషన్‌ అంటారు. వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంలో అక్రిడిటేషన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు హామీ ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది. దీంతో అంతర్జాతీయ వ్యాపారం సులభం కావడంతోపాటు ప్రజారోగ్యం, భద్రతకు మద్దతుగా ఉంటుంది. అక్రిడిటేషన్‌ విలువలు, ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: అంతర్జాతీయ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వస్తు, సేవల స్థాయిని నిర్ధారించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్‌ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్‌ కోఆపరేషన్‌ (ఐఎల్‌ఏసీ) మ్యూచువల్‌ రికగ్నిషన్‌ అరేంజ్‌మెంట్‌ (ఎంఆర్‌ఏ)ను తెచ్చింది. దీన్ని 1994, జూన్‌ 9న సభ్యదేశాలు ఆమోదించాయి. 2007లో జరిగిన ఇంటర్నేషనల్‌ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్‌ కోఆపరేషన్‌ (ఐఎల్‌ఏసీ), ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ ఫోరం (ఐఏఎఫ్‌) ఉమ్మడి సమావేశంలో ఏటా జూన్‌ 9న ‘వరల్డ్‌ అక్రిడిటేషన్‌ డే’గా నిర్వహించాలని తీర్మానించాయి. 2008 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. 2025 నినాదం: Accreditation: Empowering Small and Medium Enterprises (SMEs)