న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్ పోస్టులు
ముంబయిలోని ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీఎల్) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 500 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ- 17, ఆంధ్రప్రదేశ్- 16. వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైన విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు ఉత్తీర్ణులై ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.9,000. వయోపరిమితి: 01.06.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగుకలు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.944; మహిళలు రూ.708; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.708, పీడబ్ల్యూబీడీ వారికి రూ.472. ఎంపిక ప్రక్రియ: అబ్జెక్టివ్ టైప్ ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి. పరీక్ష విధానం: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రిజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2025. ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్) తేదీ: 26-06-2025. Website: https://www.newindia.co.in/portal/