Posts

Current Affairs

యూఎన్‌హెచ్‌సీఆర్‌ నివేదిక

హింసా దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్‌హెచ్‌సీఆర్‌) నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య గతేడాదికన్నా 20 లక్షలు ఎక్కువ. దశాబ్దం క్రితంతో (2105) పోలిస్తే దాదాపు రెట్టింపు అని నివేదిక వివరించింది. సంఘర్షణల వల్ల స్వదేశం విడచిపెట్టిన శరణార్థుల్లో మూడింట రెండు వంతులు పొరుగు దేశాల్లోనే తల దాచుకొంటున్నారని నివేదిక తెలిపింది. 

Current Affairs

లింగ సమానత్వ సూచీ

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 2025 ఏడాదికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారత్‌ 131వ ర్యాంకులో నిలిచింది. కేవలం 64.1 శాతం సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సరసన భారత్‌ నిలిచింది. 2024లో భారత్‌ 129వ ర్యాంకులో ఉంది. స్త్రీ, పురుషుల ఆర్థిక భాగస్వామ్యం - అవకాశాలు, విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య- జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత లాంటి నాలుగు అంశాల ఆధారంగా 148 దేశాలకు డబ్ల్యూఈఎఫ్‌ ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో వరుసగా 16వ సారి ఐస్‌లాండ్‌ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఫిన్‌లాండ్, 3వ స్థానంలో నార్వే ఉంది. 

Current Affairs

బెలూం గుహలకు ‘భౌగోళిక వారసత్వ’ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కుతుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం లభిస్తుంది. ఇవి ఇప్పటికే దేశంలోనే పొడవైన గుహలుగా పేరు తెచ్చుకున్నారు. ఏడాదికి దాదాపు 2 లక్షల మంది వీటిని సందర్శిస్తుంటారు.  

Current Affairs

యశస్వీ సోలంకి

భారత సర్వసైన్యాధికారైన రాష్ట్రపతికి ఎయిడ్‌-డె-క్యాంప్‌ (ఏడీసీ)గా నియమితులైన మొదటి మహిళా నేవల్‌ ఆఫీసర్‌గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ యశస్వీ సోలంకి గుర్తింపు పొందారు. భారత ప్రథమ పౌరులైన రాష్ట్రపతికీ, వివిధ ప్రభుత్వ విభాగాలకూ మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్స్‌ సవ్యంగా సాగేలా చూడటం ఏడీసీ విధి. రాష్ట్రపతికి మొత్తం అయిదుగురు ఏడీసీలు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గుర్నీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల నుంచి చెరొకరినీ ఎంపికచేస్తారు. వీళ్లలోంచి ఒకరిని రాష్ట్రపతి విధుల కోసం ఎంచుకుంటారు. సర్వీసులో కనీసం 5-7 ఏళ్లపాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవాళ్లనే ఏడీసీగా నియమిస్తారు. 

Current Affairs

వింబుల్డన్‌ విజేతకు రూ.34 కోట్లు

2025లో వింబుల్డన్‌ టోర్నీ ప్రైజ్‌మనీని రూ.624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్ అధికారులు వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ మొత్తం 7 శాతం అధికం. విజేతగా నిలిచే ప్లేయర్‌ రూ.34 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. 2024తో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువ. ఈ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు రూ.76 లక్షలు దక్కనున్నాయి.   జూన్‌ 30న వింబుల్డన్‌ ఆరంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత స్టార్‌ షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా కాంస్య పతకం సాధించింది. 2025, జూన్‌ 12న మ్యూనిక్‌లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ ఫైనల్లో ఆమె 453.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. జీనెట్‌ డ్యూస్టడ్‌ (466.9- నార్వే) స్వర్ణం, ఎమిలీ జేగీ (464.8- స్విట్జర్లాండ్‌) రజతం గెలిచారు.

Current Affairs

World Day Against Child Labour

♦ World Day Against Child Labour is observed every year on June 12 to protect children from exploitation and uphold their rights. ♦ The International Labour Organization (ILO) first observed World Day Against Child Labour on June 12, 2002, at its Geneva headquarters. ♦ Since then, it has been marked globally to shine a light on this ongoing crisis.  ♦ 2025 theme: ‘Progress is clear, but there’s more to do: let’s speed up efforts!’ 

Current Affairs

World Economic Forum's Global Gender Gap Report 2025

♦ India has ranked 131 out of 148 countries in the World Economic Forum's Global Gender Gap Report 2025. ♦ India’s gender parity score stands at just 64.1 percent, placing it among the lowest-ranked countries in the South Asian region. ♦ In the 2024 edition of the report, India was ranked 129. ♦ The Global Gender Gap Index evaluates gender parity across four key dimensions: Economic participation and Opportunity, Educational Attainment, Health and Survival, and Political Empowerment.  ♦ Iceland (92.6%) continues to lead the index, holding the top position for 16 consecutive years, and remains the only economy to have closed more than 90% of its gender gap since 2022.  ♦ India’s neighbours - Bangladesh is ranked 24, China 103, Bhutan 119, Nepal 125, Sri Lanka 130, Pakistan last at 148. The top-10 countries in this index are: Rank Country Score  1  Iceland 0.926 2 Finland 0.879 3 Norway  0.863 4   United Kingdom  0.838 5  New Zealand   0.827 6 Sweden    0.817 7    Republic of Moldova 0.813 8 Nambia 0.811 9 Germany   0.803 10  Ireland     0.801                                                                              

Current Affairs

Yashasvi Solanki

♦ Indian Navy Lieutenant Commander Yashasvi Solanki was appointed as the President's Aide-de-Camp (ADC). ♦ This is the first time that a woman officer of the Navy has been given the post of Ed-de-Camp of Supreme Commander. ♦ The President is the Supreme Commander of the Armed Forces. ♦ The President has been given 5 ADCs. Of these, 3 are from the Army, 1 from the Air Force and 1 from the Navy.  ♦ Yashasvi Solanki hails from Haryana. In 2012, she joined the Logistics Branch of the Navy under the Short Service Commission.  Women have become ADCs before: ♦ In 2023, Squadron Leader Manisha Padi was made ADC to Mizoram Chief Minister Haribabu Kammbati. ♦ She was the first woman to become ADC to the Governor. ♦ Manisha is a 2015 batch Indian Air Force officer.  ♦ Earlier in 2019, Lieutenant Ghani Lalji was made ADC to Army Commander. ♦ She was the first woman to become an ADC to the Army Commander. ♦ Lalji was recruited into the Corps of Military Intelligence in 2011.

Current Affairs

Sift Kaur Samra

♦ India’s shooter Sift Kaur Samra secured a bronze medal in the women’s 50m rifle 3 positions event at the ISSF World Cup 2025 in Munich, Germany, on 12 June 2025. ♦ She scored 453.1 in the medal round. ♦ Two-time Olympian Jeanette Hegg Duestad of Norway won the gold medal with a total of 466.9, while Emely Jaeggi of Switzerland claimed silver with 464.8. ♦ Sift Kaur Samra had also won a gold medal in the women's 50m rifle 3 positions event at the ISSF World Cup in Buenos Aires earlier this year (2025).