ఎన్‌ఐటీ వరంగల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. విజిటింగ్ కన్సల్టెంట్: 02 2. ఎఫ్‌ఎస్‌ఓ: 01 3. స్టూడెంట్ కౌన్సెలర్: 01 4. పీఆర్‌ఓ: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. తెలంగాణ హైకోర్డ్ బార్ కౌన్సిల్‌లో 3 ఏళ్ల హోదా కలిగి, న్యాయవాదిగా ఉండాలి. జీతం: నెలకు విజిటింగ్ కన్సల్టెంట్‌కు రూ.50,000, ఎఫ్‌ఎస్‌ఓ, స్టూడెంట్ కౌన్సెలర్, పీఆర్‌ఓకు రూ.60,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 09. Website:https://nitw.ac.in/page/?url=/careersnitw/Jobs/