నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో పోస్టులు
న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ (గ్రూప్-బి, నాన్-గేజిటెట్ ఎస్ అండ్ టీ) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ- 376 పోస్టులు (అన్ రిజర్వ్‌డ్- 154; ఎస్సీ- 56; ఎస్టీ- 28; ఓబీసీ- 101; ఈడబ్ల్యూఎస్- 37) అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంఎస్/ఎంసీఏ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2024/25/26 సంవత్సరాల్లో పొందిన వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. జీతం: నెలకు రూ.35,400- రూ.1,12,400. దరఖాస్తు విధానం: గేట్-2026 ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 10 రోజుల్లోపు, వివరణాత్మక ప్రకటన ఎన్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్లో తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది. గమనిక: పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. గేట్-2026 ఫలితాలు విడుదల: 11.03.2026. చివరి తేదీ: 21.3.2026 Website:https://recruitment.nic.in/