ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నూతన ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.ఆర్.అనురాధను రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ 2024, అక్టోబరు 23న ఉత్తర్వులు జారీచేశారు. ఆమె 1987 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ 2024, జులై 4న రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది.