ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింది జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 25 వివరాలు: ఖాళీల వివరాలు (ట్రైనింగ్ సీట్లు): 1. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా: 17 2. గుంటూరు జిల్లా: 07 3. చిత్తూరు జిల్లా: 01 అర్హత: బ్యాంకింగ్/ కామర్స్/ అకౌంటింగ్ అండ్ ఆడిట్/ అగ్రికల్చర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి తెలుగు/ ఇంగ్లిష్ భాషల్లో (చదవటం/ రాయడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ కాలం: ఏడాది. స్టైపెండ్: నెలకు రూ.15,000. ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ది డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామాకు పంపాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28-10-2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 02.11.2024. Website:https://apcob.org/careers/