Posts

Government Jobs

Project Engineer Posts In BEL, Bangalore

Bharat Electronics Limited (BEL), Bangalore is inviting applications for the vacant posts of Project Engineer-1 (Mechanical) on temporary basis.  No. of Posts: 5 Details: Qualification: BE/B.Tech (Mechanical) in the relevant discipline following the post along with work experience. Upper Age Limit: 32 years as on 1.10.2024. Relaxation of 3 years for OBCs, 5 years for SC/ST candidates and 10 years for PwBDs. Salary: Per month Rs.40,000 for the first year; Rs.45,000 for the second year; Rs.50,000 in the third year; Rs.55,000 in the fourth year. Selection Process: Based on Written Test, Interview etc. Application Procedure: Offline applications should be sent to ' DGM (HR/CSG), Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore'. Last date for application: 11-11-2024. Website:https://bel-india.in/

Apprenticeship

Apprentice Posts In APCOB, Vijayawada

The Andhra Pradesh State Cooperative Bank Limited, Vijayawada invites applications for engagement of Apprentices. No. of Posts: 25 Details: Details of vacancies(Training Seats): 1. Krishna and NTR District: 17 2. Guntur District: 07 3. Chittoor District: 01 Qualification: Bachelors Degree in Banking/ Commerce/ Accounting and Audit/ Agriculture/ Information Technology. The candidate should be proficient in Telugu and English Language (Reading and Writing). Age Limit (as on 01.09.2024): 20 to 28 years. Period of Training: One year. Stipend: Per month Rs.15,000. Selection Procedure: Based on Degree marks, document verification, medical exam.  How to apply: Filled in applications should be send through directly or by post to The Duputy General Manager, Human Resource Department, The Andhra Pradesh State Cooperative Bank Limited, Governorpet, Vijayawada. Last date for submission of application: 28-10-2024 Date of Document verification: 02.11.2024. Website:https://apcob.org/careers/

Admissions

MBA/ MCA Programme In PGRRCDE, OU

Applications through online mode are invited for entrance test for admissions into MBA/ MCA Programme offered by PGRR Centre for Distance Education, Osmania University under distance mode for the academic year 2024-25.  Details: 1. MBA 2. MCA Course Duration: 2 years.  Eligibility: Any Graduate for MBA. Any Degree with Mathematics, as one of the subject in the Degree course for MCA. Selection Process: Based on Entrance Test. Registration fee: Rs.900. Note: TS/AP ICET-2024 qualified candidates can get direct admission into above courses.  Last date for submitting the online Application: 05-11-2024. Last date with a late fee of Rs.500: 08-11-2024. Date of the Examination: 09-11-2024. Website:http://www.oucde.net/ Apply online:https://ouadmissions.com/cdeentranceexam/index.html

Admissions

Para medical Courses In Government Medical College, Vizianagaram

Government Medical College, Vizianagaram invites applications for admission into the following medical courses. Details: 1. Diploma in Medical Lab Technician Course: 30 Seats  2. Diploma in Medical Imaging Technician Course: 20 Seats  3. Diploma in Ophthalmic Assistant Course: 10 Seats  4. Diploma in Anesthesia Technician Course: 10 Seats  5. Diploma in Medical Sterilization Management & Operation Theatre Technician Course: 20 Seats  Qualification: Intermediate with Bi.P.C Group are eligible for these two years Allied and Health Care Diploma Courses. Selection Process: Merit Basis upon Aggregate marks obtained by the candidates in relevant group subjects excluding the marks in the Languages, Rule of Reservation. How to apply: Filled in applications have to be submitted at Government Medical College, Vizianagaram. Last Date for submission of filled in application: 29-10-2024. Completion of Counseling Process and allotment: 04-11-2024. Commencement of Classes by the Institutions: 15-11-2024. Website:https://vizianagaram.ap.gov.in/

Walkins

ఆదిలాబాద్ రిమ్స్‌లో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వివరాలు: 1. ప్రొఫెసర్ 2. అసోసియేట్ ప్రొఫెసర్ 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ 4. ట్యూటర్‌ 5. సీఎంవో  6. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగాలు: అనాటమీ, ఆప్తాల్మాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియా, సైకియాట్రీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి. వయసు: 64 ఏళ్లు మించకూడదు. జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్- రూ.190000, అసోసియేట్ ప్రొఫెసర్- రూ.150000, అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ.125000, సీఏఎస్- రూ.52000, సీఎంఓ- రూ.52000, సీఏఎస్- రూ.55000. ఇంటర్వ్యూ తేది: 29.10.2024. వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌, రిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఆదిలాబాద్. Website:https://adilabad.telangana.gov.in/

Government Jobs

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.   మొత్తం ఖాళీలు: 457. వివరాలు: యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025 విభాగాలు: సివిల్‌, మెకానికల్‌‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌. విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చ‌దివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: అభ్యర్థులు వయసు 01-01-2025 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి.  ఎంపిక విధానం: స్టేజ్‌-1 (ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ/ స్టేజ్-I: పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్న పత్రాలు ఉంటాయి. మొత్తం 500 మార్కులు (పేపర్ I- 200 మార్కులు; పేపర్ II- 300 మార్కులు) ఉంటాయి. మెయిన్/ స్టేజ్-II: ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులు (ప్రతి పేపర్‌లో 300 మార్కులు) కేటాయించారు. దరఖాస్తు ఫీజు: మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.11.2024. దరఖాస్తు సవరణ తేదీలు: 23.11.2024 నుంచి 29.11.2024 వరకు. ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: 09-02-2025. Website:https://upsc.gov.in/ Apply online:https://upsconline.nic.in/upsc/OTRP/

Government Jobs

యూనియన్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 1,500 పోస్టులు (ఎస్సీ- 224; ఎస్టీ- 109; ఓబీసీ- 404; ఈడబ్ల్యూఎస్‌- 150; యూఆర్‌- 613) వివరాలు: రాష్ట్రాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక- 300, కేరళ- 100, మహారాష్ట్ర- 50, ఒడిశా- 100, తమిళనాడు- 200, తెలంగాణ- 200, పశ్చిమ్‌ బెంగాల్- 100. అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480-రూ.85,920. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175. ఆన్‌లైన్ పరీక్ష/ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (35 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్ & ఎస్సే (2 ప్రశ్నలు- 25 మార్కులు). తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆన్‌లైన్ దరఖాస్తులు/ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 13.11.2024. Website:https://www.unionbankofindia.co.in/english/home.aspx Apply online:https://ibpsonline.ibps.in/ubisojan24/

Government Jobs

తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో విజిలెన్స్‌ ఆపీసర్ ఖాళీలు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) డైరెక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివ‌రాలు: 1. జూనియర్ అసిస్టెంట్: 01 2. విజిలెన్స్‌ ఆఫీసర్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 (2022) ఎంపికైన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 44 ఏళ్లు; విజిలెన్స్‌ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.24,280-రూ.72850; విజిలెన్స్‌ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.50,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్‌వో క్యాంపస్, సుల్తాన్ బజార్‌, కోఠి, హైదరాబాద్’ చిరునామకు పంపించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ: 11-11-2024. Website:https://onlinetsmc.in/

Government Jobs

నిట్ జలంధర్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు

పంజాబ్‌, జలంధర్‌లోని డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీజే) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 132 వివ‌రాలు: 1. అసిస్టెంట్ ప్రొఫెసర్: 95 2. అసోసియేట్ ప్రొఫెసర్: 31 3. ప్రొఫెసర్: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ/ ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జలంధర్’ చిరునామాకు పంపించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ: 28-11-2024. Website: https://www.nitj.ac.in/

Government Jobs

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (మెకానికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 5 వివ‌రాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1.10.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది 50,000; నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ డీజీఎం (హెచ్‌ఆర్/సీఎస్‌జీ), భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జాలహళ్లి పోస్ట్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2024. Website:https://bel-india.in/