Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Christian Aid

♦ According to the report by UK-based NGO Christian Aid Heatwaves, wildfires, droughts, and storms cost the world more than USD 120 billion in 2025. The report noted that cost of climate inaction is equally clear, as communities continue to bear the brunt of a crisis that could have been averted with urgent action to reduce greenhouse gas emissions. ♦ The ten most financially costly events all had an impact of more than USD billion with the combined total topping more than USD 122 billion in damage. Most of these estimates are based only on insured losses, meaning the true financial costs are likely to be even higher, while the human costs are often uncounted. ♦ The report also highlighted ten extreme weather events that didn't rack up big enough insured losses to make the top ten but were just as devastating and often affected millions.

Current Affairs

Jayshree Ullal

♦ Jayshree Ullal, president and CEO of Arista Networks has topped the Hurun Rich List for 2025. Ullal has emerged as the richest self-made woman entrepreneur in the list. She has a net worth of $5.7 billion, which is higher than that of Satya Nadella (Microsoft CEO) and Sundar Pichai (Google CEO).  ♦ Born in London and Ullal was raised in Delhi. She completed her Bachelor’s degree in Electrical Engineering from San Francisco State University and later went ahead to pursue a Master’s in Engineering Management from Santa Clara University. ♦ Jayshree Ullal’s career graph Ullal started her professional journey at AMD and Fairchild Semiconductor. She then joined Cisco Systems in 1993. Then, in 2008 she joined Arista Networks as the CEO.  ♦ As per the Hurun India Rich List 2025, Ulla has the net worth of Rs 50,170 crore which makes her the richest Indian-origin woman CEO.

Current Affairs

ప్రపంచ కుటుంబ దినోత్సవం

ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబంగా పేర్కొంటారు. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. మనిషి సామాజిక జీవనానికి ఇదే మూలం. వ్యక్తికి సమాజంలో తొలి గుర్తింపు కుటుంబం ద్వారానే లభిస్తుంది. అంతేకాక బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇదే అందిస్తుంది. కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా (Global Family Day) నిర్వహిస్తారు. ప్రజల మధ్య ఐక్యత, శాంతిని పెంపొందించడంతోపాటు మనమంతా ప్రపంచ కుటుంబంలో భాగం అనే భావనను విస్తృతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1998, నవంబరులో 21వ శతాబ్దపు మొదటి దశాబ్దాన్ని ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో శాంతి, అహింసను ప్రోత్సహించాలని భావించింది. దీనికి అనుగుణంగా 2001-10 కాలాన్ని The International Decade for a Culture of Peace and Non-Violence for the Children of the World గా ప్రకటించింది.  కుటుంబ వ్యవస్థ ద్వారానే దీన్ని సాధించడం కుదురుతుందని యూఎన్‌ఓ భావించింది. 2000, జనవరి 1న ఐక్యరాజ్య సమితి ‘వన్‌ డే ఇన్‌ పీస్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావారణం ఉండాలంటే ప్రజలంతా ఒకే కుటుంబం అనే భావనతో మెలగాలని అందులో సూచించారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో యూఎన్‌ఓ ఏటా జనవరి 1న ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది.

Current Affairs

వాయుసేన వైస్‌ చీఫ్‌గా నగేశ్‌ కపూర్‌

భారత వైమానికదళ ఉప అధిపతి (వైస్‌ చీఫ్‌)గా ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌ 2026, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు.  పదవీ విరమణ చేసిన ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ స్థానంలో ఆయన వచ్చారు. 1985లో జాతీయ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని 1986లో వాయుసేనలో చేరిన ఆయన.. మిగ్‌-21, మిగ్‌-29 యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు విస్తృతంగా నడిపారు. మొత్తం 3,400 గంటలసేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది.  వైస్‌ చీఫ్‌ కంటే ముందు ఆయన నైరుతి వాయుదళం ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా సేవలందించారు. 

Current Affairs

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు

దేశీయంగా 2025 డిసెంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబరు వసూళ్లయిన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. దేశీయ విక్రయాల నుంచి వచ్చిన పన్ను ఆదాయ వృద్ధిలో మందగమనం, పన్ను కోతల వల్ల వృద్ధి తక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల నుంచి స్థూల ఆదాయం 1.2% పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి ఆదాయం 19.7% వృద్ధితో రూ.51,977 కోట్లకు చేరుకుంది. డిసెంబరులో రిఫండ్‌లు 31% పెరిగి రూ.28,980 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేశాక.. నికర జీఎస్‌టీ వసూళ్లు 2.2% వార్షిక వృద్ధితో రూ.1.45 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 

Current Affairs

పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను

పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై పన్ను విధానాలకు’ అనుగుణంగా ఈ చర్య చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పొగాకుపై పన్నులను ఏటా సవరిస్తున్నారు. జీఎస్‌టీ అమలుకు ముందు భారత్‌లోనూ సిగరెట్లపై ఏటా ఎక్సైజ్‌ సుంకాన్ని సవరించేవారు. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక గత ఏడేళ్లుగా ఎటువంటి మార్పులూ చేపట్టలేదు. జీఎస్‌టీలోని గరిష్ఠమైన 28% పన్నుతో పాటు పరిహార సుంకం మాత్రమే ఇప్పటివరకు విధిస్తున్నారు.

Current Affairs

గణాంకాల శాఖ కొత్త లోగో

గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) 2026, జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి, పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు కాగా.. రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో, విధాన రూపకల్పనలో, దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెలు, చిహ్నాలు ఆధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్‌ సైన్స్‌ను తెలుపుతాయని వివరించింది. 

Current Affairs

న్యూయార్క్‌ మేయర్‌గా సబ్‌వేలో మమ్దానీ ప్రమాణం

అమెరికాలోని న్యూయార్క్‌ నగర 112వ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్‌హట్టాన్‌లోని ఓ చారిత్రక సబ్‌వే స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఖురాన్‌పై ప్రమాణం చేసి.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జోహ్రాన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారు.

Current Affairs

ఐఎండీ వార్షిక నివేదిక

దేశంలో గతేడాది (2025)లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించిన వాతావరణ నివేదికను 2026, జనవరి 1న విడుదల చేసింది. 1901లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించిన తర్వాత 2025.. ఎనిమిదో వేడి సంవత్సరంగా నిలిచింది.  2025 శీతాకాలంలో ఉష్ణోగత్రలు 1.17 డిగ్రీలు, ప్రీ-మాన్‌సూన్‌ (మార్చి-మే)లో 0.29, నైరుతి రుతుపవనాల కాలంలో 0.09 డిగ్రీలు ఎక్కువగా, పోస్ట్‌ మాన్‌సూన్‌ (అక్టోబరు-డిసెంబరు)లో 0.10 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. 

Walkins

ఎన్ఆర్‌ఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఐసీఏఆర్‌- నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఆర్ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్-l  అర్హత: ఫోటోగ్రఫీ/సినిమాటోగ్రఫీ/ఫిల్మ్‌ ఎడిటింగ్‌/ వీడియో ఎడిటింగ్‌ లేదా తత్సమాన విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.30,000. వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 15-01-2026. వేదిక: ఐసీఏఆర్-నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కటక్‌. పని ప్రదేశం: ఐసీఏఆర్-నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కటక్‌. Website:https://icar-crri.in/