Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఆర్‌ఏఎఫ్‌ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్‌

బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్‌-భారత్‌ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్‌ వ్యాలీలో ముగ్గురు క్వాలిఫైడ్‌ ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఐఏఎఫ్‌ ప్రాథమికంగా రెండేళ్ల పాటు విధుల్లో ఉంచనుంది. 

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2026, ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అతడు 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మిగతా రెండు పతకాలు భారత్‌కే దక్కాయి. నీరజ్‌ కుమార్‌ (361.8), అఖిల్‌ షెరోన్‌ (343.5) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో టీమ్‌ స్వర్ణం కూడా భారత్‌కే లభించింది. 

Current Affairs

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్‌ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఏడాది వ్యవధిలో అగ్రగామి 15 వస్తువుల ఎగుమతులే 97 బి. డాలర్లకు చేరతాయని, మిగతా వస్తువులూ కలిపితే ఏటా 100 బి. డాలర్ల మార్కును చేరొచ్చని వివరించింది.   2024-25లో అమెరికాతో మనకు 40.9 బి.డాలర్ల మిగులు ఉండగా, 2025-26లో ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి 26 బి.డాలర్లుగా ఉంది. 

Current Affairs

రక్షణ రంగం

భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. భారత వాయుసేనకు (ఐఏఎఫ్‌) మరో 114 శత్రుభీకర రఫేల్‌ యుద్ధవిమానాలు చేర్చే ప్రతిపాదన అందులో ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్‌ సర్కారుతో కేంద్ర ప్రభుత్వం భారీస్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. మొత్తం రూ.3.60 లక్షల కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ కొనుగోళ్లకు డీఏసీ తాజాగా ఆమోదం తెలిపింది. రఫేల్‌ యుద్ధవిమానాలతో పాటు.. వాయుసేన కోసం క్షిపణులు, ఎయిర్‌-షిప్‌ బేస్డ్‌ హై ఆల్టిట్యూట్‌ సూడో శాటిలైట్‌ (ఏఎస్‌-హెచ్‌ఏపీఎస్‌), నౌకాదళం కోసం ఆరు అమెరికా తయారీ బోయింగ్‌ పీ8-ఐ నిఘా విమానాలు, సైన్యం కోసం వైభవ్‌ యాంటీ ట్యాంక్‌ మైన్ల కొనుగోలు, టీ-72 ట్యాంకుల మరమ్మతుల లాంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. 

Government Jobs

నేషనల్ హెల్త్ మిషన్ చిత్తూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఒప్పంద  ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 07 వివరాలు: 1. డేటా మేనేజర్  - 01 2. డేటా ఎంట్రీ ఆపరేటర్  - 03 3. మైక్రోబయాలజిస్ట్   - 01 4. ల్యాబ్ టెక్నీషియన్ - 01 5. ల్యాబ్ అటెండెంట్  - 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28-01-2026 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.15,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ)కార్యాలయం, చిత్తూరు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-02-2026. Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఫైనాన్స్) ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఫైనాన్స్). - 10 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.40,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ముంబయి పోర్ట్ అథారిటీ, దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.03.2026. Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727

Apprenticeship

ఐవోసీఎల్‌ మధుర రిఫైనరీలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) పరిధిలోని మధుర రిఫైనరీలో ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 108  వివరాలు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 67 ట్రేడ్‌ అప్రెంటిస్‌: 41 ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమేంటేషన్‌, అకౌంటెంట్‌. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 31.01.2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ/ఎన్‌ఏపీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తరువాత గూగుల్‌ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20.02.2026. Website:https://iocl.com/

Apprenticeship

ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కేరళ రాష్ట్రం చవారాలోని ది ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అండ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 89 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 15 2. టెక్నికల్‌ : 09 3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 51 4. జనరల్‌ స్ట్రీమ్‌ స్టడీస్‌: 14 విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, వెల్డర్‌, ఎలక్ట్రానిక్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, టర్నర్‌, ప్లంబర్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఏఏఓ, ఎంఎల్‌టీ, ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఏ/బీబీఏ/బీఎస్సీ, ఎంఎస్సీ, వీహెచ్‌ఎస్‌ఈ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డీజీఎం, ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌, చవారా, కొల్లం జిల్లా, కేరళ చిరునామాకు సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి పంపించాలి.(అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్‌ పోర్టల్‌, ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోని ఉండాలి). దరఖాస్తు చివరి తేదీ: 24-02-2026. Website:https://irel.co.in/

Admissions

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్‌సీఈటీ) 2026 ప్రవేశాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సెంట్రల్/స్టేట్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలల్లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ)లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో మొత్తం 6,000 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు పొందవచ్చు.  వివరాలు: నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026- 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అర్హతలు: అభ్యర్థులు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2026లో పరీక్షకు హాజరవుతున్న వారై ఉండాలి.  పరీక్ష విధానం:  కంప్యూటర్‌ ఆధారిత అబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తారు.   ప్రవేశ పరీక్ష సిలబస్‌: భాషలు : రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్ మరియు వొకాబులరీ. డొమైన్ సబ్జెక్టులు: 12వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి. జనరల్ టెస్ట్: జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, లాజికల్ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్. టీచింగ్ ఆప్టిట్యూడ్: సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ భాషల బోధనకు సంబంధించిన అంశాలు. దరఖాస్తు ఫీజు: ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; జనరల్‌కు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/పీడ్ల్యూబీడీ/థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులకు రూ.650. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 12.02.2026-  10.03.2026.  ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 11.03.2026. దరఖాస్తు సవరణ తేదీలు: 12.03.2026- 14.03.2026. పరీక్ష తేదీ: 07.04.2026. Website:https://exams.nta.nic.in/ncet/

Government Jobs

Jobs In National Health Mission Chittoor

National Health Mission (NHM) in Chittoor district is inviting applications for filling up the following posts in various departments on contractual basis.  No. of Posts - 07 Details: 1. Data Manager - 01 2. Data Entry Operator - 03 3. Microbiologist - 01 4. Lab Technician - 01 5. Lab Attendant - 01 Eligibility: Candidates should have passed Tenth/Diploma/Degree/BE/MSc from a recognized board as per the post along with work experience. Maximum Age Limit: Not more than 40 years as on 28-01-2026. Age relaxation of 5 years for SC, ST and BC candidates. Salary: per month Rs. 15,000  Selection Process: Based on Written Test. Application Process: Offline. Address: District Medical & Health Officer (DMHO) Office, Chittoor. Last Date for receipt of applications: 20-02-2026. Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/