ఎన్‌పీసీఐఎల్‌లో సీఏ/సీఎంఏ ఇంటర్న్ పోస్టులు
నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో పని చేయుటకు 2025 సంవత్సరానికి సీఏ/సీఎంఏ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సీఏ/సీఎంఏ ఇంటర్న్స్: 34 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ ఇంటర్ లేదా సీఎంఏ ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 18 నుంచి 56 సంవత్సరాలు. (27/06/2007 తర్వాత లేదా 26/06/1969 ముందు జన్మించిన వారు అర్హులు కాదు). స్టైపెండ్: నెలకు రూ.20,000. దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు. ఎంపిక విధానం: సీఏ/సీఎంఏ ఇంటర్ మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్టింగ్. షార్ట్‌లిస్టైన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.npcilcareers.co.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చివరి తేదీ: 26 జూన్ 2025. Website: https://www.npcilcareers.co.in/MainSiten/DefaultInfo.aspx