Posts

Admissions

ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. ఎంబీఏ, ఎంసీఏ  2. ఎంఏ: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ. 3. ఎంఎస్సీ: మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ 4. ఎంకాం 5. బీఏ: మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌  6. బీకాం: జనరల్‌ 7. బీబీఏ 8. అడ్వాన్స్‌డ్ డిప్లొమా: మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, వేదిక్‌ ఆస్ట్రాలజీ 9. అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా: వేదిక్‌ ఆస్ట్రాలజీ 10. సర్టిఫికేట్ కోర్సు: యోగా అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు వ్యవధి: పీజీకి రెండేళ్లు, యూజీకి మూడేళ్లు, అడ్వాన్స్‌డ్ డిప్లొమాకి ఏడాది, సర్టిఫికేట్ కోర్సుకు ఆరు నెలలు. బోధనా మాధ్యమం: కోర్సును బట్టి ఇంగ్లిష్ లేదా తెలుగు లేదా ఉర్దూ రెండు మాధ్యమాలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఫేజ్-I అడ్మిషన్లు ప్రారంభం: 16-08-2024. దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2024. Website:http://www.oucde.net/index.php Apply online:https://oupgrrcde.com/Registration/Student/Default#

Admissions

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది.  వివరాలు: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025 అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2025 పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్‌-1 300, పేపర్‌-2 400 మార్కులకు ఉంటుంది. ఛాయిస్‌ ఎత్తివేత జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేశారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు.  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌, జగిత్యాల. ఏపీ: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. తొలి విడత                         ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబర్‌ 28 నుంచి నవంబరు 22 వరకు. హాల్‌టికెట్లు: పరీక్షకు 3రోజుల ముందు. పరీక్షలు: జనవరి 22- జనవరి 31 మధ్య.         ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి.     రెండో విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 31- ఫిబ్రవరి 24 వరకు. హాల్‌టికెట్లు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు. పరీక్షలు: ఏప్రిల్‌ 1- 8 మధ్య. ఫలితాలు: ఏప్రిల్‌ 17 నాటికి. ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు.  Website:https://jeemain.nta.nic.in/ Apply online:https://examinationservices.nic.in/JeeMain2025/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgDUffqDdG1LTsAPBKFcEC9W88CTkt2ITzilIsFR7gKxO

Admissions

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలు

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  వివరాలు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్‌ అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా ఐసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఇతరులకు రూ.1500. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు చివరి తేదీ: 08-11-2024. ప్రవేశ పరీక్ష తేదీ: 09-11-2024. ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 10-11-2024. Website:https://www.braouonline.in/MBAHHCM/Home.aspx Apply online:https://www.braouonline.in/MBAHHCM/Login.aspx

Internship

Telugu Transcription Specialist Posts In Indiaum Solutions

Indiaum Solutions is invites applications for Telugu Transcription Specialist Vacancies. Details: Post: Telugu Transcription Specialist Company: Indiaum Solutions Skills: Telugu Speaking, Writing, Transcription. Stipend: Per month Rs.8,000-Rs.20,000. Duration: 4 months Application Procedure: Through Online. Application Last Date: 21-11-2024 Website:https://internshala.com/internship/detail/work-from-home-telugu-transcription-specialist-internship-at-indiaum-solutions1729569817

Government Jobs

Supervisor Posts In SPMCIL, Narmadapuam

Security Printing & Minting Corporation of India Limited (SPMCIL), Narmadapuram (Madhya Pradesh) is inviting applications for the vacant posts of Supervisor. Number of Posts: 06 Details: 1. Welfare Officer: 01 2. Supervisor: 05 Departments: Production, Lab, Technical Safety, Electrical. Qualification: Diploma, Degree, BE/B.Tech pass in the relevant discipline following the post along with work experience. Age Limit: Should be between 18-30 years. There is a relaxation of 5 years for SC/ST, 3 years for OBC and 10 years for PwBDs candidates. Salary: Per month Welfare Officer Rs.29,740-Rs.1,03,000; Rs.27,600-Rs.95,910 for supervisor posts. Application Fee: Rs.600; SC/ST/PwBDs candidates for Rs.200. Selection Process: Based on Written Test, Scrutiny of Certificates, Interview etc. Last date of online application: 18-11-2024. Website:https://spmnarmadapuram.spmcil.com/hi/

Admissions

BPT, B.Sc. Allied Health Science Courses In KNRUHS, Warangal

Kaloji Narayana Rao University of Health Sciences, Warangal invites application for admission into Competent Authority Quota Seats in Government and Private B.Sc. (Allied Health Sciences) Institutions for the academic year 2024-25. Details: 1. B.Sc. Medical Lab Technology 2. B.Sc. Anesthesia Technology  3. B.Sc. Operation Theatre Technology  4. B.Sc. Cardiac and Cardio Vascular Technology 5. B.Sc. Renal Dialysis Technology 6. B.Sc. Optometry 7. B.Sc. Respiratory Therapy Technology  8. B.Sc. Neuro Science Technology 9. B.Sc. Critical care Technology  10. B.Sc. Radiology and Imaging Technology 11. B.Sc. Audiology & Speech Language Pathology 12. B.Sc. Medical Records Sciences 13. B.Sc. Nuclear Medicine 14. B.Sc. Radio Therapy Technology 15. BPT (Bachelor of Physiotherapy) Duration of the course: 4 years including period of compulsory Internship. 3 years for B.Sc. MLT course. 4 years + 6 months Internship for BPT course. Eligibility: Intermediate Examination (10+2 pattern) with Botany, Zoology, Physics and Chemistry which shall include a practical test in each subject. Or 10+2 pattern from recognized Board under AISSCE/ CBSE/ ICSE/ SSCE/ HSCE/ NIOS/ TOSS of other equivalent Board with Biology, Physics and Chemistry recognized as equivalent by Board of Intermediate Education, Telangana state. Or Intermediate (10+2) with Bridge course with Biology and Physical Science. Age: Candidates should have completed the age of 17 years as on 31st December 2024. Application Fee: OC, BC candidates Rs.2500, SC/ ST Candidates Rs.2000. Selection Process: Based on Inter marks, rule of reservation etc. Availability of Online application forms: 29-10-2024 to 06-11-2024. Website:https://www.knruhs.telangana.gov.in/ Online application:https://alliedhs.tsche.in/

Internship

ఇండియం సొల్యూషన్స్‌లో తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్ పోస్టుల‌

ఇండియం సొల్యూషన్స్ తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోది. వివరాలు: పోస్టు: తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్‌  కంపెనీ: ఇండియం సొల్యూషన్స్‌  నైపుణ్యాలు: తెలుగు మాట్లాడటం, రాయడం, ట్రాన్‌స్క్రిప్షన్‌. స్టైపెండ్‌: నెలకు రూ.8,000-రూ.20,000. వ్యవధి: 4 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 21-11-2024 Website:https://internshala.com/internship/detail/work-from-home-telugu-transcription-specialist-internship-at-indiaum-solutions1729569817

Government Jobs

సెక్యూరిటీ పేపర్‌ మిల్‌లో సూపర్‌వైజర్ పోస్టులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం, నర్మదాపురంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివ‌రాలు: 1. వెల్ఫేర్ ఆఫీసర్: 01 2. సూపర్‌వైజర్: 05 విభాగాలు: పొడక్షన్, ల్యాబ్, టెక్నికల్ సేఫ్టీ, ఎలక్ట్రికల్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. జీతం: నెలకు వెల్ఫేర్ ఆఫీసర్ రూ.29,740-రూ.1,03,000; సూపర్‌వైజర్ పోస్టులకు రూ.27,600-రూ.95,910. దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18-11-2024. Website:https://spmnarmadapuram.spmcil.com/hi/

Admissions

కాళోజీ హెల్త్‌ వర్సిటీలో బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సులు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. వివరాలు: 1. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 2. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ 3. బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 4. బీఎస్సీ కార్డియాక్ అండ్‌ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ 5. బీఎస్సీ రెనల్‌ డయాలసిస్ టెక్నాలజీ 6. బీఎస్సీ ఆప్టోమెట్రీ 7. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ 8. బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ 9. బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ 10. బీఎస్సీ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్ టెక్నాలజీ 11. బీఎస్సీ అడియాలజీ అండ్‌ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ 12. బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ 13. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ 14. బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ 15. బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు వ్యవధి: బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుకు మూడేళ్లు; బీపీటీకి నాలుగేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌; మిగిలిన కోర్సులకు నాలుగేళ్లు. అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్‌ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 29-10-2024 నుంచి 06-11-2024 వరకు. Website:https://www.knruhs.telangana.gov.in/ Apply online:https://alliedhs.tsche.in/

Current Affairs

International Animation Day

♦ International Animation Day is observed every year on October 28 to honour the artists, who inspire people through their animations. ♦ This day was launched in 2002 by the International Animated Film Association (ASIFA), a part of UNESCO.  ♦ ASIFA created the IAD in 2002, honoring the birth of animation, recognized as the first public performance of projected moving images: Emile Reynaud’s Theatre Optique in Paris, on the 28th October 1892.