Posts

Government Jobs

ఎస్ఎంపీలో మేనేజీరియల్ పోస్టులు

పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌ (ఎస్ఎంపీ) రెగ్యులర్ ప్రాతిపదికన కింది మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివ‌రాలు: 1. అసిస్టెంట్ మేనేజర్: 10 2. అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 01 3. సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 01 4. సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్స్ / సివిల్), ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000. దరఖాస్తు ఫీజు: రూ.500+జీఎస్టీ; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 20-11-2024. Website:https://smp.smportkolkata.in/smpk/en/

Government Jobs

సౌత్ వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు

హుబ్బళ్లిలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య‌: 46. వివరాలు: 1. లెవెల్‌-5 2. లెవెల్‌-4 3. లెవెల్‌-3/ 2 4. లెవెల్‌-1 అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ (ఫిజిక్స్), ఏదైనా డిగ్రీ; ఐటీఐ, పన్నెండో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్. వయోపరిమితి: 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-11-2024. Website:https://swr.indianrailways.gov.in/

Government Jobs

సీడ్యాక్‌లో సైంటిస్ట్ బి పోస్టులు

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 22 (హైదరాబాద్: 04; దిల్లీ: 05; పుణె: 05; బెంగళూరు: 08) వివ‌రాలు: విభాగాలు: వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, సైబర్ సెక్యూరిటీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, అప్లైడ్‌ ఏఐ అండ్ డేటా అనలైటిక్స్‌, అప్లైడ్‌ కంప్యూటింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.56,100. వయోపరిమితి: ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు; ఎస్టీలకు 35 ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 01-12-2024. Website:https://careers.cdac.in/advt-details/CORP-28102024-REK85

Government Jobs

బీఆర్‌బీఎన్ఎంఎల్‌లో మేనేజీరియల్ పోస్టులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివ‌రాలు: 1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-ఈఆర్‌పీ: 03 2. డిప్యూటీ మేనేజర్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎఫ్‌ఏ/ బీవీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు 32-50 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 31 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,48,000; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.56,100. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది చీఫ్ జనరల్ మేనేజర్, భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 15-11-2024. Website:https://www.brbnmpl.co.in/

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 592 (యూఆర్‌- 352; ఎస్సీ- 56; ఎస్టీ- 24; ఓబీసీ- 123; ఈడబ్ల్యూఎస్‌- 37) వివరాలు: పోస్టులు: రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు. విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ. అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2024. Website:https://www.bankofbaroda.in/

Government Jobs

బెల్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) శాశ్వత ప్రాతిపదికన సీనియర్ ఇంజినీర్‌-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య‌: 10 వివ‌రాలు:  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ( సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ ఈసీఈ/ ఐటీ/ సీఎస్‌ఈ), ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000. దరఖాస్తు ఫీజు: రూ.708; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘అసిస్టెంట్ మేనేజర్, హెచ్‌ఆర్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, మిల్‌కామ్ అండ్‌ ఎన్‌డబ్ల్యూసీఎస్-ఎస్‌బీయూ, జళహల్లి పోస్టు, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2024. Website:https://bel-india.in/

Government Jobs

ఏపీసీఆర్‌డీఏలో రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 19. వివరాలు: 1. జీఐఎస్‌ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్: 06 పోస్టులు 2. ప్లానింగ్ అసిస్టెంట్: 02 పోస్టులు 3. సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 01 పోస్టు 4. జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 03 పోస్టులు 5. జెండర్‌/ జీబీవీ స్పెషలిస్ట్: 01 పోస్టు 6. సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్: 02 పోస్టులు 7. జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్: 04 పోస్టులు అర్హతలు: సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జాబ్ లొకేషన్: విజయవాడ-అమరావతి. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 13.11.2024. Website:https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx Apply online:https://crda.ap.gov.in/Careers/General

Government Jobs

ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ డైరెక్ట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్ట‌ల సంఖ్య: 10 వివ‌రాలు:  1. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్: 06 2. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్: 01 3. అకౌంట్స్‌ ఆఫీసర్: 01 4. మెడికల్ ఆఫీసర్ ఆయుష్ (ఆయుర్వేద): 01 5. చైల్డ్ సైకాలజిస్ట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎండీ/ఎంఎస్, ఎంఏ/ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్ పోస్టులకు 21-40 ఏళ్లు; మిగతా పోస్టులకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్ పోస్టులకు రూ.6,600; మిగతా పోస్టులకు రూ.5,400. దరఖాస్తు ఫీజు: రూ.3,000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.2,400. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 7-11-2024. Website:https://www.aiimsjodhpur.edu.in/

Freshers

విప్రోలో అనలిస్ట్ ఖాళీలు

బెంగళూరులోని విప్రో కంపెనీ అనలిస్ట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్టు: అనలిస్ట్ కంపెనీ: విప్రో (Wipro)  అనుభవం: ఫ్రెషర్స్‌ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ నైపుణ్యాలు: అనలిటికల్ స్కిల్స్‌, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలసిస్, అనలైజస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వినడం, రాయడం) తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 30.11.2024 Website:https://careers.wipro.com/careers-home/jobs/3103038

Apprenticeship

బీడీఎల్‌, సంగారెడ్డిలో అప్రెంటిస్ ఖాళీలు

సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 117 వివరాలు: ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్ (సి), మెషినిస్ట్ (జి), వెల్డర్, మెకానిక్ (డీజిల్), ఎలక్ట్రీషియన్, టర్నర్, సీఓపీఏ, ప్లంబర్, కార్పెంటర్, ఆర్‌ అండ్ ఏసీ, ఎల్‌ఏసీపీ. అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 31-10-2024 నాటికి 14 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2024. Website:https://bdl-india.in/ Apply online:https://www.apprenticeshipindia.gov.in/