పీఎంజేడీవై
దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలు 2025 జులై 31 నాటికి 56.03 కోట్ల వరకు ఉండగా.. ఇందులో 13.04 కోట్ల ఖాతాలు (23 శాతం) నిరుపయోగంలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధ్రీ తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 2.75 కోట్ల జన్‌ధన్ ఖాతాలు నిరుపయోగంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్ (1.39 కోట్లు), మధ్యప్రదేశ్ (1.07 కోట్లు) ఉన్నాయి. రెండేళ్లుగా ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుంటే ఆ ఖాతాలను నిరుపయోగ ఖాతాగా పరిగణించాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి.