Posts

Current Affairs

‘సైబర్‌ సురక్ష’ ప్రారంభం

రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ జగతిలో తలెత్తగల సైబర్‌ ముప్పుల్ని అనుకరించి వాటికి దీటైన సమాధానం ఎలా ఇవ్వాలో తెలియజేస్తూ పరిష్కారం చూపే ‘సైబర్‌ సురక్షా’ కార్యక్రమం 2025, జూన్‌ 16న ప్రారంభమైందని రక్షణ శాఖ ప్రకటించింది. భారత సమగ్ర రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో రక్షణ శాఖ సైబర్‌ సంస్థ ఈ సైబర్‌ భద్రతా సమావేశం నిర్వహిస్తోంది. జూన్‌ 27న ఇది ముగుస్తుంది. రక్షణ, అనుబంధ రంగాలకు చెందిన జాతీయస్థాయి సంస్థల నుంచి 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Current Affairs

సిప్రి నివేదిక

భారత్‌వద్ద 2025, జనవరి నాటికి 180 అణ్వాయుధాలు (అణు వార్‌హెడ్లు) ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) నివేదిక వెల్లడించింది. ఇవి పాకిస్థాన్‌వద్ద ఉన్న 172 కంటే ఎక్కువ.. చైనావద్ద ఉన్న 600 కంటే తక్కువని పేర్కొంది. ఏడాదిలో భారత్‌ 8 వార్‌హెడ్లను పెంచుకుందని తెలిపింది. ప్రపంచ దేశాలవద్ద అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి 2025, జూన్‌ 16న విడుదల చేసింది.  చైనా ఏటా 100 అణు వార్‌హెడ్‌లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంటోందని నివేదిక పేర్కొంది. 

Current Affairs

మోదీకి సైప్రస్‌ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ మకారియోస్‌ 3’తో సైప్రస్‌ గౌరవించింది. 2025, జూన్‌ 16న ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కలిపితే ఇప్పటివరకూ ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 23కు చేరుకుంది. సైప్రస్‌ పర్యటనలో భాగంగా నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌తో సమావేశమైన మోదీ.. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణంసహా పలు ద్వైపాక్షిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు.

Current Affairs

అమితాబ్‌ కాంత్‌

అమితాబ్‌ కాంత్‌ 2025, జూన్‌ 16న జీ20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలిగారు. 1980 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన ఈ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి 2022 జులైలో భారత జీ20 షెర్పాగా నియమితులయ్యారు. అప్పట్లో జీ20 సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడానికి కొద్ది నెలల ముందు ఈ నియామకం జరిగింది.   2016-22 వరకు నీతిఆయోగ్‌ సీఈఓగా కాంత్‌ బాధ్యతలు నిర్వహించారు. పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు.. సంస్కరణలు, సరళీకరణలకు కాంత్‌ పెద్దపీట వేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా కాంత్‌ ఉన్న సమయంలోనే ‘ఇంక్రెడిబుల్‌ ఇండియా’ను తీసుకొచ్చారు.

Current Affairs

‘ఎమ్‌ఐ6’కి నేతృత్వం వహించనున్న బ్లేయిస్‌ మెట్రెవేలీ

యూకే ప్రభుత్వ నిఘా సంస్థ ‘ఎమ్‌ఐ6’ 18వ చీఫ్‌గా బ్లేయిస్‌ మెట్రెవేలీ నియమితులయ్యారు. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ఎమ్‌ఐ6’కి నాయకత్వ బాధ్యత వహించనున్న మొదటిసారిగా ఈమె నిలిచారు. దేశంలో టెర్రరిజాన్ని అరికట్టడం, రాష్ట్రాల్లో అల్లర్లను అడ్డుకోవడం, సైబర్‌ భద్రతను కాపాడటం వీరి ప్రధాన కర్తవ్యాలు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రపాలజీ చదువుకున్న మెట్రెవేలీ 1999లో దేశ నిఘా విభాగంలో చేరి మధ్య ఆసియా, ఐరోపాలో విధులు నిర్వర్తించారు.  

Current Affairs

జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జన గణన కోసం కేంద్ర హోంశాఖ 2025, జూన్‌ 16న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ పేరుతో ఇది విడుదలైంది. జన గణన చట్టం-1948లోని సెక్షన్‌ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.

Walkins

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సీఈసీఆర్‌ఐ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I - 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/  బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టుకు రూ.25,000. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు 35 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 19-06-2025. వేదిక: సీఎస్‌ఐఆర్- సీఈసీఆర్ఐ, చెన్నై యూనిట్‌ తారామణి. Website:https://www.cecri.res.in/cecri/Default.aspx

Internship

ఎనియాక్‌వరల్డ్‌ మీడియాలో ట్రావెల్‌ అండ్‌ టూరిజం పోస్టులు

ఎనియాక్‌వరల్డ్‌ మీడియా కంపెనీ ట్రావెల్‌ అండ్‌ టూరిజం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: ఎనియాక్‌వరల్డ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పోస్టు పేరు: ట్రావెల్‌ అండ్‌ టూరిజం  నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, హాలిడీ ప్యాకేజీ డిజైన్, హాస్పిటాలిటీ, ఇంటర్నేషనల్‌ స్కిల్స్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, ట్రావెల్‌ ఇటినరీ మేకింగ్‌లో నైపుణ్యాలు ఉండాలి.  స్టైపెండ్: రూ.2,000- రూ.4,000. వ్యవధి: 5 నెలలు. దరఖాస్తు గడువు: 11-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-travel-tourism-internship-at-eniacworld-media-private-limited1749620603

Internship

సైబర్‌వీ కంపెనీలో ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు

సైబర్‌వీ కంపెనీ ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: సైబర్‌వీ  పోస్టు పేరు: ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌  నైపుణ్యాలు: కోలాబరేషన్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్, సేల్స్‌ స్ట్రాటజీ, స్టేక్‌హోల్డర్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి.  స్టైపెండ్: రూ.7,500 - రూ.10,500 వ్యవధి: 6 నెలలు. దరఖాస్తు గడువు: 03-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-placement-coordinator-internship-at-cybervie1748927814

Government Jobs

నాబార్డ్‌లో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు

ముంబయి బాంద్రాలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవెలప్‌మెంట్‌ (నాబార్డ్‌) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: డేటా సైంటిస్ట్‌/ ఏఐ ఇంజినీర్‌- 02            డేటా ఇంజినీర్‌- 01 డేటా సైంటిస్ట్‌-కమ్‌-బీఐ డెవెలపర్‌- 01        స్పెషలిస్ట్‌-డేటా మేనేజ్‌మెంట్‌- 01       అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు తదితర నైపుణ్యాలు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: ఏడాదికి డేటా సైంటిస్ట్‌/ ఏఐ ఇంజినీర్‌ పోస్టుకు రూ.21- రూ.30లక్షలు; డేటా ఇంజినీర్‌కు రూ.18- 27లక్షలు; డేటా సైంటిస్ట్‌కు రూ.15-రూ.21లక్షలు, స్పెషలిస్ట్‌కు రూ.12-రూ.15 లక్షలు. వయోపరిమితి: ఏడాదికి డేటా సైంటిస్ట్‌/ ఏఐ ఇంజినీర్‌, డేటా ఇంజినీర్‌ పోస్టులకు 25- 35ఏళ్లు; డేటా సైంటిస్ట్‌కు 23- 30ఏళ్లు, స్పెషలిస్ట్‌కు 30- 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్‌ చార్జెస్‌ రూ.150; ఇతరులకు రూ.850. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-06-2025. Website:https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26