Posts

Government Jobs

Non Faculty Posts In AIIMS Jodhpur

All India Institute of Medical Sciences (AIIMS), Jodhpur is inviting applications for filling up the vacant Non-Faculty posts on direct basis. Number of Posts: 10 Details: 1. Deputy Medical Superintendent: 06 2. Blood Transfusion Officer: 01 3. Accounts Officer: 01 4. Medical Officer AYUSH (Ayurveda): 01 5. Child Psychologist: 01 Qualification: Degree, MD/MS, MA/MSc, Ph.D. along with work experience in the relevant department following the post. Age Limit: 21-40 years for the posts of Deputy Medical Superintendent, Blood Transfusion Officer; For other posts should be between 21-35 years. 5 years for SC/ST, 3 years for OBC and 10 years for PwBDs candidates. Salary: Per month Rs.6,600 for the posts of Deputy Medical Superintendent, Blood Transfusion Officer; Rs.5,400 for other posts. Application Fee: Rs.3,000; SC/ST/PwBDs candidates for Rs.2,400. Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc. Online Application Last Date: 7.11.2024 Website:https://www.aiimsjodhpur.edu.in/

Current Affairs

ఎన్‌ఎస్‌ఈ ఖాతాలు 20 కోట్లు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వద్ద నమోదైన మొత్తం క్లయింట్ల ఖాతాల సంఖ్య 20 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ఆ సంస్థ 2024, అక్టోబరు 30న వెల్లడించింది. డిజిటలీకరణ, సాంకేతికత మార్పులు ఇందుకు ఉపకరించాయని పేర్కొంది. 2024 మార్చిలో క్లయింట్ల సంఖ్య 16.90 కోట్లుగా ఉంది. క్లయింట్ల ఖాతాల్లో తొలి 10 రాష్ట్రాలు: 1. మహారాష్ట్ర: 3.6 కోట్లు, 2. ఉత్తర్‌ ప్రదేశ్‌: 2.18 కోట్లు, 3. గుజరాత్‌: 1.81 కోట్లు, 4. రాజస్థాన్‌: 1.17 కోట్లు, 5. పశ్చిమ్‌ బెంగాల్‌: 1.16 కోట్లు 6. కర్ణాటక: 1.07 కోట్లు, 7. మధ్య ప్రదేశ్‌: 1.04 కోట్లు, 8. తమిళనాడు: 1.01 కోట్లు, 9. దిల్లీ: 90.79 లక్షలు, 10. ఆంధ్రప్రదేశ్‌: 89.69 లక్షలు  

Current Affairs

కన్నడ రాజ్యోత్సవ కిరీటం

ఏపీ జలవనరుల శాఖ సలహాదారు ఎన్‌.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. నవంబరు 1న కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం 19వ క్రస్టుగేట్‌ కొట్టుకుపోయింది. ఈ భారీ విపత్తు నుంచి జలాశయంలోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్యనాయుడి నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించి సఫలమైంది. కన్నయ్యనాయుడి సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.   

Current Affairs

తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా టీవీ5 ఛానల్‌ అధినేత బీఆర్‌ నాయుడు 2024, అక్టోబరు 30న నియమితులయ్యారు. మొత్తం 24 మందితో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందికి అవకాశం కల్పించింది. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.   

Freshers

Analyst Posts In Wipro, Bangalore

Wipro Company is invites applications for the recruitment of Analyst vacancies. Details: Post: Analyst Company: Wipro  Experience: Freshers Qualification: Any Graduate Skills: Analytical Skills, Problem Solving, Data Analysis, Analyzes, Communication Skills (Listening, Writing) etc. Job Location: Bangalore Application Procedure: Through Online. Last date: 30.11.2024 Website:https://careers.wipro.com/careers-home/jobs/3103038

Current Affairs

శ్రీశ్రీ రవిశంకర్‌కు ఫిజీ పురస్కారం

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు ఫిజీ దేశ పురస్కారమైన  ‘ఆనరరీ ఆఫీసర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ లభించింది. శ్రీశ్రీకి ఈ పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ అందించారు.  * మానవ సమాజంలో స్ఫూర్తిని, వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి గాను శ్రీశ్రీకి ఈ అవర్డు దక్కింది.

Apprenticeship

Apprentice Posts In BDL, Bhanur Unit

Bharath Dynamics Limited(BDL), Bhanur Unit, Sangareddy District invites applications for the recruitment of Apprenticeship Training for the year 2024-25.  No. of Posts: 117 Details: Trade Name: Fitter, Electronics Mechanic, Machinist (C), Machinist (G), Welder, Mechanic (Diesel), Electrician, Turner, COPA, Plumber, Carpenter, R&AC, LACP. Qualification: Candidates Should Possess SSC/ 10th Pass, ITI Pass in respective trade. Age Limit (as on 31-10-2024): 14 to 30 Years. Duration of training: One year. Selection Process: Based on the marks scored by the eligible candidates as per the essential qualification. Equal weight age for marks will be given for 10th/ SSC pass and ITI Pass. Last date for Online Application: 11-11-2024. Website:https://bdl-india.in/ Apply online:https://www.apprenticeshipindia.gov.in/

Current Affairs

మన్‌వీన్‌ పామ్‌ కౌర్‌

హెచ్‌ఎస్‌బీసీకి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా భారతీయ నేపథ్యం ఉన్న మన్‌వీన్‌ పామ్‌ కౌర్‌ నియమితులయ్యారు. 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న హెచ్‌ఎస్‌బీసీకి సీఎఫ్‌ఓగా నియమితులైన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. లండన్‌లో స్థిరపడ్డ 60 ఏళ్ల పామ్‌ కౌర్‌ నాలుగు దశాబ్దాలుగా బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, ఆడిట్, కొత్త విధానాల అమలు.. అంశాల్లో ఆమెకు అపార అనుభవం ఉంది. * ఆమె 1983లో పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బీకాం, మార్కెటింగ్, ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. 

Current Affairs

జనన మరణాల నమోదుకో యాప్‌

జనన మరణాలను నమోదు చేయడానికి వీలుకల్పించే సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2024, అక్టోబరు 29న ఆవిష్కరించారు. పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌) పేరుతో రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం దీన్ని రూపొందించింది.   

Current Affairs

వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా

దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం 2024, అక్టోబరు 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు.  * అర్హులైన వారికి ‘ఆయుష్మాన్‌ భారత్‌ వయ వందన’ కార్డులను పంపిణీ చేశారు. దేశంలో వైద్య-ఆరోగ్య రంగాలకు సంబంధించిన రూ.12,850 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు.