Posts

Current Affairs

‘అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌’ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024, నవంబరు 1న లద్దాఖ్‌లోని లేహ్‌లో ‘అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌’ను ప్రారంభించింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాలను పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి.  * అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ముందు రోదసి సంస్థలు ‘అనలాగ్‌ మిషన్‌’లను చేపడుతుంటాయి. ఇందులో భాగంగా భూమిపై రోదసి వాతావరణాన్ని పోలిన ప్రదేశాల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. వాస్తవ ప్రయోగానికి ముందు చేపట్టే ఇలాంటి కసరత్తు వల్ల బోలెడు సమయం, డబ్బు, మానవవనరులు ఆదా అవుతాయి.  

Current Affairs

‘మత్స్య 6000’ యంత్రం

‘సముద్రయాన్‌’ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్‌ యంత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది. అందులో ఉండే సభ్యుల కోసం ప్రత్యేక ఆహారాన్ని కూడా సిద్ధం చేసింది.  * అత్యవసర పరిస్థితులను తట్టుకొనేలా మత్స్య-6000 సబ్‌మెర్సిబుల్‌ వెహికల్‌ను సిద్ధం చేశారు. సంక్లిష్ట సమయంలో 96 గంటలపాటు సిబ్బంది దీనిలో ఉండొచ్చు. ఇందుకోసం 67 ఆక్సిజన్‌ సిలిండర్లు పని చేస్తుంటాయి. మొత్తంగా ఇది సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశంలో 108 గంటలు ఉండగలదు. సముద్రగర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధన కోసం 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మన దేశం సుమారు రూ.4,077 కోట్లు వెచ్చిస్తోంది. 

Current Affairs

మాన్సికి కాంస్యం

భారత యువ రెజ్లర్‌ మాన్సి అహ్లావత్‌ ప్రపంచ యూత్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గింది. టిరానా (అల్బేనియా)లో జరిగిన మహిళల ఫ్రీస్టయిల్‌ 59 కేజీల కాంస్య పోరులో మాన్సి 5-0తో లారెన్స్‌ బ్యూరెగార్డ్‌ (కెనడా)ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో ఈ భారత రెజ్లర్‌ 1-4తో సుకీ (మంగోలియా) చేతిలో ఓడింది.   

Current Affairs

మూడేళ్లకే ఫిడే రేటింగ్‌

ఫిడే రేటింగ్‌ సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా అనీశ్‌ సర్కార్‌ (3) చరిత్ర సృష్టించాడు. మూడేళ్ల ఎనిమిది నెలల 19 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అనీశ్‌.. గత రికార్డు (అయిదేళ్లలో తేజస్‌ తివారీ)ను బద్దలుకొట్టాడు.  * 2024 అక్టోబరులో పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్ర అండర్‌-9 టోర్నీతో తొలిసారి పోటీల బరిలో దిగిన అతడు 8కి గాను 5.5 పాయింట్లు సాధించాడు. రేటింగ్‌ కలిగిన ఇద్దరు ప్రత్యర్థులను ఓడించాడు. ఆ తర్వాత ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశితో తలపడ్డ ఆటగాళ్లలో అనీశ్‌ కూడా ఉన్నాడు.  

Government Jobs

Scientist B Posts In C-DAC, Bangalore

Center for Development of Advanced Computing (C-DAC), Bengaluru invites applications for 22 Scientist B posts on contract basis. No. of Posts: 22 (Hyderabad: 04; Delhi: 05; Pune: 05; Bangalore: 08) Details:  Disciplines: VLSI Design, Cyber ​​Security, Embedded Systems, Applied AI and Data Analytics, Applied Computing, System Administrator, Software Development etc. Qualification: Should have passed BE/BTech/ME/MTech/ in relevant specialization following the post with work experience. Salary: Per month Rs.56,100. Age Limit: 30 years for EWS; 35 years for STs; 33 years for OBCs; PwBDs candidates should be 40 years of age. Application Fee: Rs.500; SC/ ST/ PwBDs candidates are exempted in fee. Selection: Based on Written Test, Group Discussion, Interview etc. Last date of application: 1-12-2024. Website:https://careers.cdac.in/advt-details/CORP-28102024-REK85

Government Jobs

Managerial Posts In BRBNMPL, Bangalore

Bharatiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL), Bangalore, Karnataka invites applications to fill up the vacant managerial posts on contract basis. Number of Posts: 05 Details: 1. Assistant General Manager-ERP: 03 2. Deputy Manager: 02 Qualification: Degree, BFA/ BVA, PG pass in relevant discipline as per the post along with work experience. Age Limit: 32-50 years for Assistant General Manager posts; 31 years for Deputy Manager posts. 5 years for SC/ST, 3 years for OBC and 10 years for PwBDs candidates. Salary: Per month Rs.1,48,000 for Assistant General Manager posts; Rs.56,100 for Deputy Manager posts. Application Fee: Rs.500; SC/ST/PwBDs candidates are exempted in fee. Application Procedure: Offline applications should be sent to 'The Chief General Manager, Indian Reserve Bank Note Mudran Private Limited, BTM Layout, Bannerghatta Road, Bangalore'. Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc. Last Date of Application: 15-11-2024. Website:https://www.brbnmpl.co.in/

Government Jobs

Various Posts In Bank of Baroda

Bank of Baroda (BOB) inviting applications for recruitment for various positions on contract basis for various departments in Bank of Baroda. No. of Posts: 592 (UR- 352; SC- 56; ST- 24; OBC- 123; EWS- 37) Details: Position: Relationship Manager, Zonal Lead Manager, Business Manager, Data Engineers, Testing specialist, Project Manager, Zonal Receivables Manager, Regional Receivables Manager, Area Receivables Manager, Floor Manager, Senior Cloud Engineer, Product Manager etc. Department: Finance, MSME, Digital Group, Receivables Department, IT, C&IC. Qualification: Degree, CA/ CMA/ CFA, PG, PG Diploma in relevant discipline with work experience. Application fees: Rs.600 for General, EWS & OBC candidates. Rs.100 for SC, ST, PWD & Women candidates. Last date of submission of the application: 19.11.2024. Website:https://www.bankofbaroda.in/

Government Jobs

Senior Engineer Posts In BEL, Bangalore

Bharat Electronics Limited (BEL), Bangalore is inviting applications for filling up the Senior Engineer-3 posts on permanent basis.  No. of Posts: 10 Details:  Qualification: BE/BTech (Cyber ​​Security/ Information Security/ ECE/ IT/ CSE),  ME/MTech pass in relevant discipline following the post with work experience. Upper Age Limit: 32 years. relaxation of 3 years for OBCs, 5 years for SC/ST candidates and 10 years for PwBDs. Salary: Per month Rs.50,000- Rs.1,60,000. Application Fee: Rs.708; SC/ST/PWD candidates are exempted in fee. Selection Process: Based on Written Test, Interview etc. Application Procedure: Offline applications should be sent to 'Assistant Manager, HR, Bharat Electronics Limited, Milcom and NWCS-SBU, Jalahalli Post, Bangalore'. Last date for application: 19-11-2024. Website:https://bel-india.in/

Government Jobs

Various Posts In APCRDA, Vijayawada

Andhra Pradesh Capital Region Development Authority, Vijayawada invites applications for filling up certain positions on contract basis. No. of Posts: 19. Details: 1. GIS & Remote Sensing Assistant: 06 Posts 2. Planning Assistant: 02 Posts 3. Senior Livelihood Specialist: 01 Post 4. Junior Livelihood Specialist: 03 Posts 5. Gender/GBV Specialist: 01 Post 6. Senior Occupational Health & Safety Specialist: 02 Posts 7. Junior Occupational Health & Safety Specialist: 04 Posts Qualifications: B.Arch., B.Tech/B.E, ME/M.Tech., PG in relevant discipline with experience. Job Location: Vijayawada- Amaravati. Last date for online application: 13.11.2024. Website:https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx Apply online:https://crda.ap.gov.in/Careers/General

Current Affairs

ద్రవ్యలోటు రూ.4,74,520 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 29.4 శాతానికి చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర వ్యయాలు, ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూపాయల్లో చెప్పాలంటే సెప్టెంబరు చివరకు ద్రవ్యలోటు రూ.4,74,520 కోట్లుగా నమోదైంది. 2023-24 తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు, బడ్జెట్‌ అంచనాల్లో 39.3 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి (రూ.16,13,312 కోట్లకు) పరిమితం చేయాలని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా ఉంది.