దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపో
దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను దిల్లీలో 2024, నవంబరు 16న ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. సరోజినీ నగర్‌లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి ‘సఖి డిపో’ అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని.. దీని కోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు.