Posts

Government Jobs

సీఈఐఎల్‌లో ఇంజినీర్ పోస్టులు

మహారాష్ట్రలోని సర్టిఫికేషన్‌ ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్‌ 2. సీనియర్ ఆఫీసర్ 3. అసోసియేట్-1/2/3 విభాగాలు: క్వాలిటీ అసురెన్స్/ క్వాలిటీ కంట్రోల్, ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌, హ్యుమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా, సీఏ, బీఈ/బీటెక్ (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌/ప్రొడక్షన్), బీబీఏ, బీసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. పని ప్రదేశాలు: ముంబయి, దిల్లీ. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్:recruit.hr3@ceil.co.in చివరి తేదీ: 28-11-2024. వెబ్‌సైట్‌:https://ceil.co.in/

Admissions

కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2025

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) ప్రకటన వెలువడింది. ఈ స్కోరుతో 2025-2026 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.  వివరాలు: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2025 అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: దరఖాస్తుకు వ‌య‌సుతో సంబంధం లేదు. దరఖాస్తు రుసుము: జనరల్‌ (యూఆర్‌) పురుషులకు రూ.2500, మహిళలకు రూ.1250. జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ-(ఎన్‌సీఎల్‌) పురుషులకు- రూ.1250, మహిళలకు రూ.1250. థర్డ్ జెండర్‌కు రూ.1250. పరీక్ష విధానం: సీమ్యాట్‌లో 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ విభాగాల్లో  ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌ పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.   తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-12-2024. రుసుము చెల్లింపు చివరి తేదీ: 14-12-2024. దరఖాస్తు సవరణ తేదీలు: 15-12-2024 నుంచి 17-12-2024 వరకు. పరీక్ష కేంద్రం వివరాలు ప్రకటన: 17-01-2025. అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్ ప్రారంభం: 20-01-2025. పరీక్ష తేదీ: 25-01-2025.     వెబ్‌సైట్‌:https://exams.nta.ac.in/CMAT/  అప్లై ఆన్‌లైన్‌:https://cmat.ntaonline.in/

Current Affairs

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైజర్‌’తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్‌ టినుబు అవార్డును మోదీకి 2024, నవంబరు 17న అందించారు. 1969లో క్వీన్‌ ఎలిజబెత్‌కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. 

Current Affairs

విక్టోరియా కెజార్‌

డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌ (21) మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని కైవసం చేసుకొంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించిపెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది. మెక్సికోలోని అరెనాలో నిర్వహించిన వేడుకలో మొత్తం 125 మంది పోటీదారులను దాటి ఆమె ఈ ఘనత సాధించారు.  నైజీరియాకు చెందిన చిడీమా అడిటీనా, మెక్సికో భామ మరియా ఫెర్నాండా బెల్ట్రన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Current Affairs

హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం

భారత్‌ 2024, నవంబరు 17న తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి పరీక్షించారు.  దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం చేరింది. ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణి 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ క్షిపణి కాంప్లెక్స్‌తోపాటు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ల్యాబ్‌లు, పరిశ్రమలు రూపొందించాయి.

Current Affairs

సురేఖకు స్వర్ణం

ప్రపంచ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌ టోర్నీలో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం నెగ్గింది. 2024, నవంబరు 17న లక్సంబర్గ్‌లో జరిగిన కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆమె 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో ఆమె షూటాఫ్‌లో ఎలీసా (ఇటలీ)పై గెలిచింది. 

Current Affairs

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్‌ బాడీ) చదువుతున్న విద్యార్థులు 2024లో ఏకంగా 1.29 లక్షలు తగ్గారు. గత విద్యా సంవత్సరం (2023-24)లో 18.13 లక్షల మంది ఉండగా... ఈసారి 16.84 లక్షలకు తగ్గిపోయారని పాఠశాల  విద్యాశాఖ వెల్లడించింది. గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు తదితరాలను కూడా కలిపి మొత్తం ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలలను పరిగణనలోకి తీసుకుంటే అటుఇటుగా 2 లక్షల మంది పిల్లలు తగ్గారని తెలుస్తోంది.  రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ లేకపోవడం గమనార్హం.

Current Affairs

మారిషస్‌లో భారత్‌ హైకమిషనర్‌గా అనురాగ్‌ శ్రీవాత్సవ

మారిషస్‌లో భారతదేశ తదుపరి హైకమిషనర్‌గా అనురాగ్‌ శ్రీవాత్సవ 2024, నవంబరు 16న నియమితులయ్యారు. 1999 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో నేపాల్‌-భూటాన్‌ విభాగానికి సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మక ద్వీప దేశంగా ఉన్న మారిషస్‌లో ప్రస్తుతం భారత హైకమిషనర్‌గా కె.నందిని సింగ్లా ఉన్నారు.

Current Affairs

కార్యాలయాల అద్దె ధరలు దిల్లీలో అధికం

దేశంలో కార్యాలయ స్థలాల అద్దె విషయంలో దిల్లీ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఇక్కడ చదరపు అడుగుకు అద్దె  రూ.340 ఉంది. ఆసియా పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో ఇది ఆరో ఖరీదైన మార్కెట్‌ అని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఆసియా పసిఫిక్‌ ప్రైమ్‌ ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ జులై-సెప్టెంబరు 2024 నివేదికలో వెల్లడించింది.  హాంకాంగ్‌ అత్యంత ఖరీదైన మార్కెట్‌గా నిలిచిందని తెలిపింది.  ముంబయిలో 5 శాతం, బెంగళూరులో 3 శాతం చొప్పున అద్దెలు పెరిగాయని పేర్కొంది. ముంబయిలో చ.అడుగు ధర రూ.317 (8వ స్థానం)గా ఉంది. బెంగళూరులో చ.అడుగు ధర రూ.138 (18వ స్థానం)గా ఉంది.

Current Affairs

వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌

అమెరికా అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధ (వైట్‌హౌస్‌) తదుపరి ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌ (27)ను ఎంపిక చేశారు. 2025, జనవరి 20న ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. అమెరికన్‌ రచయిత అయిన లెవిట్‌ ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ బృందానికి నేషనల్‌ ప్రెస్‌ సెక్రటరీగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషించారు. ట్రంప్‌ మొదటి దఫా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరొలైన్‌ లెవిట్‌ శ్వేతసౌధ అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.