Posts

Current Affairs

International Film Festival of India (IFCI)

♦ The 55th edition of the International Film Festival of India (IFCI) was inaugurated at Dr. Shyama Prasad Mukherjee Stadium in Goa on 20 November 2024. IFFI is set to continue till November 28.  ♦ IFFI 2024 is making history by introducing Indian Sign Language interpretation during the opening ceremony, ensuring that audiences with hearing disabilities can fully participate in the event. ♦ This year (2024) the festival has received 1,676 submissions from 101 countries. The festival will present over 180 international titles from 81 countries, which include 16 premieres in world, three in international, 43 in Asian, and 109 in Indian categories.

Current Affairs

Narendra Modi

♦ Prime Minister Narendra Modi has met Guyana President Mohamed Irfaan Ali in Georgetown on 20 November 2024. India and Guyana signed 10 Memorandum of Understandings (MoUs) during Modi’s visit.  ♦ Key agreements include an MoU on Cooperation in the Hydrocarbons Sector, focusing on joint efforts in crude sourcing, natural gas collaboration, Bilateral Cooperation in Agriculture and Allied Sectors and infrastructure development. ♦ This partnership also aims to enhance capacity building and expertise sharing across the hydrocarbon value chain. ♦ This is the first visit by an Indian head of the state to the country in more than 50 years.

Current Affairs

జీటీఆర్‌ఐ అంచనాలు

2030 నాటికి సేవల రంగం ఎగుమతులు 618 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52 లక్షల కోట్ల)కు చేరనున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. అప్పటికి వస్తువుల ఎగుమతుల విలువ 613.04 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.51.50 లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలిపింది.  2018-19 నుంచి 2023-24 వరకు దేశ వస్తువుల ఎగుమతులు 5.8% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను నమోదు చేయగా సేవల ఎగుమతులు 10.5% వృద్ధితో ముందున్నాయి. ఇదే వేగం కొనసాగితే 2030 నాటికి సేవల ఎగుమతులు 618.21 బి. డాలర్లకు, వస్తువుల ఎగుమతులు 613.04 బి. డాలర్లకు చేరతాయి.

Current Affairs

వరల్డ్స్‌ బెస్ట్‌ సిటీస్‌ 2025

ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి 2024, నవంబరు 20న విడుదలైన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ సిటీస్‌ 2025’ ర్యాంకుల జాబితాలో లండన్‌ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్‌ (అమెరికా), పారిస్‌ (ఫ్రాన్స్‌), టోక్యో (జపాన్‌), సింగపూర్, రోమ్‌ (ఇటలీ), మాడ్రిడ్‌ (స్పెయిన్‌), బార్సిలోనా (స్పెయిన్‌), బెర్లిన్‌ (జర్మనీ), సిడ్నీ (ఆస్ట్రేలియా) ఉన్నాయి. భారతీయ నగరాలు ఏవీ ఇందులో లేవు. ఇప్‌సాస్‌ సంస్థ భాగస్వామ్యంతో రెసొనెన్స్‌ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగుల విశ్లేషణ నివేదికను లండన్‌లో విడుదల చేశారు.  శ్రామికశక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాలను విశ్లేషిస్తారు. 

Current Affairs

సీసీపీఐ-2025

భూ తాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక, శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తోన్న దేశాల్లో భారత్‌ పదో అగ్రస్థానంలో నిలిచింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా 2024, నవంబరు 20న 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది. వాతావరణ మార్పుల ఆచరణ సూచీ (సీసీపీఐ-2025) పేరుతో నిపుణులు దీన్ని రూపొందించారు.  ఈ జాబితాలో గత ఏడాది (2023) కంటే రెండు స్థానాల దిగువకు భారత్‌ చేరింది.  భారత్‌లో తలసరి ఉద్గారాల విడుదల 2.9 టన్నులుగా ఉంది. ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు 6.6 టన్నులు కావడం గమనార్హం.

Current Affairs

ఇఫ్పీ

గోవా రాజధాని నగరం పణజీలోని డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో 2024, నవంబరు 20న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ప్రారంభమైంది. భారత చలనచిత్ర రంగ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌కపూర్, మహమ్మద్‌ రఫీ, తపన్‌సిన్హాల శత జయంతుల సందర్భంగా వారి పేరిట స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.

Current Affairs

గయానాతో 10 ఒప్పందాలు

ప్రధాని నరేంద్ర మోదీ 2024, నవంబరు 20న గయానా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 10 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. హైడ్రో కార్బన్స్, డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థలు, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి.

Current Affairs

టెన్నిస్‌కు నాదల్‌ వీడ్కోలు

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ (38) 2024 నవంబరు 20న ఆట నుంచి రిటైరైపోయాడు. అత్యంత విజయవంతమైన తన కెరీర్‌ను అతడు ఓటమితో ముగించాడు. స్పెయిన్‌లో జరిగిన డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌లో అతడు 4-6, 4-6తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్‌ జాండ్‌షల్ప్‌ చేతిలో ఓడిపోయాడు. 2001లో ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మారిన నాదల్‌ 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన వారిలో జకోవిచ్‌ (24) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచాడు. యుఎస్‌ ఓపెన్‌ను నాలుగు సార్లు సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండేసి సార్లు ట్రోఫీ ముద్దాడాడు. నాదల్‌ చివరగా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడాడు. ఒలింపిక్స్‌లో నాదల్‌ 2008లో సింగిల్స్, 2016లో డబుల్స్‌ స్వర్ణాలు గెలిచాడు. 

Current Affairs

మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ నెగ్గింది. 2024, నవంబరు 20న రాజ్‌గిర్‌ (బిహార్‌)లో జరిగిన ఫైనల్లో భారత్‌ 1-0తో ఒలింపిక్‌ రజత పతక విజేత చైనాను ఓడించింది. జరిగిన భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను దీపిక (31వ) సాధించింది. దీపిక మొత్తం 11 గోల్స్‌తో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత్‌కు ఇది మూడో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌. ఇంతకుముందు 2016, 2023లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. 

Walkins

Project Assistant Posts In IIPR

ICAR-Indian Institute of Pulses Research, Kanpur, Uttar Pradesh is conducting interviews for the post of Project Assistant on contract basis. No. of Posts: 06 Details: Project Assistant- 02 Field Helper- 01 Junior Research Assistant- 01 Young Professional-II- 01 Young Professional-I- 01 Qualification: Intermediate, Degree, PG in the relevant department following the post along with work experience. Salary: Per month Rs.18,000 for Project Assistant, Field Helper posts; 20,000 for Junior Research Assistant; Rs.42,000 for Young Professional-II; 30,000 for Young Professional-I. Age Limit: 21 years to 45 years as per the post. Interview Dates: 25-11-2024 to 29-11-2024, 03-12-2024. Venue: Indian Institute of Pulses Research, Kanpur, Uttar Pradesh. Website:https://iipr.icar.gov.in/