కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులు
మంగళూరులోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ (కేబీఎల్), ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా కేబీఎల్ శాఖలు/ కార్యాలయాల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ/ బోర్డు నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01-11-2024 నాటికి గరిష్ఠంగా 26 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. పే స్కేల్: నెలకు రూ.24,050 నుంచి రూ.64,480. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ పరీక్ష అంశాలు: రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 200. గరిష్ఠ మార్కులు 200. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూదిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, మంగళూరు, ధార్వాడ్/ హుబ్బల్లి, మైసూరు, శివమొగ్గ, కలబురగి. దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.600). ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు ముగింపు తేదీ: 30-11-2024. పరీక్ష తేదీ: 15-12-2024. Website:https://karnatakabank.com/careers Apply online:https://karnatakabankcsa.azurewebsites.net/