పురస్కారాలు స్వీకరించిన మోదీ
గయానా, డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోదీ స్వీకరించారు. కొవిడ్ సమయంలో భారత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ఆయా దేశాలు అందజేశాయి. ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పురస్కారాన్ని ప్రధాని మోదీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ 2024, నవంబరు 20న అందజేశారు. ‘డొమినికా అవార్డు ఆఫ్ హానర్’ పురస్కారాన్ని ప్రధాని మోదీకి డొమినికా అధ్యక్షుడు సిల్వేనీ బర్టన్ అందజేశారు. నవంబరు 20న జరిగిన కరీబియన్ దేశాల సదస్సు సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. బార్బడోస్ కూడా దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేస్తామని నవంబరు 21న ప్రకటించింది. దీంతో కలిపితే మోదీకి లభించిన అవార్డుల సంఖ్య 19కి చేరనుంది.