మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు 2024, నవంబరు 23న వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలే విజయం సాధించాయి. మహారాష్ట్ర: ఎన్డీయే ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో విజయం సాధించింది. నాలుగింట మూడొంతులకుపైగా మెజారిటీ సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉండగా, మెజారిటీ మార్కు 145. మహాయుతి (ఎన్డీయే) కూటమి 234 ఎమ్మెల్యే సీట్లు నెగ్గగా, మహా వికాస్ అఘాడీ (ఇండియా) కూమటికి 48, ఇతరులకు 6 దక్కాయి. 149 సీట్లలో పోటీ చేసిన భాజపా 132 నియోజకవర్గాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి మొత్తం 26.78% ఓట్లు దక్కాయి. భాజపాకు 2014లో 122, 2019లో 105 సీట్లు దక్కాయి. పార్టీల పరంగా చూస్తే.. శివసేన: 57 (12.37%), ఎన్సీపీ: 41 (9.01%), శివసేన (ఉద్ధవ్): 20 (9.97%), కాంగ్రెస్: 16 (12.40%), ఎన్సీపీ (శరద్): 10 (11.29%), సమాజ్‌వాదీ: 2 (0.38%), ఎంఐఎం: 1 (0.85%), సీపీఎం : 1 (0.34%), ఇతరులు: 8 ఝార్ఖండ్: ఝార్ఖండ్‌లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి గెలిచింది. 2019లో 47 సీట్లనే గెలుచుకున్న ఈ కూటమి ఈసారి 56 సీట్లను సాధించింది. 2024లో ఎన్డీయే కూటమికి 24 దక్కగా, ఇతరులు 1 స్థానంలో నెగ్గారు. ఝార్ఖండ్‌లో మొత్తం సీట్లు 81 కాగా, మెజారిటీ మార్కు 41. పార్టీల వారీగా సీట్లు, ఓట్ల శాతం.. జేఎంఎం: 34 (23.44%), భాజపా: 21 (33.17%), కాంగ్రెస్: 16 (15.57%), ఆర్జేడీ : 4 (3.44%), సీపీఐ (ఎంఎల్-ఎల్) : 2 (1.88%), ఏజేఎస్‌యూ: 1 (3.54%), ఎల్జేపీ (ఆర్‌వీ): 1 (0.61%), జేడీయూ: 1 (0.81%), జేఎల్‌కేఎం: 1.