Posts

Current Affairs

Rithvik Bollipalli

♦ N Sriram Balaji and his fellow Indian partner Rithvik Bollipalli won the men’s doubles title at the Citta' Di Rovereto 2024 on the ATP Challenger Tour in Italy on 23 November 2024. ♦ The top seed Indian duo defeated second-seeded French tennis player Theo Arribage and his Portuguese partner Francisco Cabral 6-3, 2-6, 12-10 in the final. ♦ This was Rithvik’s second title on the ATP Challenger Tour, having won the crown at the Almaty Open in Kazakhstan last month with Arjun Kadhe.

Current Affairs

Kiren Rijiju

♦ Union Minister for Minority Affairs Kiren Rijiju launched the Haj Suvidha App 2.0 in New Delhi on 23 November 2024. ♦ It featuring key updates such as air travel details, Mina navigation maps, and health advisories for Indian pilgrims.  ♦ Kiren Rijiju launched the app during the Conference of Chairpersons of State and UT Haj Committees. ♦ Rijiju highlighted the Haj pilgrimage as India’s largest annual logistical operation abroad and emphasized reforms to enhance the experience, including the removal of discretionary quotas and support for women pilgrims traveling without Mehram.  ♦ The app introduces advanced features like boarding pass details, improved navigation, and health records, building on the success of its predecessor launched in 2024. ♦ Additional reforms include procuring modern accommodations near Haram and deploying upgraded buses for pilgrim travel between Makkah, Madinah, and other regions.

Current Affairs

S Jaishankar

♦ External Affairs Minister S Jaishankar addressed the 8th India Ideas Conclave 2024 in Bengaluru on 23 November 2024. ♦ The event was organised by the India Foundation with the theme ‘building Brand Bharat'. ♦ Jaishankar said this last decade has seen a big shift and India is perceived as much easier to do business with now.  ♦ He added that Make In India has moved from being an aspiration to an assertion. ♦ He highlighted that the world truly stands up and takes notice when India talks about the magnitude of its socio economic schemes, or the volumes of digital transactions.

Current Affairs

The Assembly polls results in Jharkhand and Maharashtra

♦ The Assembly polls results in Jharkhand and Maharashtra were announced on 23 November 2024. The Bharatiya Janata Party (BJP)-led Mahayuti alliance secured a landslide victory in Maharashtra and the Jharkhand Mukti Morcha (JMM)-led INDIA bloc stormed back to power in Jharkhand.  ♦ In Maharashtra, the Mahayuti coalition of the BJP, Shiv Sena and Nationalist Congress Party won 234 of the 288 assembly seats, with the BJP securing 132 alone. The opposition Maha Vikas Aghadi (MVA) won 49 seats in the 288-member Assembly. ♦ The majority mark in Maharashtra is 145. Eknath Shinde led Shiv Sena has won 57, Ajit Pawar-led NCP has secured 41 in the elections. Congress has won 16, while NCP Sharad Pawar group has bagged 10, Shiv Sena (UBT) secured 20 seats and others have won 10 seats. ♦ In Jharkhand, the JMM and its allies secured 56 out of the total 81 assembly seats. The NDA was a distant second, winning 24 seats. Ruling JMM has been victorious in 34 seats, while Congress won 16 seats. RJD bagged four seats. BJP got 21 seats, Others have won six seats. 

Current Affairs

బినోద్‌ కుమార్‌

ఇండియన్‌ బ్యాంక్‌కు మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా బినోద్‌ కుమార్‌ను నియమించేందుకు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం కుమార్‌ పంజాబ్‌ నేషనల్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఉన్నారు. ఇండియన్‌ బ్యాంక్‌కు ఎండీ, సీఈఓగా ఉన్న ఎస్‌ ఎల్‌ జైన్‌ 2024, డిసెంబరులో పదవీ విరమణ చేయనున్నారు.  ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసుకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపితే.. జైన్‌ స్థానంలో బినోద్‌ కుమార్‌ ఇండియన్‌ బ్యాంక్‌కు ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపడతారు.  

Current Affairs

ఎఫ్‌-1 ఛాంప్‌ వెర్‌స్టాపెన్‌

రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వరుసగా నాలుగోసారి ఫార్ములావన్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. లాస్‌వేగాస్‌ గ్రాండ్‌ప్రిలో అయిదో స్థానంలో నిలిచిన ఈ బెల్జియం రేసర్‌.. ఈ ఛాంపియన్‌షిప్‌ నెగ్గడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో 13సార్లు పోడియంపై నిలిచిన వెర్‌స్టాపెన్‌ 8 రేసుల్లో విజేతగా నిలిచాడు. మొత్తంగా 403 పాయింట్లతో డ్రైవర్ల ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.  ఫార్ములావన్‌ చరిత్రలో వెర్‌స్టాపెన్‌ కనీసం నాలుగు ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లు గెలిచిన ఆరో డ్రైవర్‌. అతడు తొలిసారి 2021లో ఎఫ్‌-1 ఛాంపియన్‌షిప్‌ నెగ్గాడు. మరోవైపు లాస్‌వేగాస్‌ జీపీని రసెల్‌ (మెర్సిడెస్‌) గెలుచుకున్నాడు.

Current Affairs

ఐఎన్‌ఎస్‌ తరంగణి

భారత నౌకాదళంలోని తెరచాప శిక్షణ నౌక ఐఎన్‌ఎస్‌ తరంగణి.. ఇటలీ తెరచాప నౌక అమెరిగో వెస్‌పకీతో కలసి సాగరయానం చేసింది. కేరళలోని కొచ్చి తీరానికి చేరువలో ఈ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ సముద్రయాన సంప్రదాయాలు, భాగస్వామ్యాల పట్ల తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని భారతనౌకాదళం తెలిపింది. ఇరు దేశాల దళాల మధ్య శిక్షణ, సమన్వయం, మైత్రిని పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

Current Affairs

అమెరికా ఆర్థికమంత్రిగా స్కాట్‌ బెసెంట్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ అంతర్జాతీయ మదుపరి స్కాట్‌ బెసెంట్‌ను ఆర్థిక మంత్రిగా నామినేట్‌ చేశారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా, నవీకరణకు చిరునామాగా, అమెరికన్‌ డాలర్‌ను ప్రపంచానికి రిజర్వు కరెన్సీగా కొనసాగించడానికీ స్కాట్‌ కీలక పాత్ర పోషిస్తారని ట్రంప్‌ చెప్పారు. వ్యాధుల అదుపు, నివారణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్‌గా డాక్టర్‌ డేవ్‌ వెల్డన్‌నూ, ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌.డి.ఎ.) డైరెక్టర్‌గా మార్టీ మెకారీనీ నామినేట్‌ చేశారు. 

Current Affairs

గుల్వీర్‌కు స్వర్ణం

భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ హచియోజి లాంగ్‌ డిస్టెన్స్‌ మీట్‌లో స్వర్ణం నెగ్గాడు. 2024, నవంబరు 23న జపాన్‌లో జరిగిన 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్‌ 27 నిమిషాల 14.88 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (27 నిమిషాల 41.81 సెకన్లు)ను సవరించాడు.  2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, 10 వేల మీటర్లతో పాటు 5 వేల మీటర్లలోనూ జాతీయ రికార్డు కలిగి ఉన్నాడు.  జపాన్‌ వేదికగానే అతడు 2024 సెప్టెంబరులో 5 వేల మీటర్లలో జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సె) సృష్టించాడు. 

Current Affairs

రిత్విక్‌కు టైటిల్‌

హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ ఆటగాడు రిత్విక్‌ చౌదరి సిటా డి రొవెరెటో టెన్నిస్‌ టోర్నీలో శ్రీరామ్‌ బాలాజితో కలిసి ఛాంపియన్‌గా నిలిచాడు. 2024, నవంబరు 23న రొవెరెటో (ఇటలీ)లో జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ రిత్విక్‌- బాలాజి జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో రెండో సీడ్‌ థియో (ఫ్రాన్స్‌)- ఫ్రాన్సిస్కో (పోర్చుగల్‌)పై విజయం సాధించింది.  ఐటీఎఫ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ జే60 టోర్నీలో తెలంగాణ అమ్మాయి రిషిత రెడ్డి సింగిల్స్‌ టైటిల్‌తో మెరిసింది. నవంబరు 23న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 7-5, 6-4 తేడాతో ప్రియాంక రాణా (అమెరికా)ను ఓడించింది.