అత్యుత్తమ బ్యాంకుగా కరీంనగర్ డీసీసీబీ
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది. 2024, నవంబరు 26న దిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ వేదికపై కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌షా కేడీసీసీబీ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సీఈవో సత్యనారాయణరావుకు ఈ అవార్డు అందజేశారు. గతంలోనూ ఈ బ్యాంకు వివిధ రంగాలలో సేవలందించినందుకు ఎనిమిది అవార్డులు పొందింది.