బెల్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) జూనియర్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టులు: 12 వివరాలు: అర్హత: బీబీఏ/ బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 01-11-2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.21,500 - రూ.82,000. పని ప్రదేశాలు: గాజియాబాద్, పంచ్‌కుల, కోట్‌ద్వార్. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్లూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-12-2024. Website:https://bel-india.in/