Posts

Government Jobs

పంజాబ్ & సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా పీఎస్‌బీ శాఖల్లో లేటరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 213. వివరాలు: 1. ఆఫీసర్: 56 పోస్టులు 2. మేనేజర్: 117 పోస్టులు 3. సీనియర్ మేనేజర్: 33 పోస్టులు 4. చీఫ్ మేనేజర్: 07 పోస్టులు విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్‌భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్‌ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్‌క్యూఎల్‌ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైనవి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   పే స్కేల్: నెలకు ఆఫీసర్‌కు రూ.48,480- 85,920. మేనేజర్‌కు రూ.64,820- 93,960. సీనియర్ మేనేజర్‌కు రూ.85,920- 1,05,280. చీఫ్ మేనేజర్‌కు రూ.1,02300- 1,20940 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌ / ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు, దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 15-09-2024. Website:https://punjabandsindbank.co.in/content/recuitment Apply online:https://ibpsonline.ibps.in/psbsoaug24/

Government Jobs

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం ఖాళీలు: 819 (యూఆర్‌- 458, ఎస్సీ- 48, ఎస్టీ- 70, ఓబీసీ- 162, ఈడబ్ల్యూఎస్‌- 81) వివరాలు: పురుషులకు 697, మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి. అర్హత: మెట్రిక్యులేషన్/ 10వ తరగతితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.  శారీరక ప్రమాణాలు: పురుషులకు ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి. వయోపరిమితి (01-10-2024 నాటికి): 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.21,700 - రూ.69,100. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024. Website:https://itbpolice.nic.in/ Apply online:https://recruitment.itbpolice.nic.in/rect/registrations/applicant-signup

Government Jobs

టీకేడీఎల్‌యూలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన దిల్లీలోని సీఎస్ఐఆర్- ట్రెడిషనల్ నాలెడ్జ్‌ డిజిటల్ లైబ్రరీ యూనిట్‌ (సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు:  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 11 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 04 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 06 విభాగాలు: అగ్రికల్చర్‌, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్‌, సంస్కృతం, పేటెంట్స్‌ అగ్రికల్చర్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, పేటెంట్స్‌-మెటలర్జీ అండ్‌ మెటీరియల్ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌,  పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, యూజీసీ నెట్‌ స్కోర్ ఉండాలి.   జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టుకు రూ.31,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.35,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు: 20, 23, 25, 27, 30-09-2024. పరీక్ష కేంద్రం: సీఎస్‌ఐఆర్-టీకేడీఎల్ యూనిట్‌, 14, సత్సంగ్‌ విహార్‌ మార్గ్‌, కుతుబ్‌ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూ దిల్లీ. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 18-09-2024. Website:https://www.csir.res.in/

Government Jobs

బీఐఎస్‌లో గ్రూప్ ఏ, బీ, సీ పోస్టులు

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 345 వివ‌రాలు: గ్రూప్-ఎ పోస్టులు 1. అసిస్టెంట్ డైరెక్టర్: 03 గ్రూప్-బి పోస్టులు 2. పర్సనల్ అసిస్టెంట్: 27 3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 43 4. అసిస్టెంట్: 01 5. టెక్నికల్ అసిస్టెంట్: 27 గ్రూప్‌-సి పోస్టులు 6. స్టెనోగ్రాఫర్: 19 7. సీనియర్‌ సెక్రటేరియల్ అసిస్టెంట్: 128 8. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్: 78 9. సీనియర్ టెక్నిషీయన్: 18 10. టెక్నిషీయన్: 01 విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్ అండ్ కన్సుమర్ అఫైర్స్, హిందీ, మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పేంటర్, వెల్డర్, ఫిట్టర్, ఫ్లంబర్, ఎలక్ట్రిషీయన్, వైర్‌మ్యాన్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  ఎంపిక: ప్రాక్టికల్ అసెస్‌మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-09-2024. వెబ్‌సైట్:https://www.bis.gov.in/

Apprenticeship

డీఆర్‌డీఓ- ఐటీఆర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)కు చెందిన ఒడిశా రాష్ట్రం చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టులు: 54. వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 30 2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 విభాగాలు: మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎంబెడెడ్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్‌, సేఫ్టీ తదితరాలు.  అర్హత: ఖాళీలను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, బీబీఏ/బీకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9,000; డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్), చాందీపుర్, బాలాసోర్, ఒడిశా చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ: 07-10-2024. Website:https://www.drdo.gov.in/drdo/

Current Affairs

Suhas Yathiraj

Indian shuttler Suhas Yathiraj clinched the silver in the men’s singles badminton SL4 class at the Paris 2024 Paralympics on 2 September 2024. This is his second successive Paralympics silver medal. He won a medal at the Tokyo 2020 Paralympics.

Current Affairs

Bharath Sesha

♦ Bharath Sesha was appointed as Managing Director (MD) for Philips India on 2 September 2024. In this role, he will spearhead Philips’ growth strategy in India, with a strong focus on enhancing customer satisfaction and driving operational excellence. He succeeded Daniel Mazon, who has moved to a global role at the Philips headquarters in the Netherlands. ♦ Before joining Philips, Bharath Sesha was the MD at Heubach Colorants India.

Current Affairs

Sumit Antil

♦ Sumit Antil won the gold medal in the men’s javelin throw F64 class at Paris 2024 on 2 September 2024. He became the first Indian male para-athlete to defend his title in the Paralympics. He achieved the feat with a new Paralympic record of 70.59m at the Stade de France.  ♦ He also clinched the gold medal in Tokyo in 2020. Sumit also holds the world record of 73.29 in the F64 class.

Current Affairs

Indian Institute of Technology Delhi Abu Dhabi campus

♦ Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan officially inaugurated the Indian Institute of Technology Delhi Abu Dhabi campus on 2 September 2024. The inaugural batch of 52 students were welcomed, embarking on their undergraduate (UG) journeys in Computer Science and Engineering and Energy Engineering. Students for the UG programs were rigorously selected through the JEE Advanced exam and the newly introduced Combined Admission Entrance Test (CAET) designed specifically for international students. ♦ IIT Delhi Abu Dhabi had previously launched its first Masters of Technology (M.Tech) program in Energy Transition and Sustainability in January 2024. 

Current Affairs

Nitesh Kumar won a gold medal

♦ India’s badminton player, Nitesh Kumar won a gold medal at the Paris Paralympics on 2 September 2024. He defeated Daniel Bethell of Great Britain in the men's singles SL3 final.  ♦ This is India's second gold at the Paris Paralympics. Shooter Avani Lekhra had previously captured gold in the women’s 10m air rifle event. ♦ SL3 is a classification for players who have moderate mobility challenges on one side of their body, both legs or due to limb absence. ♦ This is India's third Paralympic medal in badminton. All of India's badminton medals at the Paralympics have been gold. In the 2020 Tokyo Games, Pramod Bhagat (SL3) and Krishna Nagar (SH6) clinched top podiums.