Posts

Current Affairs

Rohit Sharma

♦ India captain Rohit Sharma became the second fastest batter after Virat Kohli to complete 11,000 ODI runs. ♦ The achievement came during India’s Champions Trophy 2025 clash against Bangladesh. Rohit is now the fourth Indian and the 10th player overall to score 11,000 runs in ODIs.  ♦ Rohit reached this milestone in his 270th ODI match, making him the second fastest batter to do so in terms of innings played: ♦ Virat Kohli – 222 innings ♦ Rohit Sharma – 261 innings ♦ Sachin Tendulkar – 276 innings ♦ Ricky Ponting – 286 innings ♦ Sourav Ganguly – 288 innings

Current Affairs

Bengal Inter-Governmental Organisation (BOBP-IGO)

♦ India took over the chairmanship of Bay of Bengal Inter-Governmental Organisation (BOBP-IGO) at the 13th Governing Council Meeting at Malé, Maldives on 21 February 2025. ♦ The Indian delegation, led by Abhilaksh Likhi, Secretary, Department of Fisheries, Government of India, assumed the Chair during the event. ♦ The BOBP-IGO was set up in 2003, is a regional fisheries body, specifically mandated to assist the member countries in increasing the livelihood opportunities and improving the quality of life of the small-scale/ artisanal fisher folk in the Bay of Bengal region. ♦ The current members of the organisation are Bangladesh, India, Maldives and Sri Lanka while Indonesia, Malaysia, Myanmar and Thailand are cooperating non-contracting parties.

Current Affairs

గ్రామీణ సడక్‌ యోజన-4

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)-4 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. పీఎంజీఎస్‌వై-4 కింద దేశవ్యాప్తంగా రూ.70,125 కోట్లతో 62,500 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంచనా విలువలో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చనున్నాయి.

Current Affairs

స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌

ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఫిబ్రవరి 21న స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌ (సోల్‌) సదస్సును దిల్లీలో ప్రారంభించారు. దేశానికి ప్రతిరంగంలో ప్రపంచస్థాయి శక్తిసామర్థ్యాలున్న నాయకుల అవసరముందని ఆయన అన్నారు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచస్థాయి పరిష్కారం చూపగల సత్తా వారికి ఉండాలని సదస్సులో పేర్కొన్నారు. వర్ధమాన రంగాలైన డీప్‌టెక్, అంతరిక్షం, బయోటెక్, సంప్రదాయేతర ఇంధనం లాంటి రంగాలతో పాటు సంప్రదాయ రంగాలైన క్రీడలు, వ్యవసాయం, ఉత్పత్తి, సామాజిక సేవా రంగాల్లోనూ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరముందని చెప్పారు.

Current Affairs

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్‌ పటేల్‌

ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా భారత మూలాలున్న కాశ్‌ పటేల్‌ నియామితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్‌ల ఆధిక్యత ఉన్న సెనేట్‌లో ఆయనకు అనుకూలంగా 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితుడైన తొలి భారతీయ అమెరికన్‌గా కాశ్‌ పటేల్‌ నిలిచారు. ఆ పదవిలో ఆయన పదేళ్లు కొనసాగుతారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో జన్మించిన కాశ్‌ పటేల్‌ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి.

Current Affairs

విశ్వ రాజ్‌కుమార్‌

భారత విద్యార్థి విశ్వ రాజ్‌కుమార్‌ (20) ప్రపంచ మెమరీ లీగ్‌ ఛాంపియన్‌షిప్‌-2025 పోటీల్లో  విజేతగా నిలిచాడు. 80 ర్యాండమ్‌ నంబర్లను 13.50 సెకన్లలో,  30 చిత్రాలను 8.40 సెకన్లలో తప్పుల్లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఈ ఘనత సాధించాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో 5 వేల పాయింట్లతో రాజ్‌కుమార్‌ మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  రాజ్‌కుమార్‌ పుదుచ్చేరిలోని మనకులా వినాయగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్నాడు. 

Walkins

డీఆర్‌డీఓ మైసూర్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

మైసూరులోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బైయో-డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (డీఆర్‌డీఓ-డీఐబీటీ) వివిధ విభాగాల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 18 వివరాలు: విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బైయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్‌, ఫుడ్ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌, గేట్‌, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.   వయోపరిమితి: 20.03.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.37,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బైయో-డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (DRDO-DIBT) మైసూరు-570011  ఇంటర్వ్యూ తేదీ: 20 మార్చి 2025 Website:https://www.drdo.gov.in/drdo/careers

Walkins

డీఆర్‌డీఓ బెంగళూరులో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీఓ- ఎరోనాటికల్ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఓ-ఏడీఈ) వివిధ విభాగాల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 6 వివరాలు: విభాగాలు: ఎరోనాటికల్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.   వయోపరిమితి: 20.03.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.37,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఏడీఈ, డీఆర్‌డీఓ, రామన్‌ గేట్‌, సురంజనదాస్‌ రోడ్, న్యూ తిప్పసంద్ర పోస్ట్‌, బెంగళూరు-560075. ఇంటర్వ్యూ తేదీ: 19, 20 మార్చి 2025 Website:https://www.drdo.gov.in/drdo/careers

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రూట్స్‌) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 40 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(మెటలాజికల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 11-03-2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.16,338. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. పరీక్ష తేదీ: మార్చి 23. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11 మార్చి 2025 Website:https://www.rites.com/Career

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో రెసిడెంట్ ఇంజినీర్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెసిడెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 54 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(మెటలాజికల్, మెకానికల్ ఇంజినీరింగ్), డిప్లొమా(మెకానికల్, సివిల్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 11-03-2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.23,340. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11 మార్చి 2025 Website:https://www.rites.com/Career