సీడబ్ల్యూసీ నివేదిక
హిమాలయాల పరిధిలో ఉన్న సరస్సులు, ఇతర జల వనరుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయని కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) నివేదిక వెల్లడించింది. 2011తో పోలిస్తే 2024 సంవత్సరానికి 10.81 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. దీనికి వాతావరణ మార్పులే కారణమని.. హిమానీనద సరస్సులు ఉప్పొంగి భారీ ఆకస్మిక వరదలు రావడానికి ఈ పరిస్థితి హెచ్చరికలాంటిదని నివేదిక పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు: హిమానీనద సరస్సుల ఉపరితల వైశాల్యం 2011లో 1,962 హెక్టార్లు ఉండగా, ప్రస్తుతం 2,623 హెక్టార్లకు పెరిగింది. మొత్తం 67 సరస్సులు భారీ వరదలను కలిగించే స్థాయిలో నీటిమట్టాలను కలిగి ఉన్నాయి. లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది.