Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

డ్రోగ్‌ పారాచూట్‌ విజయవంతం

మానవసహిత అంతరిక్ష యాత్ర- గగన్‌యాన్‌ కోసం ‘రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ’ (డీఆర్‌డీవో) అత్యంత బలీయమైన రిబ్బన్‌ పారాచూట్‌లను తయారు చేసింది. దీని పరీక్షను చండీగఢ్‌లోని ‘టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ పరిశోధన ప్రయోగశాల’ (టీబీఆర్‌ఎల్‌)లో విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణమంత్రిత్వ శాఖ 2026, ఫిబవ్రరి 19న వెల్లడించింది. డ్రోగ్‌ పారాచూట్‌ ఎంత భారాన్ని తట్టుకుంటుందనే పరీక్షను పూర్తిచేయడం ముఖ్యమైన పరిణామమని పేర్కొంది.

Current Affairs

పెరూ అధ్యక్షుడిగా జోస్‌ మారియా బల్కజార్‌

పెరూ దేశ అధ్యక్షుడిగా 2026, ఫిబ్రవరి 19 మాజీ న్యాయమూర్తి జోస్‌ మారియా బల్కజార్‌(83) ఎన్నికయ్యారు. 10 ఏళ్లలో ఈయన 8వ అధ్యక్షుడు. అవినీతి ఆరోపణల కారణంగా తాత్కాలిక అధ్యక్షుడు జోస్‌ జెరీని తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది. వామపక్ష పెరూ లిబ్రె పార్టీ తరఫున పోటీ చేసిన బల్కాజార్, 130 మంది సభ్యులున్న చట్టసభలో ముగ్గురు ఇతర అభ్యర్థులను ఓడించి విజేతగా నిలిచారు.

Current Affairs

రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్‌ కమిషన్‌ నియమిస్తూ కూటమి ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా(ఏకసభ్య కమిషన్‌) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా గతంలో ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్దేశిత సమయంలో పకడ్బందీగా పూర్తి చేశారు.

Current Affairs

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ)కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విశాఖ తీరానికి వచ్చింది. మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పగలూ, రాత్రి విన్యాసాలు చేయడం దీని ప్రత్యేకత. గంటకు 28 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకేసారి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. చేతక్‌ హెలికాప్టర్లతో విన్యాసాలు చేయాల్సి వస్తే యుద్ధవిమానాల సంఖ్య తగ్గిస్తారు. విమానాలతో చేయాల్సి వస్తే హెలికాప్టర్ల సంఖ్య తగ్గుతుంది. రన్‌వేపై పది మిగ్‌ విమానాలను ఒకేసారి నిలపొచ్చు. అత్యంత వేగంగా వచ్చే జెట్‌ విమానాలు రన్‌ వేపై నిర్ణీత స్థానంలో నిలిచే వ్యవస్థ దీనిపై ఉంది. మిగ్‌ 29కే, లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్, చేతక్, ధ్రువ్, కమోవ్, సీకింగ్‌ హెలికాప్టర్లు దీనిపై  విన్యాసాలు సాగిస్తాయి. నౌక కింది నుంచి ఫ్లైట్‌ ల్యాండింగ్‌ అయ్యేవరకు పది డెక్‌లు ఉండగా, ఆ పైన 8 ఉంటాయి. దీని రన్‌వే రెండు చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియాలను కలిపినంత విస్తీర్ణంలో ఉంటుంది. 

Current Affairs

మిలన్‌-2026

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్‌-2026’ను ప్రారంభించారు. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్‌ ప్రయత్నిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.  2026లో 74 దేశాల భాగస్వామ్యంతో సాగిన మిలన్‌ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. 

Current Affairs

ఇండియా ఇంపాక్ట్‌ సమిట్‌

ఇండియా ఇంపాక్ట్‌ సమిట్‌ను 2026, ఫిబ్రవరి 19న దిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి ‘మానవ్‌’ (ఎంఏఎన్‌ఏవీ) విజన్‌ను ఆవిష్కరించారు. ఎం: నైతికత, విలువల వ్యవస్థ (మోరల్‌ అండ్‌ ఎథికల్‌ సిస్టమ్స్‌); ఎ: జవాబుదారీ పాలన (ఎకౌంటబుల్‌ గవర్నెన్స్‌), ఎన్‌: జాతీయ సార్వభౌమత్వం (నేషనల్‌ సావర్నిటీ); ఏ: అందుబాటు, సమ్మిళితం (యాక్సెసబుల్, ఇంక్లూజివ్‌); వీ: చెల్లుబాటు, చట్టబద్ధత (వ్యాలీడ్, లెజిటమేట్‌).   

Walkins

ఈఎస్ఐసీ నోయిడాలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ నోయిడా (ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాల  భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 18 వివరాలు: 1. ప్రొఫెసర్ : 08  2. అసోసియేట్ ప్రొఫెసర్ : 10  విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ & మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,22,543. అసోసియేట్ ప్రొఫెసర్ కు  రూ.1,47,986. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2026, ఫిబ్రవరి 25, వేదిక: కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సెక్టార్-24, నోయిడా. Website:https://esic.gov.in/recruitments

Walkins

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: టెక్నికల్ ఆఫీసర్: 200  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.25,000. - రూ.31,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 24. వేదిక: కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (సీఎల్‌డీసీ), నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్‌, హైదరాబాద్ - 500062. Website:https://www.ecil.co.in/jobopenings

Government Jobs

బీఈసీఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌), భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయంలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని కోరుతోంది. మొత్తం పోస్టులు: 10 వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ అర్హతలు: అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఎంఎస్-ఎక్సల్‌లో ప్రావీణ్యం ఉండాలి. టైపింగ్ వేగం: ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి కనీసం 35 పదాల వేగం ఉండాలి. వేతనం: నెలకు రూ.24,000 (స్థిర వేతనం) చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2026. Website:https://www.becil.com/Vacancies

Walkins

Technical Officer Posts in ECIL Hyderabad

Electronics Corporation of India Limited (ECIL), Hyderabad is conducting interviews for the Technical Officer posts in various departments on contractual basis.  Details: Technical Officer: 200 Eligibility: Must have passed BE/BTech in the relevant department with at least 60% marks as per the posts and should have work experience. Maximum Age Limit: Not more than 30 years. There is an age relaxation of 3 years for OBC candidates, 5 years for SC/ST candidates and 10 years for PWD candidates. Salary: Rs.25,000 per month. - Rs.31,000. Selection Process: Based on Interview. Interview Date: 24th February 2026. Venue: Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, ECIL, Hyderabad - 500062. Website:https://www.ecil.co.in/jobopenings