Posts

Current Affairs

2023-24 యూడైస్‌ నివేదిక

ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్‌) గణాంకాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఒక్క విద్యార్థీ లేని అత్యధిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్న రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ (3,254), రాజస్థాన్‌ (2,187), తెలంగాణ (2,097) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు నివేదిక తెలిపింది.  తెలంగాణలోని 2,097 ‘జీరో పాఠశాలల్లో’ 2 వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాకపోతే విద్యాశాఖ వారిని సమీప బడుల్లో డిప్యుటేషన్‌పై నియమిస్తుంది. అంతకుముందు సంవత్సరం (2022-23)లో తెలంగాణలో విద్యార్థులు లేని బడుల సంఖ్య 1,672.

Current Affairs

భారత్‌లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు

భారతదేశంలో భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాలు 2020లో అంతకు పూర్వం సంవత్సరంతో పోలిస్తే 7.93 శాతం మేరకు తగ్గాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు విభాగానికి సమర్పించిన ఒక నివేదికలో భారత్‌ తెలిపింది. అలాంటి ఉద్గారాలు 2005-2020 మధ్యకాలంలో స్థూలంగా 36 శాతం పడిపోయాయని అందులో వివరించింది.  2019తో పోలిస్తే ఉద్గారాలు 7.93 శాతం తగ్గినా, 1994 నుంచి చూస్తే 98.34 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది. వర్ధమాన దేశాలు రెండేళ్లకోసారి ఈ నివేదికను ఐరాస విభాగానికి సమర్పించాల్సి ఉంది. 

Current Affairs

2024 అత్యంత వేడి సంవత్సరం

భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైందని ఐఎండీ వివరించింది. ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 బద్దలుకొట్టింది.

Current Affairs

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు క్యాబినెట్‌ అంగీకరించింది. 2024, జనవరి 1న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సర మధ్యకాలానికి కేటాయింపును రూ.69,515.71 కోట్లకు పెంచింది. ఇదివరకు 2020-21 నుంచి 24-25 మధ్య కాలానికి రూ.66,550 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుచేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది.

Government Jobs

VArious Posts In IIT Gandhinagar

The Indian Institute of Technology Gandhinagar (IITGN) invites online applications for the following posts on a direct or deputation basis. Details: Librarian: 1 post Superintending Engineer: 1 post Eligibility: Librarian: Candidates must hold a Ph.D. in Library Science/Information Science or a Master's degree in the same field with at least 55% marks. They should have 10 years of experience as Deputy Librarian. Superintending Engineer: Requires a BE/B.Tech degree with 12 years of experience, including 7 years as Executive Engineer. Age limit: Librarian: Up to 57 years as of the last date of application. Superintending Engineer: Up to 50 years as of the last date of application. Salary: Librarian: Rs.1,44,200 - Rs.2,18,200; For Superintending Engineer Rs.1,23,100 - Rs.2,15,900. Last date for online application: 30 January 2025. Website: https://iitgn.ac.in/careers

Government Jobs

Assistant Manager Posis In RailTel Corporation of India Limited

RailTel Corporation of India Limited, New Delhi invites applications for technical positions, including backlog vacancies for SC/ST/OBC candidates.  No. of Posts: 12 Details: 1. Assistant Manager (Technical): 9 Posts 2. Deputy Manager (Technical): 3 Posts Eligibility:  Assistant Manager (Technical): Diploma in Electronics or equivalent with 5 years’ relevant experience in areas like Optical Fibre Cable operations, telecom/data network maintenance.  Deputy Manager (Technical): B.E./B.Tech./MCA or equivalent in relevant fields with 2 years’ experience in similar domains. Age limit: Assistant Manager: 21 to 28 years. Deputy Manager: 21 to 30 years. Salary Range: Assistant Manager: Rs.30,000 - Rs.1,20,000/month. Deputy Manager: RS.40,000 - Rs.1,40,000/month. Application Fee: Application fee is ₹1200 (₹600 for SC/ST/PwBD candidates, refundable upon exam participation). Selection Process: Online examination and interview. Exam Pattern: Professional knowledge (100 marks) and general aptitude (50 marks). Examination Centers: Mumbai, Kolkata, Delhi/NCR, Hyderabad/Secunderabad. Service Agreement: A commitment of three years is mandatory. Closing Date for Online Applications: 27 January 2025  Website:https://www.railtel.in/

Government Jobs

Mental Health Counsellor Posts In EdCIL

Educational Consultants India Limited (EdCIL), Uttar Pradesh, Noida invites online applications for Career and Mental Health Counsellor positions. These roles are contractual and spread across 26 districts in Andhra Pradesh. No. of Posts: 255 Details: Eligibility:  Candidates must hold an M.Sc. in Psychology, MA in Psychology, or a Bachelor's in Psychology (compulsory). A Diploma in Career Guidance and Counselling is desirable. Additionally, applicants should have a minimum of 2.5 years of counselling experience in relevant fields. Age: 40 years, calculated as of December 31, 2024. Salary: Consolidated monthly remuneration of Rs.30,000. Online Application Last Date: 10 January 2025 Website:https://www.edcilindia.co.in/ Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4OkPgHR_vLxd6n8RCXRd-Ef5_y5Tpiu4ff8fSd28Y795RLw/viewform?pli=1

Government Jobs

రైల్‌టెల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూదిల్లీ ఎస్సీ/ ఎస్టీ/ ఒబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా సాంకేతిక ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు: 12 వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): 9 పోస్టులు 2. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): 3 పోస్టులు అర్హతలు: అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్ నిర్వహణ తత్సమాన విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): సంబంధిత రంగాలలో బీఈ/బీటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హత. వయసు:  అసిస్టెంట్ మేనేజర్: 21 - 28 సంవత్సరాలు. డిప్యూటీ మేనేజర్: 21 - 30 సంవత్సరాలు. జీతం:  అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ.30,000 - రూ.1,20,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000. దరఖాస్తు రుసుము: రూ.1200 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600, పరీక్షలో పాల్గొన్న తర్వాత తిరిగి చెల్లించబడుతుంది). ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్షా విధానం: ప్రొఫెషనల్ నాలెడ్జ్ (100 మార్కులు), జనరల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు). పరీక్షా కేంద్రాలు: ముంబయి, కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్/సికింద్రాబాద్. పని ప్రదేశం: హైదరాబాద్/సికింద్రాబాద్. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27 జనవరి 2025. Website:https://www.railtel.in/

Government Jobs

ఐఐటీ గాంధీనగర్‌లో పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ (ఐఐటీజీఎన్‌) డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: లైబ్రేరియన్: 1 పోస్టు సూపరింటెండింగ్ ఇంజినీర్: 1 పోస్టు అర్హత:  లైబ్రేరియన్: అభ్యర్థులు తప్పనిసరిగా పీహెచ్‌డీ కలిగి ఉండాలి. లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో లేదా కనీసం 55% మార్కులతో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ. వీరికి డిప్యూటీ లైబ్రేరియన్‌గా 10 ఏళ్ల అనుభవం ఉండాలి. సూపరింటెండింగ్ ఇంజినీర్: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా 7 సంవత్సరాలతో సహా 12 సంవత్సరాల అనుభవంతో బీఈ/బీటెక్‌ డిగ్రీ ఉండాలి. వయస్సు: లైబ్రేరియన్: దరఖాస్తు చివరి తేదీ నాటికి 57 ఏళ్లు; సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు 50 ఏళ్లు మించకూడదు. జీతం: లైబ్రేరియన్: రూ.1,44,200 - రూ.2,18,200; సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు రూ.1,23,100 - రూ.2,15,900. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-01-2025. Website:https://iitgn.ac.in/careers

Government Jobs

ఎడ్‌సిల్‌లో మెంటల్ హెల్త్ కౌన్సెలర్స్ పోస్టులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎడ్‌సిల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టుల  భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 255 వివరాలు:  అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీలో ఎంఎస్సీ, ఎంఏ, బ్యాచిలర్స్ డిగ్రీ. కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. అదనంగా, దరఖాస్తుదారులు సంబంధిత రంగాలలో కనీసం 2.5 సంవత్సరాల కౌన్సెలింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయసు:  గరిష్ట వయోపరిమితి డిసెంబర్ 31, 2024 నాటికి 40 సంవత్సరాలు. జీతం: నెలకు రూ.30,000. ఆన్‌లైన్‌  దరఖాస్తులకు చివరి తేదీ: 10 జనవరి  2025. Website:https://www.edcilindia.co.in/ Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4OkPgHR_vLxd6n8RCXRd-Ef5_y5Tpiu4ff8fSd28Y795RLw/viewform?pli=1