అల్వార్ ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు
రాజస్థాన్ రాష్ట్రం అల్వార్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 104 వివరాలు: 1. ప్రొఫెసర్: 08 పోస్టులు 2. అసోసియేట్ ప్రొఫెసర్: 21 పోస్టులు 3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 25 పోస్టులు 4. సీనియర్ రెసిడెంట్: 34 పోస్టులు 5. సీనియర్ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ: 16 పోస్టులు విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు; సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు 67 ఏళ్లు; ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.225; ఎస్సీ/ ఎస్టీ / మహిళ / ఎక్స్-సర్వీస్‌మెన్ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దేసులా, అల్వార్, రాజస్థాన్. ఇంటర్వ్యూ తేదీ: 21-10-2024. Website:https://mcalwar.esic.gov.in/