పదేళ్ల కాలంలో 36 శాతం ఉద్యోగాల పెరుగుదల
2014-24 వరకు పదేళ్ల కాలంలో భారతదేశంలో ఉద్యోగాలు 36 శాతం పెరిగాయని కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయ 2025 జనవరి 2న వెల్లడించారు. 2014-15లో దేశంలో 47.15 కోట్ల ఉద్యోగాలు ఉండగా, 2023-24 నాటికి అవి 64.33 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. 2014-24 కాలంలో 17.19 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని మాండవీయ వెల్లడించారు. ఒక్క 2023-24లోనే 4.6 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపారు. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023-24లో 3.2 శాతానికి తగ్గిందని వివరించారు.