కేంద్ర క్రీడల శాఖ 2024 ఏడాదికి క్రీడా అవార్డులను జనవరి 2న ప్రకటించింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, అర్జున (లైఫ్‌టైమ్), ద్రోణాచార్య, ద్రోణాచార్య (లైఫ్‌టైమ్) ఇందులో ఉన్నాయి.
అవార్డు విజేతలు
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్‌కుమార్ (పారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)
అర్జున: యర్రాజి జ్యోతి, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, సావీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ (హాకీ), రాకేశ్‌కుమార్ (పారా ఆర్చరీ), జీవాంజి దీప్తి, ప్రీతి పాల్, అజీత్‌సింగ్, సచిన్ సార్జేరావ్ ఖిలారి, ధరమ్‌బీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సేమా, సిమ్రన్, నవదీప్ (పారా అథ్లెటిక్స్), నితేశ్‌కుమార్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ సుమతి శివన్, మనీషా రాందాస్ (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్), స్వప్నిల్ సురేశ్ కుశాలె, శరబ్‌జ్యోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సాజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్)
అర్జున (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారాం పేట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య: సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ)
ద్రోణాచార్య (లైఫ్‌టైమ్): ఎస్.మురళీధరన్ (బ్యాడ్మింటన్), ఆర్మాండో ఏంజెలో కొలాకో (ఫుట్‌బాల్)