Posts

Current Affairs

International Football Federation (FIFA)

♦ International Football Federation (FIFA) has announced that Saudi Arabia will host the 2034 Men’s Football World Cup. ♦ While Spain, Portugal, and Morocco will jointly host the 2030 tournament. The host nations for both World Cups were confirmed at FIFA’s Extraordinary Congress meeting  on 11 December 2024. ♦ The meeting, conducted via video link, was attended by representatives from all 211 FIFA member nations.  ♦ To mark the 100th anniversary of the World Cup, three matches in the 2030 tournament will also be held in Argentina, Paraguay, and Uruguay. ♦ This will be the first time Saudi Arabia hosts the World Cup, and the second time the tournament will be held in the Middle East.

Current Affairs

Sanjay Malhotra

♦ Sanjay Malhotra took charge as the 26th Governor of the Reserve Bank of India on 11 December 2024 for a three-year term. ♦ He replaced Shaktikanta Das, whose tenure ended on December 10. Sanjay is a 1990-batch IAS officer of the Rajasthan cadre. He is a former Revenue Secretary. ♦ He had earlier worked as the Chairman and Managing Director of state-run Rural Electrification Corporation (REC) Limited.

Current Affairs

Asian Development Bank (ADB)

♦ The Asian Development Bank (ADB) lowered its India growth forecast for the current financial year (FY25) to 6.5 percent from 7 percent earlier. It also revised downwards its forecast for FY26 to 7 percent from 7.2 percent earlier. ♦ As a result, the growth forecasts for South Asia have also been revised downwards to 5.9 per cent for 2024 and 6.3 per cent for 2025.

Current Affairs

National Panchayat Awards 2024

♦ The President of India, Droupadi Murmu conferred the National Panchayat Awards 2024 at Vigyan Bhavan in New Delhi on 11 December 2024. ♦ A total of 45 Panchayats from diverse regions were honoured in recognition of their exemplary work in rural development.   ♦ The primary objective of these awards was to promote and acknowledge the contributions of Panchayats in the socio-economic development of rural India, and to motivate other Panchayats to adopt best practices for inclusive growth and sustainable development. National Panchayat Awards 2024 List:

Current Affairs

జీడీపీ వృద్ధి 6.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. ఇంతకు ముందు వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని ఏడీబీ అంచనా వేయగా, ప్రస్తుతం కోత విధించింది. ప్రైవేట్‌ పెట్టుబడులు, ఇళ్ల గిరాకీ అంచనా కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) వృద్ధి అంచనాలను కూడా 7.2% నుంచి 7 శాతానికి సంస్థ సవరించింది.  2024లో ఆసియా, పసిఫిక్‌ దేశాల వృద్ధి 4.9% ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2024, సెప్టెంబరు అంచనాలో ఇది 5 శాతంగా ఉంది. 

Current Affairs

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా 2024, డిసెంబరు 11న బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్, ఎం. రాజేశ్వర్‌ రావు, టి.రవి శంకర్‌ సమక్షంలో మల్హోత్రా బాధ్యతల స్వీకారం నిమిత్తం పత్రాలపై సంతకాలు చేశారు. సంజయ్‌ ఇప్పటిదాకా రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు.

Current Affairs

భారత్, చైనా, అమెరికాల్లో 60% పర్యాటక ఉద్గారాలు

ప్రపంచవ్యాప్తంగా 60 శాతం పర్యాటక ఉద్గారాల పెంపుదలకు భారత్, చైనా, అమెరికా దేశాలు కారణమవుతున్నాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 2009 నుంచి 2019 మధ్య పదేళ్ల కాలవ్యవధితో జరిపిన ఈ అధ్యయనం అత్యధిక జనాభా, రవాణాపరంగా ఎక్కువ డిమాండు ఉన్న దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.  గత దశాబ్దకాలంలో చైనా దేశీయ పర్యాటక వ్యయం ఏడాదికి 17 శాతం చొప్పున పెరిగింది. తద్వారా ప్రపంచ ఉద్గారాలను 0.4 గిగా టన్నుల మేర చైనా పెంచింది. అమెరికా దేశీయ పర్యాటకం 0.2 గిగా టన్నులు, భారత్‌ 0.1 గిగా టన్నుల మేర ప్రపంచ ఉద్గారాలను పెంచినట్లు అధ్యయనం వెల్లడించింది. 

Current Affairs

‘ఇండియా ఇన్‌ ఫ్యూచర్‌టెన్స్‌’

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తవనున్న నేపథ్యంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఫౌండేషన్, కౌన్సిల్‌ ఆఫ్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) సంయుక్తంగా రూపొందిస్తున్న నిఘంటువుకు 47 పదాలను గుర్తించారు. ‘ఇండియా ఇన్‌ ఫ్యూచర్‌ టెన్స్‌: 47 వర్డ్స్‌ ఫర్‌ 2047’ పేరుతో రూపొందిస్తున్న నిఘంటువులో బ్లూకార్బన్, కల్చర్నామిక్స్, డిజిటల్‌ నోమడ్, 15 మినిట్‌ సిటీ, ఫ్లాక్స్‌ వంటి 47 పదాలు చోటు దక్కించుకున్నాయి. భారతావనికి స్వేచ్ఛ లభించి వందేళ్లు పూర్తయ్యే సమయానికి ఎలాంటి పోకడలు ఉంటాయి, దేశ ప్రయాణాన్ని నిర్వచించే విలువలు వంటి అంశాలను ఈ నిఘంటువు గుర్తిస్తుంది. 

Current Affairs

సౌదీలో 2034 ఫిఫా ప్రపంచకప్‌

2034 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతుంది. ఈ విషయాన్ని ఫిఫా 2024, డిసెంబరు 11న అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ప్రపంచకప్‌ నిర్వహణ కోసం 15 నెలల పాటు సాగిన బిడ్‌ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి ప్రదర్శించింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్‌ఫాంటినో అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆతిథ్య హక్కులను సౌదీకి కట్టబెట్టారు.  అలాగే 2030 ప్రపంచకప్‌ను ఆరు దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువ మ్యాచ్‌లు జరుగనుండగా.. అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్కో మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తాయి. 

Current Affairs

టీఓఏ అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 2024, డిసెంబరు 11న ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో జరిగిన ఓట్ల లెక్కింపులో జితేందర్‌రెడ్డి 34 ఓట్ల ఆధిక్యంతో చాముండేశ్వరినాథ్‌పై విజయం సాధించారు. జితేందర్‌రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు పోలయ్యాయి. కార్యదర్శిగా మల్లారెడ్డి, కోశాధికారిగా సతీశ్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు.