Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Pax Silica declaration

♦ India and the United States have signed the Pax Silica declaration at the India AI Impact Summit in New Delhi on 20 February 2026. This declaration will strengthen collaboration in areas like the production of critical minerals and semiconductors and in the rapidly evolving Artificial Intelligence space, to create a safe and strong global silicon and technology ecosystem. ♦ Presiding over the signing ceremony, Union Minister for Electronics and Information Technology Ashwini Vaishnaw has said that the goal of India is to take a leadership role in Semiconductor and Electronics industries. He added that the Semiconductor Industry requires more than 10 lakh talented pool and that will be fulfilled within the country.  He also informed that students from 315 Universities and colleges are designing chips.   ♦ At the signing ceremony US Ambassador to India Sergio Gor said that ‘Pax Silica’ aims to replace coercive dependencies with trusted industrial partnerships that empower free markets. He underlined that that the partnership seeks to advance trusted AI globally, emphasising that peace comes through strength.

Current Affairs

Piyush Goyal

♦ Commerce and Industry Minister Piyush Goyal launched seven additional interventions under the Export Promotion Mission, a flagship initiative of the Centre aimed at empowering micro, small, and medium enterprises (MSMEs) for competing in global markets on 20 February 2026. These interventions are designed to address key challenges faced by Indian exporters, promote broad-based and inclusive export growth, and strengthen India’s position as a globally competitive export powerhouse. ♦ Emphasising that the benefits of global trade must reach every MSME, startup, and entrepreneur, Goyal said the Export Promotion Mission is aimed at promoting new products, services and exporters, while enabling Indian businesses to access new markets. ♦ He stated that the Mission seeks to simplify processes for MSMEs, strengthen access to credit, enhance quality standards, support compliance with international regulations and expand logistics and warehousing infrastructure globally. Initiatives such as overseas warehousing, including Bharat Mart in Dubai, are intended to provide Indian exporters with strategic access to markets across the GCC, Africa, Central Asia, and Europe.

Current Affairs

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ఏ దేశ సమాజంలోనైనా వ్యక్తులు, అన్ని వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు లాంటి అనేక అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి సాంఘిక ప్రగతి సాధించాలంటే సామాజిక న్యాయం అవసరం. సర్వజన సమానత్వం, మానవ హక్కుల రక్షణ, పేదరిక నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. సామాజిక, ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పౌరులందరికీ సమాన అవకాశాలు, వనరులు అందాలనే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా (World Day of Social Justice) నిర్వహిస్తారు. సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1995 మార్చి 6-12 తేదీల్లో డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్‌లో సామాజిక అభివృద్ధి సదస్సను నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన వందకు పైగా నాయకులు ఇందులో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ ఉపాధి, స్థిరమైన - న్యాయపరమైన - సురక్షితమైన సమాజాలను సృష్టించడానికి చర్యలు తీసుకోవాలని అందులో తీర్మానించారు. ఈ సదస్సు ఫలితంగా కోపెన్‌హగన్‌ ప్రకటన, కార్యాచరణ కార్యక్రమం రూపుదిద్దుకున్నాయి.  సమ సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరపాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2007లో అధికారికంగా ప్రకటించింది. 2009 నుంచి ఏటా దీన్ని నిర్వహించాలని తీర్మానించింది. 

Current Affairs

ఐవోఎన్‌ఎస్‌ సమావేశం

సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల్లో ఉపశమన చర్యలు, పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ మహాసముద్ర నావల్‌ సింపోజియం (ఐవోఎన్‌ఎస్‌) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఐఎఫ్‌ఆర్, మిలాన్, సింపోజియం పేరిట నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో భాగంగా 2026, ఫిబ్రవరి 20న తొమ్మిదో ఐవోఎన్‌ఎస్‌ సమావేశం జరిగింది. దీనికి హిందూ మహాసముద్ర తీర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 దేశాల నావికాదళ అధిపతులు, సముద్ర భద్రతా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఈ సింపోజియానికి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టింది. రాయల్‌ నేవీ నుంచి ఐవోఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవిని భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌కుమార్‌ త్రిపాఠి స్వీకరించారు. 16 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ భారత్‌కు ఐవోఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవి దక్కింది. 

Current Affairs

సహ్‌యోగ్‌

ఆన్‌లైన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహ్‌యోగ్‌ అస్త్రం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సైబర్‌ నేరాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ తరఫున నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఐ4సీ ఈ పోర్టల్‌ను రూపొందించింది. 2024 అక్టోబరులో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్‌ మొదటి సంవత్సరంలో 19 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం సంస్థలకు 2,312 బ్లాకింగ్‌ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో చాలావరకు చట్టవ్యతిరేక పోస్టులు, లింకులు, ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ, నకిలీ సామాజిక మాధ్యమ ప్రొఫైళ్లు, ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లు, నకిలీ యాప్‌లు తదితరాలకు సంబంధించినవి ఉన్నాయి. 

Current Affairs

ప్యాక్స్‌ సిలికా కూటమిలో భారత్‌

అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్‌ సిలికా’లో భాగస్వామిగా భారత్‌ 2026, ఫిబ్రవరి 20న చేరింది. దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ విషయాల్లో ఒక దేశ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి ఈ కూటమి ఏర్పడినట్టు హెల్‌బర్గ్‌ పేర్కొన్నారు.

Internship

కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ (కేజీఆర్‌) కస్టమర్‌ సపోర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌  పోస్టు పేరు: కస్టమర్‌ సపోర్ట్‌  నైపుణ్యాలు: డిజిటల్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లొ నైపుణ్యం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.9,000- రూ.10,000.  వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 13-03-2026. Website:https://internshala.com/internship/detail/customer-service-customer-support-internship-in-hyderabad-at-kgr-software-technologies1770785654

Government Jobs

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

దిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 22 వివరాలు: 1. అసిస్టెంట్ ఎడిటర్ : 05  2. అసిస్టెంట్ డైరెక్టర్  : 01  3. సీనియర్ కోర్టు అసిస్టెంట్ : 02  4. అసిస్టెంట్ లైబ్రేరియన్ : 14  అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/పీజీ(లా/మ్యూజియాలజీ/లైబ్రరీ సైన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్ ఎడిటర్‌కు రూ.78,800. అసిస్టెంట్ డైరెక్టర్ కు రూ.67,700. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ & అసిస్టెంట్ లైబ్రేరియన్ కు రూ.47,600. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.15,00.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026, పిబ్రవరి 23, దరఖాస్తు చివరి తేదీ: 08.03.2026. Website:https://www.sci.gov.in/recruitments/

Government Jobs

ఎన్‌సీడీసీ దిల్లీలో స్పెషలిస్ట్ గ్రేడ్-III ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్-III (పబ్లిక్ హెల్త్) ఉద్యోగాల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు:  స్పెషలిస్ట్ గ్రేడ్-III (పబ్లిక్ హెల్త్) - 14 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.1,23,500. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. చిరునామా: జనరల్ సర్వీసెస్ సెక్షన్, రూమ్ నెం. 202, ఎన్‌డీసీ, 22- శ్యామ్ నాథ్ మార్గ్, దిల్లీ - 110054. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 6. Website:https://ncdc.mohfw.gov.in/vacancies/

Apprenticeship

వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్‌ రైల్వే 2025-26 సంవత్సరానికి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  అప్రెంటిస్: 5,349 పోస్టులు వివరాలు: ట్రేడ్‌ల వారీగా ఖాళీలు:  ఫిట్టర్- 1614 ఎలక్ట్రీషియన్- 1217 వెల్డర్- 532 పీఏఎస్‌ఏఏ- 280 ఎలక్ట్రానిక్ మెకానిక్- 236 మెకానిక్ (డీజిల్)- 207 పెయింటర్- 190 కార్పెంటర్- 184 రిఫ్రిజిరేటర్ (AC-మెకానిక్)- 184 పైప్ ఫిట్టర్- 176 ప్లంబర్- 136 వైర్‌మ్యాన్- 126 డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 87 టర్నర్- 75 స్టెనోగ్రాఫర్- 40 మెషినిస్ట్ (గ్రైండర్)- 25 ఫోర్జర్ & హీట్ ట్రీటర్- 16 మెషినిస్ట్- 14 మెకానిక్ మోటార్ వెహికల్- 10 అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 23-03-2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. శిక్షణ కాలం: ఒక సంవత్సరం.  ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21/02/2026. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23/03/2026. Website:https://www.rrc-wr.com/