Posts

Current Affairs

ఐడబ్ల్యూఎఫ్‌ నిర్ణయాలు

బరువు విభాగాలను తగ్గించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది. పురుషులు, మహిళల్లో గతంలో ఉండే 10 విభాగాలను 2025 జూన్‌ నుంచి 8 విభాగాలకు తగ్గించబోతున్నారు. అలాగే బరువు విభాగాల్లోనూ మార్పులు చేశారు. తమ ఆవిష్కరణ కమిషన్‌ ప్రతిపాదన మేరకు ఐడబ్ల్యూఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  ఇదివరకు పురుషుల్లో 55, 61, 67, 73, 81, 89, 96, 102, 109, +109 కేజీల బరువు విభాగాలుండేవి. 2025 నుంచి 60, 65, 71, 79, 88, 98, 110, +110 కేజీల విభాగాలను ప్రవేశపెట్టనున్నారు. మహిళల్లో 45, 49, 55, 59, 64, 71, 76, 81, 87, +87 కేజీలకు బదులుగా 48, 53, 58, 63, 69, 77, 86, +86 కేజీల విభాగాలను తీసుకురానున్నారు. 

Current Affairs

ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మి సిల్వా

శ్రీలంకకు చెందిన షమ్మి సిల్వా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా 2024, డిసెంబరు 6న బాధ్యతలు స్వీకరించాడు. జై షా ఐసీసీ ఛైర్మన్‌ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది.

Current Affairs

దియాకి డయానా అవార్డు

హైదరాబాద్‌కి చెందిన దియా లోకా (17) ప్రఖ్యాత డయానా అవార్డుకు ఎంపికైంది. దేేశవ్యాప్తంగా నగరాల్లో పెరుగుతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌పై ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనకు ఈ పురస్కారం దక్కినట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం దియా చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్లస్‌ 2 చదువుతోంది. బ్రిటన్‌ యువరాణి డయానా జ్ఞాపకార్థం ‘దూరదృష్టి, సామాజిక ప్రభావం, ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం, యువ నాయకత్వం, సేవ’ అనే 5 అంశాల్లో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. సామాజిక సేవా విభాగంలో దియా ఎంపికైంది.

Current Affairs

జాతీయ అవార్డులకు 4 పంచాయతీల ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నాలుగు పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మసముద్రం ఎంపికైంది. తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి, పరిశుభ్రత-పచ్చదనంలో అదే జిల్లా అనకాపల్లి గ్రామీణ మండలంలోని తగరంపూడి, సామాజిక న్యాయం, భద్రత విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీ జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి.  దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారం కింద అవార్డుకు ఎంపికైన ఒక్కో పంచాయతీకి కేంద్రప్రభుత్వం రూ.కోటి చొప్పున అందజేస్తుంది.

Government Jobs

Various Posts In NIMHANS

National Institute of Mental Health and Neuro Sciences, Bangalore is inviting applications for filling up Group-B, Group-C posts.  No. of Posts: 23 Details: 1. Junior Scientific Officer (Sub Specialty Block)- 01 Post 2. Stenographer Grade-2: 20 Posts 3. Electrician: 02 Posts Qualification: Tenth, ITI, Degree, MD/ MBBS along with English typing speed and work experience as per the post. Salary: Per month  Rs.44,900- 1,42,400 for the post of Junior Scientific Officer;  Rs.25,500- Rs.81,100 for Stenographer and Electrician posts. Age Limit: 35 years for Junior Scientific Officer; 27 years for Stenographer Grade-II; Electrician post should not exceed 30 years. Selection Process: Based on Skill Test, Typing Test, Shortlisting etc. Application Procedure: Apply through offline. Address: The Director, NIMHANS, P,B.No.2900, Bangalore. Last date for application: 04-01-2025. Website:https://nimhans.ac.in/

Government Jobs

Assistant Manager Posts In IIFCL, New Delhi

India Infrastructure Finance Company Limited (IIFCL), Delhi, a Central Government Organization is inviting applications for filling up the vacancies of Officers in Grade-A on regular basis. No. of Posts: 40 Details:  Project Financing, Stressed Asset Management, Accounts, Resource and Treasury, Information Technology, Legal, Secretarial Functions, Corporate Social Responsibility, Environment and Social Safeguard, Risk Management, Procurement, Human Resource, Research and Analysis, Rajbhasha, Compliance and Audit, Corporate Communications, General. Qualification: Diploma, Degree, BA, CA, CMA/ ICWA, CFA, LLB, LLM in relevant discipline along with work experience. Basic Pay Scale: Rs.44,500 per month. Age Limit: Should be between 21-30 years as on 30th November 2024. Selection Process: Based on Online Examination, Interview etc. Exam Center: In major cities of the country. Application Fee: SC/ST, PwBD Rs.100; Others Rs.600. Last date of online application: 23-12-2024. Online Exam Date: January 2025 Website:https://www.iifcl.in/

Government Jobs

ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో వివిధ పోస్టులు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) గ్రూప్‌-బి, గ్రూ-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 23 వివరాలు: 1. జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌)- 01 పోస్టు 2. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2: 20 పోస్టులు 3. ఎలక్ట్రీషియన్‌: 02 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఐటీఐ, డిగ్రీ, ఎండీ/ ఎంబీబీఎస్‌, ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌, ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ.44,900- 1,42,400;  స్టెనోగ్రాఫర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు రూ.25,500- రూ.81,100. వయో పరిమితి: జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 కు 27 ఏళ్లు; ఎలక్ట్రీషియన్‌ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చిరునామా: ది డైరెక్టర్‌, ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్ఎస్‌, పి,బి.నెం.2900, బెంగళూరు. దరఖాస్తుకు చివరి తేదీ: 04-01-2025. Website:https://nimhans.ac.in/

Government Jobs

ఐఐఎఫ్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)  రెగ్యులర్‌ ప్రాతిపదికన గ్రేడ్‌-ఏ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 40 వివరాలు:  విభాగాలు: ప్రాజెక్ట్‌ ఫైనాన్సింగ్‌, స్ట్రెస్‌డ్‌ అసెట్‌ మేనేజిమెంట్‌, అకౌంట్స్‌,  రిసోర్స్‌ అండ్‌ ట్రెజరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్‌, సెక్రటేరియల్‌ ఫంక్షన్స్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ సేఫ్‌గార్డ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొక్యూర్‌మెంట్‌, హ్యుమన్‌ రిసోర్స్‌, రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌,  రాజ్‌భాష, కంప్లైన్స్‌ అండ్‌ ఆడిట్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌,  జనరల్‌. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఏ, సీఏ, సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.44,500. వయోపరిమితి: నవబంర్‌ 30, 2024 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. పరీక్ష సెంటర్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ.100; ఇతరులు రూ.600. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-12-2024. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి 2025. ఇంటర్వ్యూ తేదీ: జనవరి/ ఫిబ్రవరి Website:https://www.iifcl.in/

Current Affairs

World Soil Day

♦ World Soil Day is observed annually on 5 December for give attention on the importance of healthy soil and advocating for the sustainable management of soil resources. ♦ In December 2013 the UN General Assembly responded by designating 5 December 2014 as the first official World Soil Day. ♦ The date of 5 December for World Soil Day was chosen because it corresponds with the official birthday of H.M King Bhumibol Adulyadej, the King of Thailand, who officially sanctioned the event. ♦ 2024 theme: 'Caring for Soils: Measure, Monitor, Manage'

Current Affairs

International Volunteer Day (IVD)

♦ International Volunteer Day (IVD) is observed every year on December 5 to commemorate the contributions of volunteers globally. ♦ The day was established by the United Nations General Assembly in December 1985. ♦ According to UNDP, in 2024, over 13,000 on-site UN Volunteers have served with over 70 UN entities and missions as part of the UN Volunteers programme, which is proudly hosted by the United Nations Development Programme.