Posts

Current Affairs

ఐఎన్‌ఎస్‌ కల్వరి

భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరి 57వ వార్షికోత్సవాన్ని 2024, డిసెంబరు 8న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. 1967 డిసెంబరు 8న ఐఎన్‌ఎస్‌ కల్వరిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్కే బీచ్‌లోని కురుసురా జలాంతర్గామి మ్యూజియం ప్రాంగణంలో ఛాయాచిత్ర, యుద్ధపరికరాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

Current Affairs

అత్యంత సూక్ష్మ రోబో

ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబోను అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇలాంటి 30వేల రోబోలు ఒక సూది మొనపై ఇమిడిపోతాయి. ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కదలికల సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇది కాంతి తరంగాలతో సులువుగా చర్యలు జరపగలదు. శరీర కణజాల నమూనాలు సహా నిర్దిష్ట ప్రదేశాలకు అలవోకగా చేరుకోగలదు. విస్పష్ట ఫొటోలు తీయగలదు. వైద్య అవసరాలు, భౌతిక శాస్త్రంలో అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.  ఏమిటీ రోబో? డైఫ్రాక్టివ్‌ రోబోటిక్స్‌ అనే విధానం కోసం ప్రధానంగా ఈ రోబోను అభివృద్ధి చేశారు. దీనికి వెలుపలి నుంచి వైర్ల వంటి ఎలాంటి సాధనాల సంధానత ఉండదు. కదలికలు సాగించగల రోబోల విషయంలో కార్నెల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచ రికార్డును సాధించారు. గతంలో వీరు 40-70 మైక్రాన్ల రోబోను తయారుచేశారు. ప్రస్తుత డైఫ్రాక్టివ్‌ రోబో 2-5 మైక్రాన్ల పరిమాణాన్ని కలిగి ఉంది. ఒక మైక్రాన్‌ అంటే.. మీటరులో 10 లక్షల వంతు!

Current Affairs

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్‌

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా 2024, డిసెంబరు 7న నియమితుడయ్యాడు. ఇన్నాళ్లూ కార్యదర్శిగా ఉన్న జై షా ఇటీవలే ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడంతో దేవజిత్‌కు అవకాశం దక్కింది. మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటరైన దేవజిత్‌ బీసీసీఐలో సంయుక్త కార్యదర్శిగానూ కొనసాగుతున్నాడు.

Current Affairs

ఇందు చందోక్‌ కన్నుమూత

భారత్‌లో రేసింగ్‌కు చిరునామాగా నిలిచిన ఇందు చందోక్‌ 2024, డిసెంబరు 7న కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. కోల్‌కతాలో పుట్టిన ఇందు.. మద్రాస్‌కు వలస వచ్చి 1953లో మద్రాస్‌ మోటర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను స్థాపించారు. 1971లో భారత మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) స్థాపనలోనూ కీలకపాత్ర పోషించారు. 1978 నుంచి 1979 వరకు ఎఫ్‌ఎంఎస్‌సీఐకి అధ్యక్షులుగా వ్యవహరించారు. మద్రాస్‌కు దగ్గరలోని శ్రీపెరంబదూర్‌లో అంతర్జాతీయ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Current Affairs

రిషితకు హ్యాట్రిక్‌ టైటిల్‌

తెలంగాణ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి రిషిత రెడ్డి ఐటీఎఫ్‌ ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ జూనియర్స్‌లో వరుసగా మూడో టోర్నీలోనూ విజేతగా నిలిచింది. 2024, డిసెంబరు 7న జరిగిన జే100 టోర్నీలో ఫైనల్లో రిషిత 6-2, 7-5 తేడాతో వతనాబె (జపాన్‌)ను ఓడించింది. గత రెండు వారాల్లో రిషిత ఐటీఎఫ్‌ జే100, ఐటీఎఫ్‌ జే60 టోర్నీల్లోనూ విజయం సాధించింది.

Current Affairs

గౌట్‌

ఆస్ట్రేలియా స్ప్రింటర్‌ గౌట్‌ అండర్‌-16, 200 మీటర్ల విభాగంలో నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2024, డిసెంబరు 7న జరిగిన ఆస్ట్రేలియన్‌ ఆల్‌ స్కూల్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు 20.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో బోల్ట్‌ (20.13 సె) రికార్డును బద్దలు కొట్టాడు. 

Current Affairs

నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ

అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్‌లో మహాత్మా గాంధీ ప్రతిమను ఏర్పాటు చేశారు. నగరంలోని క్యాపిటల్‌ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్‌ జిమ్‌ పైలెన్‌ ఆవిష్కరించారు. అమెరికాలోని పసిఫిక్‌ వాయవ్య రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Current Affairs

సిక్కిం వర్సిటీలో రుతుక్రమ సెలవు

విద్యార్థినులకు సిక్కిం విశ్వవిద్యాలయం రుతుక్రమ సెలవు మంజూరు చేసింది. తమ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినులు నెలకు ఒక రోజు దీన్ని వినియోగించుకోవచ్చునని పేర్కొంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ లక్ష్మణ్‌ శర్మ 2024, డిసెంబరు 7న ప్రకటన విడుదల చేశారు.

Apprenticeship

Apprenticeship Posts In RITES, Gurugram

Rail India Technical and Economic Service (Rites)  Gurugram is invites applications for filling up 223 Apprenticeship Vacancies on contractual basis. Number of Posts: 223 Details: 1. Graduate Apprentice - 141 2. Diploma Apprentice- 36 3. Trade Apprentice - 46 Qualification: Engineering Diploma, ITI, Engineering Degree (BE/ B.Tech/ B.Arch) Non-Engineering Graduate (BA/ BBA/ B.Com/ B.Sc/ BCA) in relevant disciplines/ trades as per the post, and work experience. Salary: Per month Rs.14,000 for Graduate Apprentice; 12,000 for Diploma Apprentice; Trade Apprentice Rs.10,000.  Selection Process: Shortlisting of candidates will be done based on the merit list formed on the basis of percentage of marks obtained in the essential qualification applicable to the respective trade Last date of online application: 25-12-2024. Website:https://www.rites.com/

Government Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

కేరళలోని కొచ్చిన్‌షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 44 వివరాలు:  విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, నావల్‌ అర్కిటెక్చర్‌, సివిల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, హ్యుమన్‌ రిసోర్స్‌, ఫైనాన్స్‌. అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.80,280. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.1,000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-01-2025. Website:https://cochinshipyard.in/ Apply online:https://cdn.digialm.com/EForms/configuredHtml/32530/91824/Registration.html