Posts

Apprenticeship

Apprentice Posts In Indian Rare Earth Limited

The Indian Rare Earth Limited (IREL), located in Manavalakurichi, Kanyakumari District, Tamil Nadu State, invites applications for the following Graduate & Technician and Trade Apprentice posts. No. of Posts: 41 Details: 1. Graduate Apprentice: 04 2. Technical: 04 3. Trade Apprentice: 33 Departments: Electrical, Civil, Mechanical, Welder, Electronic/ Instrument Mechanic, Turner, Plumber, Fitter, Carpenter, Lab Assistant, PASAA etc. Qualification: BE, B.Sc, Diploma, ITI in the relevant discipline as per the post. Age Limit: Between 18 to 25 years. Selection Process: Based on educational marks, age ect. Application Procedure: Offline to The Chief Manager- HRM (Legal and ER), IREL Limited, Manavalakurichi, Kanyakumari District, Tamil Nadu. Application Deadline: 20.09.2025. Website:https://irel.co.in/

Current Affairs

జాతీయ అంతరిక్ష దినోత్సవం

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా (National Space Day) నిర్వహిస్తారు. అమెరికా, రష్యాల కంటే కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన భారత్‌ చంద్రయాన్‌-3తో చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫీగా దింపిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ (రష్యా), చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి ల్యాండర్, రోవర్‌ను పంపిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది. అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్‌-3 విజయాన్ని స్మరించుకోవడంతోపాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్‌ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఏటా ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. దీన్ని మొదటిసారి 2024లో నిర్వహించారు. 2025 నినాదం: "Leveraging Space Technology and Applications for Viksit Bharat 2047."

Current Affairs

అయిదోతరం యుద్ధవిమానాలకు స్వదేశీ ఇంజిన్లు

అయిదోతరం స్టెల్త్‌ యుద్ధవిమానాలు, వాటి ఇంజిన్లను దేశీయంగానే భారత్‌ అభివృద్ధి చేయనుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఫ్రాన్స్‌ కంపెనీ శాఫ్రాన్‌తో కలిసి ఇంజిన్‌ అభివృద్ధి పనిని భారత్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. అడ్వాన్స్డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఆమ్కా) పేరుతో భారత్‌ అయిదోతరం యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేస్తోంది. 

Current Affairs

దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు

గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రూ.62,408.45 కోట్లుగా (7.45 బిలియన్‌ డాలర్లు) నమోదయ్యాయి. 2023-24లోని రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  పరిమాణం పరంగా చూస్తే.. 2023-24లో భారత్‌ నుంచి 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2024-25లో 16,98,170 టన్నులకు పరిమితమయ్యాయి. 

Current Affairs

భారత్‌లో అమెరికా రాయబారిగా గోర్‌

భారత్‌కు తదుపరి రాయబారిగా తన సన్నిహితుడు సెర్గియో గోర్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2025, ఆగస్టు 23న వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైట్‌ హౌస్‌లో ట్రంప్‌నకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రత్యేక రాయబారి హోదాలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలనూ గోర్‌ పర్యవేక్షిస్తారని ట్రంప్‌ ప్రకటించారు.

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్‌ వలరివాన్‌ పసిడి గెలిచింది. తమిళనాడుకు చెందిన ఈమె ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లోనూ స్వర్ణంతో మెరిసింది. 2025, ఆగస్టు 23న షెమ్‌కెంట్‌ (కజకిస్థాన్‌)లో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌-అర్జున్‌ బబుతా జంట 17-11తో డింగ్‌కె లూ-గ్జిన్‌లూ పెంగ్‌ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. అర్జున్‌కు ఇది రెండో పసిడి. అర్జున్, రుద్రాంక్ష్ పటేల్, కిరణ్‌ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.

Current Affairs

క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో నాలుగు భిన్నమైన క్లబ్‌ల తరఫున వందేసి గోల్స్‌ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు. 2025, ఆగస్టు 23న సౌదీ సూపర్‌ కప్‌ ఫైనల్లో అల్‌ అహిల్‌పై పెనాల్టీని గోల్‌గా మలిచిన రొనాల్డో అల్‌ నాసర్‌ క్లబ్‌ తరుఫున వందో గోల్‌ నమోదు చేశాడు.   రియల్‌ మాడ్రిడ్‌ తరఫున 450 గోల్స్‌ సాధించిన రొనాల్డో.. మాంచెస్టర్‌ యునైటెడ్‌కు 145.. జువెంటస్‌కు 101 గోల్స్‌ కొట్టాడు.

Current Affairs

National Space Day

♦ National Space Day is celebrated every year in India on 23 August. ♦ The day celebrates the success of the Chandrayaan-3 mission, which accomplished a safe and soft landing of Vikram Lander on the lunar surface. ♦ The mission not only made India the fourth country to achieve the feat but also the first to land a rover near the southern polar region of the moon. ♦ The soft landing was followed by a successful deployment of the Pragyaan Rover on the lunar surface. ♦ Prime Minister Narendra Modi, during his visit to the Indian Space Research Organisation (ISRO) headquarters in Bengaluru on August 26, 2023, made the announcement to observe August 23 as National Space Day.  2025 theme: "Leveraging Space Technology and Applications for Viksit Bharat 2047."

Admissions

Free training for the unemployed under the auspices of SRTRI

Panchayati Raj and Rural Development Department- Government of Telangana invites applications from unemployed youth from rural areas interested in job-oriented technical training courses offered by Swami Ramananda Tirtha Gramin Sanstha Government of India and Government of Telangana under the Deen Dayal Upadhyaya Gramin Kaushalya Yojana (DDUGKY) scheme.  Details: 1. Accounts Assistant (Tally) 2. Computer Hardware Assistant 3. Auto Mobile 2 Wheeler Servicing 4. Solar System Installation & Service Eligibility: Candidates should have passed Degree (B.Com), Intermediate, 10th Class, ITI in the relevant discipline following the courses. Candidates should be from rural areas. Those who are in the middle of their studies are not eligible. Age Limit: 18 - 30 years. Course Duration: Three and a half months. Application Process: Offline. Address: Swami Ramananda Tirtha Rural Institution, Jalalpur (Village), Pochampally (Mandal), Yadadri Bhuvanagiri District, Telangana-508 284. Admission Date: 1st September 2025. Nearest Railway Stations: Bibi Nagar, Bhuvanagiri, Secunderabad. Bus No. 524 is available from Hyderabad-Dilsukh Nagar. For details contact: 9133908000, 9133908111, 9133908222, 9948466111 Website:https://www.srtri.com/

Current Affairs

Gore as US ambassador to India

♦ US President Donald Trump nominates Sergio Gor as the new US ambassador to India and special envoy for South and Central Asian Affairs on 23 August 2025. ♦ Gor has played a central role in Trump’s administration, overseeing the vetting of senior personnel choices across government. ♦ In November 2024, Trump named Gor as his director of the White House Presidential Personnel Office. ♦ Gor will succeed Eric Garcetti, who served as ambassador from 11 of May 2023 to 20 January 2025. Before Garcetti, Kenneth Juster held the role from 23rd November 2017, to 20th of January, 2021. ♦ Since Garcetti’s exit, interim Charge d’Affaires Jorgan K Andrews has been leading the US Embassy in India, taking over on 20th of January 2025.