Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ప్రతిభా ‘పురస్కారం’

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేతులమీదుగా ఆమె 2026, ఫిబ్రవరి 23న దిల్లీలో అందుకున్నారు. దిల్లీలో జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌డీసీ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి పురస్కారం ప్రదానం చేశారు. 

Current Affairs

ప్రహార్‌

కేంద్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 23న ‘‘ప్రహార్‌’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని ప్రారంభించింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు, వారికి ఆర్థిక సాయం చేసేవారికి, మద్దతు దారులకు నిధులు, ఆయుధాలు, ఆశ్రయం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని హోంశాఖ పేర్కొంది.  దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ఈ విధానానికి ఏడు స్తంభాల్లాంటి అంశాలను నిర్దేశించారు. 

Current Affairs

రాష్ట్రపతి భవన్‌లో రాజగోపాలాచారి విగ్రహం

స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక భారతీయ గవర్నర్‌ జనరల్‌ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. అశోక మండపం సమీపంలోని గ్రాండ్‌ ఓపెన్‌ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ ఎడ్విన్‌ లుట్యెన్స్‌ విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు.

Current Affairs

పార్లమెంటరీ మైత్రీ బృందాలు

విదేశీ పార్లమెంటు సభ్యులతో సంభాషణల ద్వారా ఆయా దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే సంకల్పంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 2026, ఫిబ్రవరి 23న పార్లమెంటరీ మైత్రీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 11 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 64 దేశాలతో సంబంధాల బలోపేతం కోసం ఇవి ఏర్పాటయ్యాయి. విపక్ష ప్రముఖ నేతలు శశి థరూర్, పి.చిదంబరం, గౌరవ్‌ గొగొయ్, సుప్రియా సూలే, అఖిలేశ్‌ యాదవ్‌ ఈ బృందాలకు ఛైర్‌పర్సన్లుగా నియమితులైనవారిలో ఉన్నారు. భాజపా నుంచి రవిశంకర్‌ ప్రసాద్, బైజయంత్‌ పాండా, నిశికాంత్‌ దుబే, అనురాగ్‌ ఠాకుర్‌లకు ఆ పదవులు దక్కాయి. మొత్తం ఏడు గ్రూపులకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు నేతృత్వం వహించనున్నారు.   ఈ బృందాలు ఆయా దేశాల పార్లమెంటు సభ్యులతో విభిన్న అంశాలపై సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు పంచుకుంటాయి.

Walkins

సమీర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(సమీర్‌) ప్రాజెక్ట్ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తొంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 29. వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 20 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌(మెకానికల్‌): 02 ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 05 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 01 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 30 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు; టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: 9, 10.03.2026. Website:https://sameer.gov.in/

Walkins

ఈఎస్ఐసీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్ఐసీ) ఫరీదాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల  భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 62 వివరాలు: 1. ప్రొఫెసర్ : 09 2. అసోసియేట్ ప్రొఫెసర్ : 28 3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 25 విభాగాలు: యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ మెడిసిన్, అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాలు... అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్‌ కు రూ.2,60,226. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,73,045. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,48,669. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026, మార్చి 11 వేదిక: ఫ్యాకల్టీ రిడింగ్ హాల్, అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఫరీదాబాద్. Website:https://esic.gov.in/recruitments

Government Jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (ఎస్‌సీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 116 వివరాలు: 1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 12  2. డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌  ఆడిట్): 104  అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026, ఫిబ్రవరి 23,  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15 -03-2026. Website:https://sbi.bank.in/web/careers/recruitment-results-archive

Government Jobs

డీఎంహెచ్‌ఓ విశాఖపట్నంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 20 వివరాలు: 1. ఫార్మసిస్ట్ గ్రేడ్-II - 04     2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II    - 04     3. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 05     4. లాస్ట్ గ్రేడ్ సర్వీస్  - 05     5  సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ - 02 అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన సంస్థ నుంచి డీఎంఎల్‌టీ/ఎంఎల్‌టీ/డీఫార్మసీ/ బీఫార్మసీ/ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫిజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం, విశాఖపట్నం. దరఖాస్తు చివరి తేదీ: 2026, పిబ్రవరి 26, Website:https://visakhapatnam.ap.gov.in/documents/

Government Jobs

డీఎంహెచ్‌ఓ విశాఖపట్నంలో కన్సల్టెంట్ ఉద్యోగాలు

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం (డీఎం అండ్‌ హెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 18 వివరాలు: 1. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ -04  2. చైల్డ్ సైకాలజిస్ట్ - 04 3. ఆప్టోమెట్రిస్ట్ - 03 4. ఫిజియోథెరపిస్ట్ - 02 5. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ - 02 6. డెంటల్ టెక్నీషియన్ - 02 7. కన్సల్టెంట్  - 01 అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ(ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్, పాథాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫిజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం, విశాఖపట్నం. దరఖాస్తు చివరి తేదీ: 2026, పిబ్రవరి 26, Website:https://visakhapatnam.ap.gov.in/documents/

Admissions

ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (ఐఐఐటీఎం) 2026 విద్యాసంవత్సరానికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్‌ను ప్రారంభించింది. డేటా ఆధారితంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలతో పాటు నిర్వహణ పరిజ్ఞానం అందించడం ద్వారా కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తు అవసరాలకు మానవవనరులను తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్‌ ప్రధాన లక్ష్యం. వివరాలు: బీఎస్‌ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్)  అర్హతలు: ఇంటర్మీడియట్‌, డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. మొదటి బ్యాచ్‌ జూన్‌ 2026లో ప్రారంభమవుతాయి. మే 30 వరకు రిజిస్ట్రేషకు చేసుకునేందుకు అవకాశం ఉంది. వయోపరిమితి, సీట్ల పరిమితి లేదు. ఈ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన అనంతరం కన్సల్టింగ్‌ - ఫైనాన్స్‌, టెక్నాలజీ, మ్యానుఫాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌, పాలసీ తదితర రంగాల్లో అద్భుతమైన ఉద్యోగవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30.05.2026. Website:https://study.iitm.ac.in/mg/