సీనియర్ రెసిడెంట్ పోస్టులు
మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ (గ్రూప్ ఏ) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 103 (అన్ రిజర్వ్‌డ్-31; ఓబీసీ-32; ఎస్సీ-20; ఎస్టీ-10; ఈడబ్ల్యూఎస్- 10) వివరాలు: విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ హెమటాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్ సర్జరీ, న్యూరాలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్/ ఎండీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.67,700. వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250; దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, ఉద్యోగానుభం, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ క్యాంపస్, మిహన్, నాగ్‌పుర్. Website:https://aiimsnagpur.edu.in/